దేశం కోసం వీరమరణం చెందిన అమరవీరుడు సిద్ది సుబ్బరామయ్య కుటుంబానికి వెంటనే పరిహారం ఇవ్వాలని సికా (ఇండియన్ కాపు అసోసియేషన్) కోరింది. సౌత్ ఇండియన్ కాపు అసోసియేషన్ (South India Kapu Association) కర్నూలు జిల్లా (Kurnool) శాఖ కర్నూలు నగరం శ్రీకృష్ణదేవరాయ సర్కిల్ (Sri Krishnadevaraya Circle) నందు పరిహారం తక్షణమే చెల్లించాలి అని ధర్నా చేసింది. ధర్నా ద్వారా ఏపీ ప్రభుత్వాన్ని (AP Government) పరిహారంపై డిమాండ్ చేశారు.
సిద్ది సుబ్బరామయ్య కుటుంబంను 30 రోజులు గడచినా ప్రభుత్వం ఆదుకోకపోవడం ఏమిటని సికా ప్రశ్నించింది. దేశంకోసం ప్రాణత్యాగం చేయడం నేరమా అని సౌత్ ఇండియన్ కాపు అసోసియేషన్ కర్నూలు జిల్లా శాఖ కోరింది. ఇటీవల గుంటూరు జిల్లాలో అమరవీరుడు పవన్ కుమార్ రెడ్డి మరణిస్తే 24 గంటలలో స్వయంగా హోమ్ మంత్రి సుచరిత ఇంటికివెళ్లి వారి కుటుంబంకు 50 లక్షల రూపాయలు పరిహారంగా ఇచ్చారు అని సికా తెలిపింది.
అయితే కర్నూలు జిల్లా అవుకు గ్రామానికి చెందిన సిద్ది సుబ్బరామయ్య కుటుంబం పట్ల ప్రభుత్వం పరిహారం ఇవ్వకుండా వివక్ష చూపడం సరికాదని సౌత్ ఇండియన్ కాపు అసోసియేషన్ కర్నూలు జిల్లా శాఖ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. గతంలో శ్రీకాకుళంజిల్లా బి.సి. వర్గానికి చెందిన లావేటి ఉమామహేశ్వరరావు అమరవీరుడు కుటుంబానికి ఎన్నో ఉద్యమాలు చేయగా 365 రోజులకు పరిహారం చెల్లించారు అని సీఎం కు సౌత్ ఇండియన్ కాపు అసోసియేషన్ కర్నూలు జిల్లా శాఖ గుర్తుచేశారు.
ఇప్పటికైనా యుద్దప్రాతిపదికన అమరవీరుడు కుటుంబంను ఆదుకోవాలని… అలానే ఇప్పటివరకు ఒక్క రూపాయికూడా ఇవ్వకుండా నిర్లక్ష్యంగా ఉన్న అధికారులును సెస్పెండ్ చేయాలి అని సికా కోరింది.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా శ్రీ ఆర్జా రామకృష్ణ గారు రాష్ట్ర కాపునాడు అధ్యక్షులు కర్ర మహేంద్ర ఎస్సీ ఎస్ టి బిసి మైనారిటీ స్టేట్ ప్రెసిడెంట్ డి ప్రేమ్ కుమార్, డి ప్రభాకర్ బలిజ సంఘం నాయకులు, ప్రతాప్ రెడ్డి… క్రిష్ణగిరి బలిజ సంఘం నాయకులు, దామోదరం రాధాకృష్ణ, దామోదరం సంజీవయ్య ఐక్యవేదిక అధ్యక్షుడు శ్రీనివాస రెడ్డి జనసేన పట్టణ అధ్యక్షులు కర్నూలు, సౌత్ ఇండియా కాపు అసోసియేషన్ నుండి వై పి వీరన్న కర్నూలు జిల్లా అధ్యక్షులు… దేవ సాని సుబ్బరాయుడు కర్నూలు జిల్లా సెక్రటరీ, సల్ల రమేష్ రాయల్ నంద్యాల పార్లమెంట్ అధ్యక్షులు, పత్తి శివరాం ప్రసాద్ నంద్యాల అసెంబ్లీ అధ్యక్షులు, కోనేటి మల్లికార్జున… శ్రీశైలం అసెంబ్లీ శాఖ అధ్యక్షులు, పసుపులేటి వెంకటేశ్వర్లు ఆత్మకూరు మండల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.