జంగారెడ్డిగూడెం డివిజన్ పోలీసులకు ఎస్పీ ప్రశంశలు
జంగారెడ్డిగూడెం (Jangareddygudem) డివిజన్ పోలీసులకు (Police) పశ్చిమ గోదావరి జిల్లా (West Godavari District) ఎస్పీ (SP) నగదు పురస్కారం (Cash award), ప్రశంసా పత్రాలు అందచేశారు. పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం జల్లేరు వాగు దగ్గర ఈనెల 15వ తేదీ నాడు ఏపీఎస్ ఆర్టిసి బస్సు ప్రమాదం (Bus accident) జరిగిన విషయం విదితమే. ఆ ప్రమాద సమాచారాన్ని తెలుసుకున్న వెంటనే ప్రమాదం జరిగిన ప్రదేశానికి పోలీస్ అధికారులు చేరుకొని క్షతగాత్రులను దగ్గర్లో ఉన్న హాస్పిటల్’లో చేర్పించారు. అలాగే ప్రమాదంలో ఎక్కువ మరణాలు జరగకుండా విధినిర్వహణ చేసారు.
అందుకుగాను పశ్చిమగోదావరి జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ మంగళవారం జంగారెడ్డిగూడెం సీఐ పి బాల సురేష్ బాబు, ఎస్ఐ సాగర్ బాబు, హెడ్ కానిస్టేబుల్లు 1752 టి ఎర్రయ్య, 979 జే భీమశంకర్, కానిస్టేబుల్లు 23 13 ఆర్. ప్రకాష్ రెడ్డి, 1191 కె.ఎస్.అర్. కె రాజ బాబు, 1290 సిహెచ్ సత్యనారాయణలకు జిల్లా ఎస్పీ నగదు పురస్కారం తో పాటుగా ప్రశంసా పత్రాలు అందజేసారు.