Pinnamaneni on Pamoline oilPinnamaneni on Pamoline oil

మెట్ట ప్రాంత పామాయిల్ రైతులును (Palmolein Oil farmers) ఆదుకోవాలని పోలవరం (Polavaram) శాసనసభ్యులు తెల్లం బాలరాజుకి (Tellam Balaraju) రైతులు మోమోరొండం అందజేశారు. ఈ సందర్భంగా టీ నర్సాపురం మండలం మక్కినవారిగూడెం గ్రామానికి చెందిన వైఎస్ఆర్ సీపీ నాయకులు (YSRCP Leader) పామాయిల్ రైతు అయినటువంటి పిన్నమనేని మురళీకృష్ణ (Pinnamaneni Kurali Krishna) మాట్లాడుతూ నవభారత్ పామాయిల్ ఫ్యాక్టరీ జోన్ పరిధిలో సుమారు 9 మండలాల్లోగల పామాయిల్ రైతులు మొక్కలు (Samples) లేక అనేక ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా నవభారత్ కంపెనీ (Nava Bharat Company) వారు మూడు సంవత్సరాల నుండి ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈ బీసీ మైనార్టీ మరియు అన్ని వర్గాలకు చెందిన రైతులకు పామాయిల్ వేసికోవడానికి నవభారత కంపెనీవారు పామాయిల్ మొక్కలు ఇవ్వడం లేదని ఆయన అన్నారు.

అందువలన రైతులు పామాయిల్ మొక్కలు (Palmolein samples) లేక అనేక ఇబ్బందులు పడుతున్నారు అన్నారు. అదేవిధంగా కనిష్ట ధర టన్నుకు 20000 ఉండేటట్లుగా ప్రభుత్వం వారు స్పందించాలని, 9 మండలాల రైతులు పంపింగ్ బోర్లు (Bore wells) మీద ఆధారపడి పంటలు పండిస్తున్నారు. కనుక వారికి సబ్సిడీ ఇవ్వాల్సిందిగా కోరారు. అదేవిధంగా డీజిల్ రేట్లు పెరిగిన కారణంగా ట్రాక్టర్ కిరాయి టన్నుకు 500 ఇవ్వాలని తమ సమస్యను ముఖ్యమంత్రి (Chief Minister) జగన్మోహన్ రెడ్డి (Jagan Mohan Reddy) దృష్టికి తీసుకెళ్లి రైతులను ఆదుకోవాలని ఆయన అన్నారు.

టాలెంట్ ఉన్న నూతన నటీ నటులను ప్రోత్సహించాలి: సి ఐ బాల సురేష్

Spread the love