సోము వీర్రాజురాష్ట్ర ప్రభుత్వంపై భాజపా ధ్వజం
అన్నీ కేంద్రమే ఇస్తే మీరేం చేస్తారు: సోము వీర్రాజు
ఆస్తి పన్ను పెంచే కార్యక్రమానికి ‘జగనన్న గిచ్చుడు – జగనన్న బాదుడు’ (Jaganna Gicchudu-Jaganna badhudu) అని పేరు పెట్టాలని భాజపా (BJP) ఎద్దేవా చేసింది. ఉచిత పథకాలకు జగన్ (Jagan) పేరు పెడుతున్న రాష్ట్ర ప్రభుత్వం (State Government) పన్నులు బాదుడుకు కూడా జగన్ పేరు పెట్టడం చేయాలి అని ప్రశ్నించింది.
నగర, పట్టణ ప్రజలపై భారం పడేలా రూపొందించిన కొత్త ఆస్తి పన్ను విధానాన్ని వెంటనే నిలిపి వేయాలి. ఇళ్ల నుంచి చెత్త సేకరించడానికి వినియోగ రుసుము విధించడాన్ని కూడా విరమించు కోవాలంటూ భాజపా రాష్ట్రవ్యాప్తంగా బుధవారం ఆందోళనలు నిర్వహించింది.
‘అన్న వచ్చాడు.. పన్ను పెంచాడు’, ‘ఉచితాలు ఇచ్చుడు- పన్నులు పెంచుడు’ అని విమర్శలు చేస్తూ నిరసన తెలియజేసింది. రాష్ట్రంలో మౌలిక సదుపాయాల కల్పనకు కేంద్ర ప్రభుత్వమే నిధులు ఇస్తే. ఇక మీరేం చేస్తారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. కరోనా కష్టకాలంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను ఆదుకోవాల్సింది పోయి, పెంచిన పన్నుల భారాన్ని ప్రజలపై మోపుతున్నారని విమర్శించారు.
బుధవారం రాజముండ్రి (Rajahmundry) లోని భాజపా కార్యాలయంలో నిర్వహించిన ధర్నాలో సోము వీర్రాజు (Somu Veerraju) మాట్లాడారు. ఆస్తిపన్ను పెంపు, చెత్తపై పన్ను ప్రతిపాదనలను భాజపా తీవ్రంగా వ్యతిరేకిస్తుంది అని అన్నారు. రాష్ట్రంలో రోడ్లు, పార్కులు, కాలువల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయిస్తోందని సోము తెలిపారు. పట్టణాలు, నగరాల్లో స్వచ్ఛభారత్ కార్యక్రమం కింద చేపడుతున్న పనులకు కూడా ఎక్కువ నిధులను కేంద్రం ఇస్తోందని వీర్రాజు చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో ఎవరు ఎక్కువ నిధులు స్థానిక సంస్థల అభివృద్ధికి ఇస్తున్నారో అని దానిపై చర్చకు సిద్ధమా అని సోము వీర్రాజు సవాల్ విసిరారు.
రాష్ట్రంలోని అనేక చోట్ల బీజేపీ ఆధ్వర్యంలో ప్రభుత్వ పన్నులు విధానాలపై నిరసన కార్యక్రమాలు కొనసాగించారు.
జగనన్న గిచ్చుడు.. జగనన్న బాదుడు: జీవీఎల్
పట్టణాల్లో అభివృద్ధి, మౌలిక వసతుల పెంపునకు సంస్కరణలు చేపడితే అప్పులు తీసుకోవచ్చని 15వ ఆర్థిక సంఘం సిఫార్సు చేసిందన్నారు. అందుకే వైకాపా ప్రభుత్వం (YCP Government) మరిన్ని అప్పుల కోసం పన్నుల పెంపును ముందుకు తెచ్చింది అని జీవిల్ అన్నారు. పైగా కేంద్ర ఆదేశాలతోనే ఆస్తి పన్ను పెంచుతున్నామని రాష్ట్ర ప్రభుత్వం, పట్టణ పౌరసమాఖ్య తదితరులు నిందలు వేస్తున్నారు అని అన్నారు. ఆస్తిపన్ను పెంపు రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశమని ప్రజలు గుర్తించాలని జీవీఎల్ (GVL) హితవు పలికారు.