mudragadamudragada

ఎన్నాళ్లీ పల్లకీల మోత అంటూ ముద్రగడ లేఖాస్త్రం

ముద్రగడ పద్మనాభం (Mudragada Padmanabham) ఆధ్వర్యంలో కొత్త పార్టీ (New Political Party) పెడతారని కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. ముద్రగడ (Mudragada) తాజాగా రాసిన లేఖతో ఆ దిశగా అడుగులు పడుతున్నట్లు కనిపిస్తోంది.పెద్దాయన (Pedhayana) ఆదిశగా కొంతమంది కాపు (Kapu), బీసీ BC), దళిత (Dalit) సంఘాల (Associations) నేతలతో ఇటీవల సమావేశమయ్యారు. త్వరలోనే కీలక ప్రకటన ఉంటుందని ప్రచారం కూడా జరుగుతోంది. తాజాగా ముద్రగడ పద్మనాభం రాసిన లేఖ ద్వారా కొత్త పార్టీపై పరోక్షంగా సంకేతాలు పంపినట్లు అయ్యింది. ఎన్నాళ్లీ మన పల్లకీల మోత (Annallee Pallakeela Motha) అంటూ దళిత, బీసీ, కాపులకు ఓ లేఖ రాశారు. ముద్రగడ రాసిన ఈ లేఖతో రాజకీయ వర్గాల్లో (Political Circles) ఆసక్తి నెలకొన్నది.

దళిత, బి.సి, కాపు సోదరులను చైతన్య పరచడానికి చాలా ముఖ్యమైన విషయం చెప్పాలను కున్నట్లు ముద్రగడ (Mudragada) తన లేఖలో ప్రస్తావించారు. మనం బానిసలం, తప్పు రాసావు, అలా వ్రాయకూడదని మీరందరూ అనుకుంటే క్షమాపణలు కోరతాను. ఈ విషయంపై పెద్ద మనస్సు పెట్టి లోతుగా ఆలోచన చేయమని కోరుకుంటున్నాను.

మనదేశానికి స్వాతంత్ర్యం (Independence) వచ్చిందే గాని మన జాతులకు మాత్రం రాలేదనే చెప్పాలి. ఇంచుమించుగా వారే చాలా సంవత్సరాలు రాజ్యాధికారం (Rajyadhikaram) అనుభవించారు. నేటికీ అనుభవిస్తున్నారు అని ముద్రడగా తన ఆవేదనని వెలిబుచ్చారు.

అధికారాన్ని గుంజుకుందాం?

అధికారం (Political Power) గుంజుకోవాలే తప్ప, బిక్షం వేయమని అడిగినా పాలకులు వేయరు. తక్కువ జనాభా కలిగిన వారు అధికారం ఎందుకు అనుభవించాలి. ఎక్కువ జనాభా కలిగిన మన జాతులు ఎందుకు అనుభవించ కూడదో ఒక్కసారి ఆలోచన చేయండి. ఎంత కాలం ఇలా పల్లకీలు మోయాలో తీవ్రంగా ఆలోచన చేయవలసిన అవసరం వచ్చింది. నిత్యం పల్లకీలు మోయించుకుని మన అవసరం తీరాక, పశువులకన్నా హీనంగా మనలను పాలకులు చూడడం జరుగుతున్న సంగతి మీకు తెలియనిది కాదు అని ముద్రగడ తన లేఖలో ప్రస్తావించారు.

మన జీవితాలు పల్లకీలు మోయడానికేనా?

మన జాతులు జీవితాలు పల్లకీలు మోయడానికేనా? ఎన్నటికి పల్లకీలో కూర్చునే అవకాశం తెచ్చుకోలేమా అన్నది ఒక్కసారి అలోచించండి. మన జాతులు బజారులో కొనుగోలు చేసే వస్తువుగా పల్లకీలో కూర్చునే వారి అభిప్రాయంగా కనిపిస్తున్నది. ఆ నింద పూర్తిగా మనం పోగొట్టు కోవాలి. సమూల మార్పు కోసం ప్రయత్నం చేస్తే సాధించలేనిది ఏమీ ఉండదు. వారు వారు చాలా ధనవంతులు. మన జాతులు మాత్రం గడ్డి పరకలాంటి వారు అని పాలకుల భావన. గడ్డి పరకకి విలువ ఉండదు. కానీ గడ్డి పరకలను మెలివేస్తే ఏనుగును కూడా బంధించవచ్చు అన్నది గుర్తుపెట్టుకోండి అంటూ ముద్రగడ తన లేఖలో కీలక అంశాలను ప్రస్తావించారు.

కుల పెద్దలకు ముద్రగడ పిలుపు

ఇతర గౌరవ బీసీ, దళిత నాయకులు సహకారం తీసుకుని బ్లూ ప్రింటు తయారు చేద్దాం. మనం చేసే ఆలోచనలు ఆర్భాటాలు, హడావిడి చేయకుండా చాప క్రింది నీరులాగ, భూమిలోపల వైరింగులాగ ఉండాలి. ఇది రాజ్యాధికారం కోసం చేసే విప్లవం (Revolution). శాశ్వత రాజ్యం కోసం అని మనం అనుకోవాలి. మనం ఎవ్వరికి వ్యతిరేకం కాదు.. ఈ రాష్ట్రం ఎవరి ఎస్టేటు కాదు, జాగీరు అంతకన్నా కాదు. ఇది అందరిది. వారు ఎన్ని సంవత్సరాలు అధికారం((Political Power) అనుభవించారో అదే విధంగా మనం మనం కూడా అనుభవించాలి. దీనికోసం మన పెద్దలు అందరూ తరచూ మాట్లాడుకుని మంచి ఆలోచన చేయాలి అంటూ ముద్రగడ తన లేఖలో పిలుపునిచ్చారు.

ఎన్నాళ్లీ పల్లకీల మోత అంటూ ముద్రగడ రాసిన లేఖ అణగారిన వర్గాలకు (Suppressed classes) కనువిప్పుకావాలి. అయితే ఈ లేఖ అణగారిన వర్గాలకు అధికారాన్ని కట్టబెట్టడానికా లేక అణగారిన వర్గాల నుండి వచ్చిన జనసేన (Janasena) లాంటి పార్టీలకు అడ్డుపెట్టడానికా? ముద్రగడ లాంటి అనుభవజ్ఞుడు ఈ వయస్సులో తప్పుడు నిర్ణయాలు తీసికొంటారు అని భావించడం కూడా సరి కాదేమో? ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు కాలమే సమాధానం చెబుతుంది.

మమ్ములను ఆదుకోండి: ప్రధానికి సీఎం జగన్ విన్నపాలు