Pawan Kalyan

తెలంగాణ రాష్ట్రం (Telangana State) రంగారెడ్డి జిల్లాలోని పల్లెచెల్క తండా, సరికొండ గ్రామాల విద్యార్థులు (Students) ఎదుర్కొంటున్న ఇబ్బందులు పడుతున్నారు. ఆ గ్రామీణ ప్రాంతాల నుంచి ముఖ్యంగా ఆడబిడ్డలు మేడిపల్లి, మాల్, ఇబ్రహీంపట్నం వెళ్ళి చదువు కొంటున్నారు. విద్యా సంస్థలు విడిచిపెట్టాక బస్సులు లేక నడిచి వెళ్లాల్సి వస్తోంది. అటవీ ప్రాంతం (Forest) కావడంతో చదువుకొనే పిల్లలు భయపడుతున్నారు. ఆర్టీసీ బస్సు (RTC Bus) సదుపాయం ఉన్నా సక్రమంగా నడపక పోవడం, తరచూ ఆ సర్వీసు రద్దు చేస్తుండటంతో పిల్లలు బిక్కు బిక్కుమంటూ నడిచి వెళ్తున్నారు అని పవన్ కళ్యాణ్ అన్నారు.

ఈ పరిస్థితిని మీడియా (Media) కూడా వెలుగులోకి తీసుకువచ్చింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం (Telangana State Government), ఆర్టీసీ యాజమాన్యం ఈ సమస్యపై స్పందించి విద్యార్థుల కోసం ప్రత్యేకంగా బస్సు నడపాలి. బస్సు సదుపాయం లేదనో, అటవీ ప్రాంతంలో నడిచేందుకు భయపడో విద్యార్థినులు చదువు మధ్యలో ఆపేసే పరిస్థితి రాకూడదు. ఈ దిశగా చర్యలు తీసుకోవాలి అని జనసేన పార్టీ అధినేత ఒక ప్రకటనలో కోరారు.

అనంతపురం నాయకులు భారీగా విరాళం-అభినందించిన కొణిదెల నాగబాబు

“నా సేన కోసం.. నా వంతు..”కు అనంతపురం అర్బన్ నుంచి అనంతపురం (Anantapuram) ఇంచార్జ్ టీ.సీ. వరుణ్, భవాని ప్రసాద్, బాబురావు, గల్లా హర్ష నేతృత్వంలో రూ. 6.5 లక్షలు విరాళం అందజేయడం అభినందనీయమని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు కొణిదెల నాగబాబు (Konidela Nagababu) స్పష్టం చేసారు.

అదే విధంగా అనంతపురం పట్టణ కమిటీ సభ్యులు జయరామిరెడ్డి, ఇమామ్ హుస్సేన్, మురళీ కృష్ణ, మేదర వెంకటేష్, సదానందం, రమణ, సిద్ధూ, హరీష్, లాల్ స్వామి, ఆది నారాయణ, అశోక్, రాజేంద్ర కృష్ణా, వెంకట కృష్ణ, దరజ్ భాష, విశ్వనాథ్, కృష్ణ, శేషాద్రి నేతృత్వంలో రూ. 2. 23 లక్షలు విరాళంగా అందజేసారని, అనంతపురం జిల్లా నుంచి 5 వేల మందికి పైగా ప్రజలు ప్రత్యక్షంగా విరాళాలు అందించారని నాగబాబు పేర్కొన్నారు.

దేవీ నవరాత్రుల అనంతరం ఘనంగా ఊరేగింపు

మద్ది అంజన్నకు ప్రత్యేక పూజలు: రూ. 1 .72 లక్షల ఆదాయం