టోక్యో ఒలింపిక్స్’లో రజిత పధకాన్ని సాధించిన మీరాబాయి చాను
నాడు కట్టెలు మోసిన మీరాబాయి చాను (Meera Bhai Chanu) టోక్యో ఒలింపిక్స్’లో (Tokyo Olympics) భారత దేశానికీ (India) తొలి (రజిత) పధకాన్ని సాధించి పెట్టింది. వెనకబడిన ఈశాన్య రాష్ట్రం మణిపుర్ (Manipur) నుంచి మీరాబాయి చాను వచ్చింది. ఇంఫాల్‌లోని నాంగ్‌పాక్ కాక్‌చింగ్‌లో 1994, ఆగస్టు 8న ఓ సాధారణ కుటుంబంలో మీరాబాయి చాను జన్మించింది.
బాల్యంలో ఎక్కువగా మగపిల్లలతో తిరగడంతో ఆమెనంతా సరదాగా ఆట పట్టించేవారు. బడికి వెళ్లే వయసులోనే చాను విలువిద్య నేర్చుకోవడం మొదలు పెట్టింది. ఎకుంజరాణి దేవి ప్పుడైతే వెలుగులు చూసిందో వెయిట్‌లిఫ్టింగ్‌ను ఆమె ఎంచుకుంది. అప్పుడు చనుకి వయస్సు 12 ఏళ్లు. సోదరుడితో కలిసి వంటకోసం కట్టెలు తీసుకొచ్చేందుకు అడవికి వెళుతూ ఉండేది. ఆ కట్టెల మోపులను మోయడమే వెయిట్‌లిఫ్టింగ్‌లో ఆమెకు లభించిన మొదట శిక్షణ. నాడు కట్టెలు మోసిన చేతులతోనే భారత దేశానికి రజిత పథకాన్ని సాధించి పెట్టడం ఎంతో గర్వకారణం.