కోవిడ్ నిబంధనలమేరకు గణేష్ ఉత్సవాలు!
గణేష్ ఉత్సవాలకు (Ganesh Festival) ఏపీ (AP) రాష్ట్ర హైకోర్టు (High Court) అనుమతి నిచ్చింది. ప్రైవేటు స్థలాల్లో వినాయక విగ్రహాల ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని(State Government) ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు (AP High Court) ఆదేశించింది. వినాయక చవితి (Vinayaka Chavithi) ఉత్సవాలపై దాఖలైన పిటిషిన్‌పై హైకోర్టులో నేడు విచారణ జరిగింది. నిబంధనలు పాటిస్తూ వినాయక పూజలకు అనుమతించాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.
ప్రైవేటు స్థలాల్లో గణేష్ ఉత్సవాలు నిర్వహించుకోవచ్చని ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. మతపరమైన కార్యక్రమాల నిర్వహణకు ప్రజలకు అధికారం ఉంటుందని.. వీటిని నిరోధించే హక్కు ప్రభుత్వాలకు లేదని హైకోర్టు స్పష్టం చేసింది. కొవిడ్ నిబంధనల మేరకు పూజలు చేసుకోవాలని హైకోర్టుసూచించింది. ఒకేసారి ఐదుగురికి మించకుండా పూజలు నిర్వహించుకోవచ్చునని న్యాయస్థానం వెల్లడించింది. పబ్లిక్ స్థలాల్లో ఉత్సవాలు నిర్వహించడంపై హైకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. ప్రైవేటు స్థలాల్లో మాత్రమే విగ్రహాల ఏర్పాటుకు అనుమతించాలని కోర్టు ఆదేశాలిచ్చింది.