Janasena formation dayJanasena formation day

జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రసంగంలోని ముఖ్యంశాలు:

వైసీపీ ఏమి జరగ కూడదు అని అనుకొంటున్నారో అది జరిగి తీరుతుంది. రాష్ట్రానికి అభివృద్ధి అంటే ఏమిటో చేసి చూపిస్తాం. జనసేన సత్తా ఏమిటో వైసీపీకి చూపిస్తాం. ఈ సారి గెలిచి వచ్చే ఆవిర్భావ సభ జరుపుకొందాం అంటూ జనసేనాని పవన్ కళ్యాణ్ తన ప్రసంగాన్ని ముగించారు.
జనసేన పార్టీ అసెంబ్లీలోకి వెళ్లే విధంగానే జనసేన వ్యూహాలు ఉంటాయి.
బీజేపీకి నేను అండగా ఉన్నాను. కానీ బీజేపీ మాత్రం నాకు అండగా లేదు.
తెలంగాణ బీజేపీ నాయకులు మాట్లాడిన మాటలు నన్ను బాధించాయి.
కోట్లకు కోట్లు దోచేస్తున్న వారిని నమ్ముతున్నారు. మీ కోసమే నా జీవితాన్ని త్యాగం చేస్తున్న నన్ను మాత్రమే నమ్మలేక పోతున్నారు.

 

జనసేన, బీజేపీ కలిసి పనిచేసి ఉండి ఉంటే టీడీపీ ఆలోచనే వచ్చి ఉండేది కాదు.
కార్మిక సంఘాలు, రాష్ట్ర ప్రభుతం నిలబడి ఉంటే వైజాగ్ స్టీల్ ప్లాంట్ కదిపి ఉండేవారు కాదు.
బీజేపీ జాతీయ నాయకులది ఒక మాట. రాష్ట్ర బీజేపీ నాయకులది మరో మాట.
బీజేపీ జాతీయ నాయకులు అండగా ఉంటే రాష్ట్ర బీజేపీ నాయకులు మాత్రం జనసేనకు అండగా లేరు. కారణాలు తెలియవు.
ధర్మాన్ని పట్టుకొని నిలబడితే ప్రజలు నన్ను వదిలేసారు. కానీ నేను ఇప్పటికీ ఆ ధర్మాన్నే నమ్ముకున్నాను.
దేశ భద్రత కోసమే మోడీకి మద్దతు నిచ్చాను. రాష్ట్రము కోసం, రాష్ట్రానికి అవసరమైన హోదా కోసం అటువంటి మోదీనే ఎదిరించాను. కానీ ఈ రాష్ట్ర ప్రజలు నన్ను అడ్డుకోలేదు.

మీరు నాకు నమ్మకం ఇస్తే ఒంటరిగా పోటీచేయడానికి జనసేన సిద్దమే.
జనసేన పార్టీపై అడ్డగోలుగా గ్లోబల్స్ ప్రచారం చేస్తే మాత్రం మీరు దిక్కులేని చావు చస్తారు.
నా కష్టార్జితంతో పార్టీని 10 సంవత్సరాలు నిలబెట్టింది. అణగారిన వర్గాల కోసమే. నాకు డబ్బు అవసరం లేదు. ఈ పార్టీ ఉన్నది దళితులు, బీసీలు, కాపులు కోసమే.

 

కాపులు నడుం బిగించి ముందుకు వస్తే మిగిలిన కులాలు కూడా కాపులు వెంట నడుస్తారు.
అన్ని కులాలను కలిపే పవన్ కళ్యాణ్ లాంటి నాయకుడు కాపుల్లో పుట్టడం కాపులకు గౌరవమే కదా.
కాపులను మోసం చేసిన జగన్’ని నమ్మారు. కాపులు కోసం, అణగారిన వర్గాల కోసం వస్తున్న నన్ను ఎందుకు నమ్మలేరు.
కాపు సామజిక వర్గంలో ఐక్యత లేదు. దీనికి పరిస్కారం ఏమిటి అనేది కాపు నాయకులు ఇప్పటివరకు చూపెట్టలేదు.
అన్ని కులాల కోసం నేను ఆలోచించినట్లు గానే నేను పుట్టిన కాపుల కోసం కూడా ఆలోచిస్తాను. నేను పుట్టిన కులం నుంచి ఎవ్వరు ఇప్పటివరకూ సీఎం కాలేదు. ఈ కులాల నుండి ఈ సారికి సీఎం అవ్వాలంటే కాపులు పెద్దన్న పాత్ర వహించాలి.
తాడిత పీడిత బాధిత కులాల కోసమే నిత్యం ఆలోచించే జనసేన పార్టీకి అండగా ఉండాలని ఈ కులాలను అభ్యర్ధిస్తున్నాను.
మీ బిడ్డల భవిత కోసం కులాలను దాటి జనసేన పార్టీకి ఓటు వేయండి.
ఈ సారికి జనసేన పార్టీకి మద్దతుగా నిలబెట్టండి. జనసేన పార్టీకి ఓటు వేయండి. నన్ను సీఎంగా ఎన్నుకోండి. పరివర్తన అంటే ఏమిటో చూపిస్తాను.

గతంలో తొడలు కొట్టిన దుర్యోధనుడికి పట్టిన గతే ఈ వైసీపీ నాయకులకు కూడా పడుతుంది.

 

వైసీపీకి మగతనం చూపించమంటారా. జనసేన పార్టీ అధికారంలోకి వచ్చాక మా మగతనం ఏమిటో చూపిస్తాం. మదమెక్కిన వైసీపీ నాయకుల్లారా గుర్తు పెట్టుకోండి. వాడితో సహా ఇస్తాం.

గంజాయి మతులు ఆంధ్ర ప్రదేశ్ యువత తూగుతున్నది. దీన్ని జనసేన పార్టీ కట్టడి చేస్తుంది. బ్లాక్ మార్కెట్ చేసేవాళ్ళని తుక్కు తీసి కూర్చో పెడతాం.

సంపూర్ణ మద్యపాన నిషేధం సాధ్యం కాదు అని ఆ రోజు చెప్పాను. ప్రజల ఇష్టం మేరకు నిషేధం చేస్తాను అని ఆ రోజు చెప్పాను. కానీ నన్ను ఆ రోజున నమ్మలేదు. కానీ జగన్ మోసపు హామీని నమ్మారు.
అన్ని కులాలకు సమప్రాధాన్యతనే జనసేన పార్టీ విధానం. ఉద్యోగుల సంఘ నాయకులు కూడా తమ కులపోల్లే ఉండాలా.

 

కేవలం ఒక్క కులమే అని పదవులు అనుభవిస్తుంటే మిగిలిన కులాలు ఏమైపోవాలి. దీన్ని రూపుమాపాలి అనేదే జనసేన విధానం.
క్రిమినల్ రాజకీయాలు పోవాలి. రాజకీయాల్లో జవాబుదారీ విధానం రావాలి అనేదే జనసేన విధానం.
అమరావతిని చిన్నగా కట్టండి అని చెప్పింది నేనే. ఆరోజు నన్ను అవహేళన చేసారు. ఈ రాజు అనుభవిస్తున్నారు.
రోజుకి అర్ధ రూపాయికి ఈ బిడ్డల భవితను అమ్మేసికొంటారా? పెద్దోళ్ళు, మేధావులు కూడా ఓట్లు అమ్మేసికొంటారా? ఇంకా ఎన్నాళ్ళు?

cps రద్దు చేస్తాను అని అధికారంలోకి వచ్చిన వ్యక్తి అదే cps రద్దు అనే విషయాన్ని మరిచిపోతే ఎందుకు నిలదీయలేక పోతున్నారు.

మద్యపానం నిషేధం అని అధికారంలోకి వచ్చిన వ్యక్తి మద్యాన్ని అమ్ముతుంటే ఎందుకు నిలబెట్టి అడగలేక పోతున్నారు.
వైసీపీ ప్రభుత్వంలో అడ్డగోలుగా దోచేస్తున్నారు. దీన్ని జనసేన పార్టీ అడ్డుకొంటుంది. అవినీతి లేని పాలనని జనసేన పార్టీ తీసికొస్తుంది.

బీజేపీ తొత్తు అయిన జగన్ నమ్మే ముస్లిం సమాజం జనసేనానిని ఎందుకు నమ్మడం లేదు.
ముస్లిం సోదరులకు అన్యాయం జరిగే పరిస్థితులు బీజేపీ ప్రభుత్వం నుండి వస్తే బీజేపీ నుండి కూడా బయటికి వచ్చేస్తా. ముస్లిం సోదరులారా నన్ను నమ్మండి.
కులాన్ని చూసి ఓటు వేయడం కాదు. నాయకుడి యొక్క గుణం చూసి ఓటు వేయడం నేర్చుకోండి. మీ ప్రవృత్తిని మంచిపై ఉంచండి.
అందరికీ ఉచిత విద్య అనేదే జనసేన లక్ష్యం

జనసేన పుట్టింది ఏదో ఒక్క కులం కోసం కాదు. అన్ని కులాల్లో ఉన్న వెనుకబడిన వారికోసమే జనసేన పుట్టింది.
నేను కాపుని అయితే నన్ను కాపులతోనే ఎందుకు తిట్టిస్తున్నారు.

రంగా గారు నన్ను చంపేస్తున్నారు అంటే అండగా వచ్చిన ఒక్క కాపు కూడా ఆరోజున లేరు. రంగా బ్రతికుండగా అండగా లేరు గాని నేడు రంగాగారికి పూలదండలు వేయడం వల్ల ప్రయోజనం ఏమిటి. కులాం అని కొట్టుకొని చావకండి.

కాపుల ఆరాధ్య దైవం అయిన వంగవీటి రంగా అంటే నాకు అమితమైన గౌరవం.
మీరు నాకు గాని అధికారం ఇస్తే మీ కుల నాయకుల చేత నేను పని చూపిస్తా. మీ జీవితాలను బాగు చేస్తా.
మీ కోసం, ఈ సమాజం కోసం నేను దూకేశా. కానీ మీరు అంతా నన్ను ఓడించేసారు. అయినా నేను మీకోసమే నిలబడ్డాను.
రోజుకి 2 5 కోట్లు తీసికొని సినిమా చేస్తున్న. ఇదే మీ కోసమే.
వెయ్యి కోట్లకు అమ్ముడుపోయాడు అనేవాడిని చెప్పుతో కొట్టాలి.

రిజర్వేషన్ అనేది మార్చలేము. అలానే అగ్ర కుల యువత ఆవేదన కూడా అర్ధం చేసికోదగినది. దీనికి జనసేన పరిస్కారం చూపుతుంది. జనసేన పార్టీకి అధికారం ఇవ్వండి.
రిజర్వేషన్లు పేరుతో పోట్లాడుకోవడం సమాజానికి మంచిది కాదు. అగ్రకుల యువతకి జనసేన అండగా ఉంటుంది.
ఒక్క కులం పెత్తనం ఈ ఆంధ్రలో ఆగిపోవాలి. అన్ని కులాలకు సమాన ఫలాలు దక్కాలి అంటే జనసేన అధికారంలోకి రావాలి.

ఎస్సీ ఎస్టీ, బీసీ సబ్ ప్లాన్ నిధులు డైవర్ట్ అయిపోతున్నాయి. దీనికి ఈ కులాల్లో ఐక్యత లేక పోవడమే.
ఈ కులాల్లో ఐక్యత కానీ వచ్చినట్లు అయితే మీదే అధికారం.
ఉత్పత్తి కులాలనుండి నాయకులను తయారు చేయడానికే జనసేన పుట్టింది.

కులాలు గురించే మాట్లాడడానికి మొదట్లో సిగ్గుపడేవాడిని. కానీ నేటి రాజకీయ వ్యవస్థ కులాల కుమ్ములాటలతో గబ్బు పట్టిపోయింది. దీన్ని మార్చాలి అంటే కులాలు గురించి మాట్లాడాలి. అందుకే మాట్లాడుతున్నా. ఇదే అంతా మార్పు కోసమే.

సమాజంలో పరివర్తన తీసికొని రావడానికి, ధర్మం నిలబెట్టడానికి, అవినీతిని అంతం చేయడానికి, కులాలను కలిపే పాలన తీసికొని రావడానికే జనసేన పార్టీ పెట్టింది.

ఒకప్పుడు నేను ఒక్కడినే. కానీ నేడు పులివెందులతో సహా మనకి కొన్ని వందల మంది క్రియాశీలక కార్యకర్తలు ఉన్నారు.

సుభాష్ చంద్ర బోస్, పొట్టి శ్రీరాములు, ఏరు దాటగానే తెప్ప తగుల పెట్టేస్తావా అనే సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి పాట, అణగారిన వర్గాల ఆక్రందనలే జనసేన అనే పార్టీ పెట్టడానికి నాకు స్ఫూర్తి.

2014 మార్చి 14 న పార్టీ పెట్టినప్పుడు ఒక్కడినే కానీ నేడు కొన్ని లక్షల మంది నా వెంట ఉన్నారు. ఇదే జనసేన సాధించిన మొదటి ఘనత అంటూ ప్రసంగ ప్రారంభించిన జనసేనాని.

ఈ సంవత్సరం 6,69,355 క్రియాశీలక సభ్యత్వం నమోదు అయ్యిందని ప్రకటించిన నాదెండ్ల మనోహర్

జనసేనానిపై వ్యక్తిగతంగా ఎన్ని విమర్శలు చేసినప్పటికీ ధైర్యంగా ఎదుర్కొని జనం కోసం పార్టీని కొనసాగిస్తున్నారు మన అధినేత పవన్ కళ్యాణ్.

జనసేన పార్టీ సాధించిన విజయాలను విపులంగా వివరిస్తున్న నాదెండ్ల మనోహర్

పొట్టి శ్రీరాములు, సుభాష్ చంద్ర బోస్, పింగళి వెంకయ్య లాంటి యోధులను స్వరించుకొంటూ ప్రసంగాన్ని ప్రారంభించిన నాదెండ్ల మనోహర్.

చనిపోయిన కౌలు రైతుల కుటుంబాలకు ఆర్ధిక సాయం అందించడం మొదలు పెట్టిన జనసేనాని పవన్ కళ్యాణ్.

సభా ప్రాంగణానికి చేరుకొన్న జనసేనాని పవన్ కళ్యాణ్

ప్రజాస్వామ్యం అనేది బూటకం. మనమే ఓట్లు వేసే ఎన్నుకొని వాడితోనే తన్నించుకొంటున్నాం. ఇప్పటికైనా వాస్తవాలు తెలిసికొనుడి. పవన్ కళ్యాణ్’ని ఎన్నుకోండి అన్న సంపత్ నాయక్.

ఇసుక బకాసురుడు జగన్ మోహన్ రెడ్డిని ఎన్నుకొంటారా లేక ఇసుకని ఉచితంగా ఇస్తాను అంటున్న పవన్ కళ్యాణ్’ని ఎన్నుకొంటారా మీరే నిర్ణయించుకండి: పాతిన మహేష్.

ముఖ్యమంత్రి ఎందుకు అంటే రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజలను దోచుకోవడానికే జగన్ సీఎం అయ్యింది అన్న జనసేన అధికార ప్రతినిధి విజయ్ కుమార్.

లిక్కర్’కి, కుక్కరులకి, ముక్కలకు అలవాటు పడి వైసీపీకి మరోసారి ఓటేస్తే రాష్ట్రాన్ని రుషికొండను మింగేసినట్లు మింగేస్తాడు: గుంటూరు జనసేసిన నాయకుడు.

జనసేనాని పవన్ కళ్యాణ్ సీఎం కావాలనేదే రాష్ట్ర ప్రజల అభీష్టం. దాని కోసమే జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పనిచేస్తారు: జనసేన పార్టీ ఆవిర్భావ సభ

 

పగలనక రాత్రనక సినిమాలు చేస్తూ, ఆ వచ్చిన డబ్బులను పార్టీ కోసం ఖర్చు పెడుతూ ప్రజల కోసం శ్రమిస్తున్న నిత్య శ్రామికుడు మన జనసేనాని పవన్ కళ్యాణ్: రాయపాటి అరుణ

పవన్ కళ్యాణ్’ని సీఎం చేయడమే మా జనసైనికుల, జనసేన నాయకుల లక్ష్యం అంటున్న జనసేన ఆవిర్భావ సభ.

కోడి కోడి గుడ్డు పెడతాడా అనేవాడు మనకి ఐటీ మంత్రి అంటూ చెలరేగి మాట్లాడుతున్న బొలిశెట్టి శ్రీనివాస్.

యువజన, శ్రామిక, రైతు కాంగ్రెస్ పార్టీ యువజనులకు, శ్రామికులకు, రైతులకు చేసింది ఏమిటి అంటున్న జనసేన పార్టీ ఆవిర్భావ సభ.

 

మరణించిన 51 రైతు కుటుంబాలకు సాయం అందించనున్న జనసేనాని పవన్ కళ్యాణ్.

మార్పు కోసం తరలివచ్చిన జనసైనికులతో కిటకిటలాడుతున్న జనసేన ఆవిర్భావ సభాస్థలి.

వారాహి మాతకి, వరహానికి తేడా తెలియని వాళ్ళు వైసీపీ నాయకులు. మర్యాదకి అమర్యాదకి తేడా తెలియని వాడు పేర్ని నాని అంటూ చెలరేగి పోయిన కందుల దుర్గేష్

జన సంద్రంగా మారిన మచిలీపట్నం. జనసైనికులతో నిండిపోయిన మచిలీపట్నం పరిసర ప్రాంతాలు.

 

జనసేన పార్టీ అధికారంలోకి రావాలి. పవన్ కళ్యాణ్ మాత్రమే సీఎం కావాలి అంటున్న జనసేన పార్టీ నాయకులు. సీఎం సీఎం అంటూ మారుమోగిపోతున్న జనసేన పార్టీ సభాస్థలి.

 

సభాస్థలిపై ఉద్వేగంతో కొనసాగుతున్న జనసేన నాయకుల ప్రసంగాలు.

జనసేనాని పవన్ కళ్యాణ్ చాల ఆలస్యంగా సుమారు 8 గంటలకు సభాస్థలికి చేరుకోవచ్చు.

విశేష స్పందన ఒక పక్కన మరొక పక్కన పోలీసు ఆంక్షల మధ్య ఆలస్యంగా సాగుతున్న సేనాని వారాహి యాత్ర.

 

సేనాని వెళుతున్న దారుల వెంట బారులుతీరిన జనాలు. హారతులు పడుతున్న మహిళలు.

ఇప్పటికే కిక్కిరిసిన సభాస్థలి. సామజిక చైతన్యాన్ని ఇస్తున్న సాంస్కృతిక కార్యక్రమాలు.

పొత్తులపై పవన్ కళ్యాణ్ ఏమంటాడో అని భయపడుతున్న చంద్రబాబు.

టీడీపీతో పవన్ ఎక్కడ తలుస్తాడో అని భయపడుతున్న వైసీపీ వైసీపీ అధినాయకులు.
పవన్ కళ్యాణ్’పై విరుచుకు పడడానికి కత్తులు నూరుతున్న కుల నాయకులు.

 

పోలీసు ఆంక్షలను తెలగించుకొంటూ సభాస్థలికి చేరుకొంటున్న జనసైనికులు.
మచిలీపట్టణం సభాస్థలికి బయలుదేరిన జనసేనాని పవన్ కళ్యాణ్.

సేనాని సందేశం కోసం మూడు చక్రాల రిక్షా నడుపుకొంటూ వస్తున్న వికలాంగుడైన ఒక వయోవృధుడు.

విజయవాడ నుండి మచిలీపట్టణం వరుకు ఇసుక వేస్తే రాలనంత జనం.

ఆంధ్రలోని అన్ని వాహనాలు మచిలీపట్టణం వైపే.

 

మచిలీపట్నంలో సింహ గర్జనకు సర్వం సిద్ధం