ChristmasChristmas

హోప్ మినిస్ట్రీస్ (Hope ministries) ఆధ్వర్యంలో జర్నలిస్టుల (Journalists) క్రిస్ట్మస్ వేడుకలు (Christmas Celebrations) బుధవారం స్థానిక డీసీసీబీ కళ్యాణమండపంలో (Kalyana  Mandapam) ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా హోప్ మినిస్ట్రీస్ డైరెక్టర్ జాషువా గెడ్డం మాట్లాడుతూ పట్టణంలోని జర్నలిస్టులందరితో క్రిస్మస్ జరుపుకోవడం సంతోశంగా ఉందన్నారు. తమ సంస్థ ఆధ్వర్యంలో కోవిడ్ సమయంలో జంగారెడ్డిగూడెం డివిజన్’లోని పాస్టర్లకు, తెలంగాణాకు చెందిన 500 మంది పాస్టర్లకు ఆర్ధిక సహాయం,నిత్యావసర సరుకుల పంపిణీ చేసినట్లు చెప్పారు.

ఈ సంవత్సరం లో 16 బోర్లు వేసి పేద ప్రజలకు మంచినీటి సౌకర్యం కల్పించడం జరిగిందన్నారు. జంగారెడ్డిగూడెం పట్టణంలో నాలుగు లక్షల రూపాయల వ్యయంతో ఆరు వేల కుటుంబాలకు మంచినీటి సౌకర్యం కల్పించడానికి మున్సిపల్ కమీషనర్ శ్రావణ్ కుమార్ సహకారంతో త్వరలోనే ఆ పనులకు శంకుస్థాపన చేయనున్నట్లు చెప్పారు. అనంతరం పలువురు పాస్టర్లు క్రిస్టమస్ సందేశం అందించారు. విలేకరులంతా కొవ్వొత్తులను వెలిగించి,కేక్ కట్ చేసి ఒకరికొకరు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపు కున్నారు.

లయన్స్ క్లబ్ (Lions  Club) జంగారెడ్డిగూడెం (Jangareddygudem) అధ్యక్షులు, మాజీ జర్నలిస్టు పంతగాని వెంకన్న మాట్లాడుతూ జర్నలిస్టుల సేవలను గుర్తించి వారితో కలిసి క్రిస్మస్ జరుపుకోవడానికి ముందుకొచ్చిన హోప్ మినిస్ట్రీస్ డైరెక్టర్ జాషువా గెడ్డంకు జర్నలిస్టుల తరపున కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జంగారెడ్డిగూడెం పట్టణం, రూరల్ కు చెందిన ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా (Electronic Media) విలేకరులు పాల్గొన్నారు.

కాపుల జ్ఞాన నేత్రాలు తెరుచుకుంటేనే రాజ్యాధికారం?

కాపు ఉద్ధారకులారా! బూజుపట్టిన జ్ఞాననేత్రంతో ఆలోచించండి!!!