Ambedkar Vardhathi-J gudem Ambedkar Vardhathi-J gudem

పాల్గొన్న ఎంపీపీ, సర్పంచ్, అధికారులు

డాక్టర్ బిఆర్ అంబేద్కర్ (Ambedkar) వర్ధంతి (Death Anniversary) వేడుకలను జంగారెడ్డిగూడెం (Jangareddygudem) మండలం లక్కవరంలో ఘనంగా నిర్వహించారు. అనంతరం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి ప్రజా ప్రతినిధులు, ఉపాధ్యాయులు, అధికారులు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఎంపీపీ కొదమ జ్యోతి మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయాలను సాధించడమే అంబేద్కర్ ఘనమైన నివాళని తెలియజేశారు. అందుకొరకు అన్ని కులమతాలు ప్రజల ఐక్యత భారతదేశ (India) అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

గ్రామ సర్పంచ్ వెంకటరమణ మాట్లాడుతూ దళిత పంచాయతీ సాధన ఒకటే దళితుల అభివృద్ధికి మార్గమని ఈరోజు ఉన్నత స్థాయి పదవుల్లో ఉన్నామంటే ఆ మహానుభావుల దయని అంబేద్కర్ కులమతాలకు కాకుండా ప్రతి ఒక్కరికి రాజ్యాంగం రాశారన్నారు. అనంతరం కొద్దిసేపు మౌనం పాటించి నివాళులర్పించారు.

ఈ కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్ రామకృష్ణ, పంచాయతీ కార్యదర్శి నాగేశ్వరావు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ అశోక్ కుమార్ జడ్పీ హైస్కూల్ హెచ్ఎం ప్రేమ్ సాగర్, దల్లి నాగేశ్వరావు. విజ్జు వెంకటస్వామి నాయుడు వార్డు నెంబర్ గుమ్మల్ల అనిత దండే గాంధీ నిమ్మ గురునాథం కొదమ పద్మరాజు మల్లెలీ సూరి నారాయణ మెట్రో టీవీ రిపోర్టర్ కొదమ వెంకటేశ్వరవు పాస్టర్ రక్షణ రాజు పాల వెంకటేశ్వరవు మల్లెలీ రామకృష్ణ బి శ్రీనివాస్ అందుగుల లాజర్ మాండ్రు బోజ్జిబాబు. నవీన్ ఫణీంద్ర దుర్గారావ్ నాగేంద్ర బాలు తదితరులు పాల్గొన్నారు.

–జంగారెడ్డిగూడెం నుండి గరువు బాబురావు

హిట్ టాక్’తో దూసుకుపోతున్న అఖండ