విధానాల మీద మాట్లాడమంటే వ్యక్తిగత విమర్శలు
రోడ్ల మరమ్మతులకు కేటాయింపులు కాదు..
నిధుల విడుదల, వ్యయం చూపండి
మీడియాతో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జనసేన అధ్యక్షుడు కందుల దుర్గేష్
రోడ్లు (Roads) అత్యంత అద్భుతంగా ఉన్నాయని చెబుతున్న వైసీపీ నేతలు (YCP Leaders), మంత్రులు (Ministers) ఒకసారి కంటి వైద్యులను సంప్రదిస్తే మేలు. అలాగే ప్రజా సమస్యలు (Public issues) అసలు వినిపించుకోని వైసీపీ మంత్రులూ (YCP Ministers) ప్రజా ప్రతినిధులు (Peoples representatives) వినికిడి పరీక్షలు చేయించుకుంటే ఇంకా అత్యుత్తమం… అని జనసేన పార్టీ (Janasena Party) ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా (East Godavari District) అధ్యక్షుడు కందుల దుర్గేష్ (Kandula Durgesh0 అధికార పార్టీ నాయకులకు, ప్రజాప్రతినిధులకు సూచించారు. సోమవారం ఆయన రాజమండ్రిలో (Rajahmundry) విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
ఈ సందర్భంగా కందుల దుర్గేష్ మాట్లాడుతూ “పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఏదైనా ప్రాంతంలో పర్యటనకు వెళితే ఆయా ప్రాంతంలోని మంత్రులకు డీ ఫ్యాక్టో ముఖ్యమంత్రి (De-fact0 Chief Minister) సజ్జల రామకృష్ణారెడ్డి (Sajjala Rama Krishna Reddy) నుంచి ఫోన్ వస్తుంది. ఏ పని లేని ఘోస్ట్ రైటర్స్ గా (Ghost writers) మారిన సలహాదారుల నుంచి స్క్రిప్ట్ వస్తుంది. ఇక మంత్రులు రెచ్చిపోవడం చాలా సాధారణ విషయం. పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ప్రజా సమస్యల మీద మాట్లాడితే దాని మీద ఏం చేశారో ప్రభుత్వం సమాధానం చెప్పాలి. వ్యక్తిగత హననం చేసి మాట్లాడితే మీ అధినేత కుటుంబ విషయాలు కూడా బయటికి తీయాల్సి వస్తుంది. అవి ఎంత భయంకరంగా ఉంటాయో మీకు తెలుసు. రాజ్యాంగ వ్యతిరేక శక్తులు ప్రభుత్వాన్ని నడిపిస్తున్నప్పుడు ఇలాంటి పరిస్థితులే ఉత్పన్నమవుతాయి అని కందుల దుర్గేష్ వైసీపీ ప్రభుత్వంపై (YCP Government) విరుచుకు పడ్డారు.
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకి చెందిన మంత్రి దాడిశెట్టి రాజా (Dadisetty Raja) పైనుంచి వచ్చిన స్క్రిప్ట్ చదవకపోతే రేపటికి ఆయన మంత్రి పదవి ఊడుతుంది. లేకుంటే ఆయనకు ప్రభుత్వ పెద్దల నుంచి సహకార ఆగిపోతుంది. ఇంతటి అరాచకం రాష్టంలో నడుస్తోంది. కాబట్టే మంత్రులు వారి ఆత్మ ప్రబోధానుసారం కాకుండా… సజ్జల ప్రబోధానుసారం నడుచుకుంటున్నారు అని దుర్గేష్ మంత్రి రాజాని దుయ్యబట్టారు.
60 శాతం వేసిన రోడ్లు ఏవి?
రోడ్లు దుస్థితి గురించి జనసేన పార్టీ (Janasena Party) డిజిటల్ క్యాంపెయిన్ (Digital Campaign) ప్రారంభించిన తర్వాత రోడ్లు భవనాల శాఖ మంత్రి దాడిశెట్టి రాజా జోకులు వేయడం మొదలుపెట్టారు. రాష్ట్రంలోని 60 శాతం రోడ్లు వర్షాలు రాకముందే పూర్తయ్యాయట… ఇక మిగిలిన 40 శాతం రోడ్లు వర్షాలు పూర్తయిన తర్వాత వేస్తారట. మరి ఇప్పటి వరకు వేసిన 60 శాతం రోడ్లు లెక్కలు చెప్పండి. నిన్న పశ్చిమగోదావరి జిల్లాలో (West Godavari) ఓ కానిస్టేబుల్ రోడ్డులో ఉన్న అతిపెద్ద గోతిలో పడి గాయాల పాలైతే జన సైనికులే అతన్ని కాపాడారు. ఇలాంటివి రాష్ట్రంలో రోజు నిత్యకృత్యం అని కందుల దుర్గేష్ విమర్శించారు.
మంత్రి రాజా జోకులు మని రోడ్లు సంగతి చుడండి
మంత్రి దాడిశెట్టి రాజా జోకులు వేయడం మాని, మత్తులో నుంచి అసలు నిజంలోకి రావాలి. ఆర్ అండ్ బి (R&B) శాఖకు రూ.2205 కోట్లు కేటాయించినట్లు మంత్రి చెప్పారు. కేటాయింపులకు, నిధులు విడుదలకు తేడా కూడా తెలియకుండా మంత్రి మాట్లాడడం హాస్యాస్పదం. కేటాయించిన నిధుల్లో విడుదల చేసినవి ఖర్చుపెట్టిన నిధులు ఎంతో లెక్క చెప్పండి. అప్పుడు మీ బాగోతం బయటపడుతుంది అని దుర్గేష్ అన్నారు.
ఇంత మంది వేదన మీకు కనిపించదా?
ఏ సమస్య మీద అయినా ప్రభుత్వాన్ని, పాలకులను ప్రశ్నించడమే జనసేన పార్టీ (Janasena Party) మెదటి ప్రాధాన్యం. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనూ ఉద్దానం సమస్యలు బయటకు తీసింది ఎవరు? దానిపై ప్రశ్నించింది ఎవరు? ఈ ప్రభుత్వ వైఫల్యాలు గురించి ఏం మాట్లాడినా గత ప్రభుత్వంతో ముడిపెట్టి చెబుతారు. గత ప్రభుత్వ హయాంలోనూ పవన్ కళ్యాణ్ ప్రజా సమస్యల మీద ప్రశ్నిస్తూనే ఉన్నారు. అప్పటి ఉద్దానం సమస్య మీద ప్రశ్నించిన తర్వాతే డాక్టర్ల బృందాన్ని అప్పటి ప్రభుత్వం పంపింది. అప్పటికప్పుడు డయాలసిస్ సెంటర్లు పెట్టి చర్యలు తీసుకుంది అని కందుల దుర్గేష్ వివరించారు.
వైసీపీ పాలకులకు (YCP Government) దున్నపోతు మీద వాన పడినా పట్టదు.. కనుక కనీస స్పందన ఉండదు. జనసేన పార్టీ (Janasena Party) ఆధ్వర్యంలో చేపట్టిన జనవాణి (Janavani) కార్యక్రమం మూడు విడతల్లో ఇప్పటివరకు సుమారు 1500 వినతులు వచ్చాయి. పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) గారికి సమస్య చెబితే దాని మీద ప్రభుత్వం స్పందన ఉంటుందని ప్రజలు నమ్ముతున్నారు. బాధితుల వేదన మాత్రం ఈ ప్రభుత్వానికి అర్థం కావడం లేదు. రాష్ట్రంలో ఏ సమస్య లేకపోతే ఇన్ని వినతులు ఎందుకు వస్తున్నాయి? అని కందుల దుర్గేష్ వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
పేకాట ఆడే మంత్రికి జోకర్లు తప్ప ఇంకేం కనిపిస్తాయి
మంత్రికి ఉదయం నిద్ర లేచిన దగ్గర నుంచి పేకాట ఆడే అద్భుతమైన శక్తి ఉంది. కాబట్టి ఆయనకు జోకర్లు, క్వీన్లు, ఆటిన్లు గుర్తుకు రావడం సహజం. అదే ఫ్లో లో, తన పేకాట సమయంలో జనసేన గుర్తుకు వచ్చి ఆ లాంగ్వేజ్ మాట్లాడుతున్నారు. నిత్యం పేకాటలో మునిగితేలే మంత్రికి జోకర్లు తప్ప ఇంకేం కనిపిస్తాయి. అన్ని శాఖలను ఒకే వ్యక్తి అనధికారికంగా చక్కబెడుతూ, ఎందుకు పనికి రాని ఈ మంత్రులను ప్రజలే జోకర్లు అనుకుంటున్నారు అని కందుల దుర్గేష్ ప్రభుత్వంపై విరుచుకు పడ్డారు.
క్రమంగా మద్యనిషేధం చేస్తామని సులువుగా పెంచేస్తున్నారు
పాదయాత్రలో అక్క చెల్లెమ్మల కన్నీళ్లు తుడుస్తానని ప్రతి ఏటా 20 శాతం మేర మద్య నిషేధం చేస్తామని చెప్పిన వ్యక్తి క్రమంగా మద్యం మీద వచ్చే ఆదాయమే ప్రధాన వనరుగా పాలన సాగిస్తున్నాడు. రాష్ట్రంలో కల్తీ మద్యం ఏరులై పారుతోంది. అనధికారిక లెక్కల ప్రకారం ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 5,000 మంది కల్తి మద్యం బారిన పడి మృత్యువాత పడ్డారు అని దుర్గేష్ అన్నారు.
విద్యారంగాన్ని (Education sector) సైతం కొత్త కొత్త పాలసీలతో (Policy) పూర్తిగా నిర్వీర్యం చేస్తున్నారు. బడులు పూర్తిగా దూరమై పిల్లలు పాఠశాలలకు వెళ్లాలంటేనే భయపడుతున్నారు. పవన్ కళ్యాణ్’ని శని ఆదివారాల్లో బయటకు వస్తారని చెబుతున్నారు. మీకు 365 రోజులు బయట ఉండి ప్రజాక్షేత్రంలో ప్రజా సమస్యలు తీర్చాలని అధికారం ఇచ్చారు కదా. మరి మీరేం చేస్తున్నారు..? అని కందుల దుర్గేష్ ప్రశ్నించారు.
ఈ సీఎం ఎప్పుడు బయటికి వచ్చినా పోలీసు రక్షణ లేకుండా రాలేడు. మీరా మమ్మల్ని విమర్శించేది..? రాష్ట్రంలో పోలీసులను అడ్డుపెట్టుకొని అరాచక పాలన సాగిస్తున్నారు. అనంతపురంలో ఇటీవల లలితా బాయి అనే మహిళ మాజీ మంత్రి శంకరనారాయణను రేషన్ కార్డుపై (Ration Card) ప్రశ్నించింది. అందుకని ఇటీవల ఆమెపై కేసు పెట్టారు. ఇలా రాష్ట్రంలో అనేక తప్పుడు కేసులు పెడుతూ ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేయాలని చూస్తున్నారు. మీ పాలనను ప్రజలు నిశితంగా గమనిస్తున్నారు. వారే తగిన బుద్ధి చెబుతారు” అని శ్రీ కందుల దుర్గేష్ వైసీపీ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
ఈ సమావేశంలో పార్టీ నేతలు అత్తి సత్యనారాయణ, వై.శ్రీనివాస్, మేడా గురుదత్ ప్రసాద్, మారెడ్డి శ్రీనివాస్, శ్రీమతి ముత్యాల ప్రియా సౌజన్య, చెరుకూరి రామారావు, తేజోమూర్తుల నరసింహమూర్తి, గేడ్డ నాగరాజు పాల్గొన్నారు.
జనసేన పార్టీ నాయకులూ చేసిన విమర్శలపై వైసీపీ (YCP) ఎలా ప్రతిస్పందిస్తుందో చూడాలి.