Kapu PrasthanamKapu Prasthanam

1983 లో కాపు (Kapu) తదితర వర్గాలు టీడీపీకి (TDP) మద్దతు నిచ్చారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక 85 నుండి కాపులు టీడీపీ ప్రభుత్వంతో గొడవలు పెట్టుకోవడం మొదలు పెట్టారు.

1989 లో టీడీపీని ఓడించి కాపులు కాంగ్రెస్ (Congress) ను గెలిపించారు. అయితే అధికారంలో ఉన్న కాంగ్రెసుతో 1992 నుండే కాపులు గొడవలు పెట్టుకోవడం మొదలు పెట్టారు.

1994లో కాపులు మళ్లీ టీడీపీకి మద్దతు నిచ్చారు. కానీ కాపులు సన్యాసం తీసికొని హక్కులు విషయం మరిచి పోయారు. పాలక పార్టీలకు (Ruling Parties) తొత్తులుగా మారిపోయారు.

1998 లో దాసరి (Dasari Narayana Rao) పార్టీ పెట్టినా గానీ కాపులు ఆ రెండు పాలక పార్టీలతోనే ఉన్నారు. 1999లో మెజారిటీ కాపులు కాంగ్రెసుతోనే ఉన్నారు. కాంగ్రెస్ అంతర్గత కుమ్ములాటలులో కాపులు బలైపోయారు. గెలిచినా టీడీపీతో స్పర్ధలు పెంచుకోవడం మళ్ళీ మొదలు పెట్టారు. అయితే హక్కులు విషయం మళ్లీ మరిచి పోయారు.

కాపులు 2004 లో కాంగ్రెస్ వైపుకు మల్లి కాంగ్రెసుని గెలిపించారు. టీడీపీని ఓడించారు.
అయితే గెలిచినా రాజశేఖర్ రెడ్డితో (Rajasekar Reddy) గొడవ పెట్టుకోలేదు గాని. మౌనంతో హక్కుల మాట మళ్లీ మరిచారు.

2009 విషయం మీ అందరికీ తెలిసిందే…

2014 లో కాపులు మరల టీడీపీకి మద్దతు నిచ్చారు. కాంగ్రెసుని ఓడించారు. అయితే టీడీపీతో సఖ్యంగా ఉండాలిసిన కాపులు ఉద్యమాలు (Kapu agitations) మొదలు పెట్టారు. హక్కులపై పోరాటం అంటూ టీడీపీ ప్రభుత్వంతో గొడవలు పెట్టుకొన్నారు.

మొత్తం మీద కోపంతో ప్రతిపక్షాన్ని గెలిపించడం… గెలిచిన పార్టీతో తరువాత గొడవలు పెట్టుకోవడమే కాపుల ప్రస్థానంగా (Kapu prasthanam) ఉంటూ వచ్చింది. నాకు తెలిసి నంతవరకు కాపులు ఒక పార్టీని నమ్ముకొని ఎప్పుడూ లేరు. లేదా ఒక పార్టీని పెట్టుకొని పోరాటం చేసిందీ లేదు. ఒకడిని నెగ్గించడం ఆ తరువాత ఆ ప్రభుత్వంతో గొడవలు పెట్టుకొని వాడిని ఓడించడం. ఇదే కాపు ప్రస్థానంగా సాగుతూ వచ్చింది.

ఇటువంటి పరిస్థితుల్లో కాపులు, తదితర వర్గాలు లేదా కాపులను నమ్ముకొన్న వారు ఎలా సంపాదిస్తారు. ఎలా ఎదుగుతారు. అందుకే కాపులు నీటికి పేదవారుగానే ఉండిపోయారు.

అయితే ముద్రగడ (Mudragada Padmanabham), తోట సుబ్బారావు (Thota subba Rao), పంతం పద్మనాధం (Pantham Padmanabham), మంగిన గంగయ్య (Mangina Gangaiah), సంగీతం వెంకట రెడ్డి (Sangeetham venkata Reddy) లాంటి పెద్దలు అడ్రస్ లేకుండా పోయారు. నాటి పిల్లకాయలు మాత్రం అన్నీ విధాలుగా ఎదిగారు. నేటి పెద్దలుగా చెలామణి అవుతున్నారు.

వారి ఎదుగుదలకి కారణం రంగా మరణమా (Ranga Death), లేక బానిస లౌక్యమా లేక పల్లకీలు మోతనా లేక వారి నాయకత్వమా అనేది మీరే నిర్ణయించుకోవాలి.

Akshara Satyam గా నాకు తెలిసింది మాత్రమే ఇక్కడ వివరించాను. మీ అభిప్రాయం వేరు అయితే తెలియ చేయగలరు. ఇది ఎవ్వరినీ కించ పరచాలని కాదు. యువతకు (Kapu Youth) కాపుల రాజకీయ ప్రస్తానం ఎలా జరిగింది. పల్లకీల మోతకే కాపులు ఎందుకు పరిమితం అయ్యారు అనే విషయాలు నేటి యువతకి తెలియాలి అనే ఉద్దేశంతో మాత్రమే చెప్పటానికి ప్రయత్నం చేసాను.

ఆలోచించండి… Rolling Stone gathers No Mass అనేది కాపులకు కరెక్టగా సూట్ అవుతాదేమో?

సమతామూర్తి విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ