Alla naniAlla nani

శ్రీ వెంకటేశ్వర స్వామి 21వ వార్షిక బ్రోచర్’ను ఆవిష్కరించిన ఆళ్ల నాని

మారుతున్న కాలంతో పాటు యాంత్రికంగా మారిపోతున్న ప్రజల జీవన విధానాల్లో ఆధ్యాత్మిక చింతన (Devotional Life) కలిగి ఉండటం వల్ల నిస్వార్థం తో కూడిన ప్రశాంత జీవనం అలవడుతుందని మాజీ ఉపముఖ్యమంత్రి (Deputy CM), ఏలూరు శాసన సభ్యులు ఆళ్ల నాని (All Nani) తెలిపారు.

ఏలూరు (Eluru) రామచంద్రరావు పేటలో ఎన్నో ఏళ్లుగా ప్రజలచే పూజించబడుతున్న ప్రఖ్యాత శ్రీ వెంకటేశ్వర స్వామి (Venkateswara Swamy) వారి దేవస్థానంలో శ్రీ త్రిదండి చినజీయర్ స్వామీజీ (China Jiyar Swamyji), రామానుజ జీయర్ స్వామిజిల (Ramanuja Jeeyar Swamyji) మంగళ శాసనములతో సెప్టెంబర్9 నుంచి 10 వతేది వరకు జరగనున్న 21వ వార్షిక పవిత్రోత్సవాల బ్రోచర్’ను (Brocher) గురువారం ఉదయం ఏలూరులోని క్యాంపు కార్యాలయంలో ఆళ్ల నాని ఆవిష్కరించారు.

ఈసందర్భంగా పవిత్రోత్సవాలు ఘనంగా నిర్వహించాలని, ఉత్సవాలకు హాజరయ్యే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు నిర్వహించాలని ఆలయ పాలకవర్గ కమిటీకి  సూచించారు.

ఆర్.ఆర్ పేట శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం కి ఎంతో ప్రాముఖ్యత ఉందని, ఆ ప్రతిష్టాతను మరింత ఇనుమడింప చేసేలా ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించాలని ఆళ్ల నాని సూచించారు..

ఈ కార్యక్రమంలో ఆలయ పాలకవర్గ చైర్మన్ తోలేటి శ్రీనివాస్, సభ్యులు చోడే కిట్టు, కిలారపు బుజ్జి, తిప్పని మణి, కొండల అరుణ కుమారి, కిలాంబీ మారుతీ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

పర్యావరణ రక్షణ కోసం వస్త్ర సంచుల పంపిణీ

Spread the love