Mega Brothers

మెగా కర్ణ (Mega Karna), మెగా లీడర్ చిరంజీవి (Chiranjeevi) జన్మదిన వేడుకలు (Birthday Celebrations) చాల ఘనంగా జరిగాయి. జై చిరంజీవ… అఫత్భాంధవ… నిత్య కృషీవలా… జై చిరంజీవ (Jai Chiranjeeva). రెండు తెలుగు రాష్ట్రాల్లో, తెలుగు చిత్రసీమలో, సోషల్‌ మీడియా (social Media)లో, ఏ పల్లెలో, పట్టణాల్లో, ఎక్కడ చూసినా, ఎటుచూసినా చిరంజీవి పేరే వినిపించింది. ప్రతీ ఒక్కరి నోట మెగాస్టార్ (Mega Star), మెగా కర్ణ అనే మంత్రం ప్రతిధ్వనించింది. తారాలోకం పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడానికి కారణమైంది. ఎక్కడ చూసినా పండగ వాతావరణం కనిపించింది.

చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ‘గాడ్‌ ఫాదర్‌’ (God Father), ‘భోళా శంకర్‌’ (Bhola Shankar) టైటిళ్లతో పాటు 154వ చిత్రానికి సంబంధించిన లుక్‌లను కూడా విడుదల చేశారు. మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Chandra Babu Naidu), తెలంగాణ మంత్రి కేటీఆర్‌ (KTR), సోము వీర్రాజు (Somu Veerraju) తో పాటు పలువురు రాజకీయ ప్రముఖులు, క్రికెటర్‌ సచిన్‌ టెండూల్కర్‌ (Sachin Tendulkar) సహా పలువురు సినిమా తారలు చిరంజీవికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియ జేసారు.

శుభాకాంక్షల వెల్లువ

చంద్రబాబు నాయుడు స్వయంగా ఫోన్‌లో చిరంజీవికి బర్త్‌ డే శుభాకాంక్షలు తెలియజేశారు. ‘‘కరోనా క్లిష్ట సమయంలో మీరు చేస్తున్న సేవా కార్యక్రమాలు ఎంతో బావున్నాయి. సమాజానికి అలాగే పరిశ్రమలో సినీ కార్మికులకు ఉపయోగపడేలా మీరు చేస్తున్న సవాకార్యక్రమాలు గమనిస్తున్నాను. చాలా మంచి కార్యక్రమాలు చేస్తూ సేవా ధృక్పథంతో ఉన్న మీకు నా శుభాభినందనలు’’ అని చంద్రబాబు మెచ్చుకొన్నారు.

చిరంజీవి ఇంటికి జనసేనాని (Janasenani)

తన అన్నయ్య చిరంజీవి ఇంటికి పవన్‌ కళ్యాణ్ (Pawan Kalyan) వెళ్లి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. రాఖీ పండుగ కూడా కలిసి రావడంతో సోదరులు ముగ్గురు తన సోదరీమణులతో రాఖీ కట్టించుకున్నారు. ‘‘అన్నయ్యను ఆరాధించే లక్షలాదిమందిలో నేను తొలి అభిమానిని. ఆయన నాకే కాదు ఎందరికో మార్గదర్శి, స్ఫూర్తిప్రదాత, ఆదర్శప్రాయుడు. ఆపదలో ఉన్నోళ్లను ఆదుకోవడానికి ముందుంటారు. దానలు, గుప్తదానాలెన్నో చేశారు. మా కుటుంబంలో అన్నయ్యగా పుట్టినా మమ్మల్ని తండ్రిగా చూసుకొన్నారు. తండ్రి స్థానంలో నిలిచారు’’ అని పవన్‌ కల్యాణ్‌ శుభాకాంక్షలు తెలిపారు.

పుట్టినరోజు, రాఖీలతో చెల్లెల్లు సందడి

ఇక కుటుంబ సభ్యులు, సినీ తారలు, అభిమానుల రాకతో మెగాస్టార్‌ ఇంటి వద్ద పాడగా వాతావరణం నెలకొంది. చిరంజీవి చెల్లెళ్లకు ఆదివారం డబుల్‌ సెలబ్రేషన్స్‌. అన్నయ్యకు రాఖీలు కట్టడంతో పాటు పుట్టినరోజును కూడా సెలబ్రేట్‌ చేసికొన్నారు. బ్లడ్‌ బ్యాంక్‌ దగ్గర అభిమానులు రక్తదానం చేశారు.

అభిమానులకి సన్మానం

చిరంజీవి పుట్టినరోజుని పురస్కరించుకుని శనివారం పలువురు మెగా అభిమానుల సన్మానం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మెగా బ్రదర్ (Mega Brother) నాగబాబు (Nagababu), దర్శకుడు మెహర్ రమేష్ పాల్గొన్నారు.  దర్శకుడు మెహర్ రమేష్ మాట్లాడుతూ పలు ఆశక్తి విషయాలు చెప్పారు. నా ఊహ తెలిసినప్పటి నుంచి చిరంజీవి గారి బర్త్ డే అంటే చాలా ఇష్టం. ఆయన ఎన్నో సేవాకార్యక్రమాలు చేశారు. ముఖ్యంగా కరోనా సమయంలో సినిమా పరిశ్రమ కార్మికులకు సీసీసీ ద్వారా నిత్యావసర సరుకులు అందచేసిన సంగతి తెలిసిందే. చిరంజీవి గారి అభిమానులుగా ఉండడం చాలా ఆనందంగా ఉంది’’ అని అన్నారు.

కాపు రిజర్వేషన్లకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది