RamannapalemloRamannapalemlo

మత్య్సకారుల సంక్షేమానికి జనసేన కట్టుబడి ఉంటుంది
క్రియాశీలక సభ్యులు పార్టీకి విలువైన ఆస్తి..
వారిని కాపాడుకోవాల్సన బాధ్యత అందరిదీ
క్రియాశీలక సభ్యుడికి రూ. 5 లక్షల ఆర్ధిక సాయం
రామన్నపాలెంలో నాదెండ్ల మనోహర్

వైసీపీ ప్రభుత్వం (YCP Government) మత్స్యకారులను (Fishermen) చిన్నచూపు చూస్తోందని జనసేన పార్టీ (Janasena Party) పీఏసీ ఛైర్మన్ (PAC Chairmen) నాదెండ్ల మనోహర్ (Nadendla Manohar) స్పష్టం చేశారు. ఎన్నికల సమయంలో వచ్చి హామీలు ఇవ్వడం మినహా వారి సంక్షేమానికి ముఖ్యమంత్రి (CM Jagan) చేసిందేమీ లేదని మనోహర్ అన్నారు. మత్స్యకారులకు జనసేన పార్టీ అండగా ఉంటుందనీ, వారి సంక్షేమానికి (welfare of Fishermen) కట్టుబడి ఉంటుందని నాదెండ్ల మనోహర్ హామీ ఇచ్చారు.

తూర్పు గోదావరి జిల్లా (East Godavari District), యు. కొత్తపల్లి మండలం, రామన్నపాలెం గ్రామానికి చెందిన జనసేన పార్టీ క్రియాశీలక సభ్యుడు గెడ్డం రాజు ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. బుధవారం జిల్లా పర్యటనలో భాగంగా రాజు ఇంటికి వెళ్లి అతని భార్య శ్రీమతి దుర్గా భవానిని నాదెండ్ల మనోహర్ పరామర్శించారు. అతని మరణానికి కారణాలు తెలుసుకుని ధైర్యం చెప్పారు. పార్టీ క్రియాశీల సభ్యులకు అందచేసే రూ. 5 లక్షల బీమా చెక్కును ఆమెకు అందచేశారు. ఎలాంటి అవసరం వచ్చినా స్థానిక నాయకత్వం మొత్తం అండగా ఉంటుందని నాదెండ్ల భరోసా ఇచ్చారు.

అనంతరం స్థానిక మత్స్యకార యువత (Fishermen Youth) తమ సమస్యలు  నాదెండ్ల మనోహర్’కి చెప్పుకున్నారు. పెరిగిన ధరలకు అనుగుణంగా డీజిల్ సబ్సిడీ (Diesel subsidy) ఇస్తానని ఎన్నికల సమయంలో (Elections time) ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేదని, వేటకు వెళ్లే మత్స్యకారులు ఎదుర్కొంటున్న మొదలైన సమస్యలను నాదెండ్ల మనోహర్’కి వివరించారు.

ఈ సందర్భంగా  మనోహర్ గారు మాట్లాడుతూ… మత్య్సకారుల సమస్యలు పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ పీఏసీ సభ్యులు పంతం నానాజీ, ముత్తా శశిధర్, పార్టీ నాయకులు మాకినీడి శేషుకుమారి, తుమ్మల రామస్వామి, వై.శ్రీనివాస్, సంగిశెట్టి అశోక్, పొలాసపల్లి సరోజ, వాసిరెడ్డి శివప్రసాద్, చల్లా లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.

సీఎం సారూ జర లేవండి అంటున్న జనసేన