MahilasadhikarathaWomens day at JSP

సామాజిక, ఆర్ధిక, రాజకీయ రంగాల్లో మహిళలు (Women) స్వావలంబన సాధించేలా జనసేన పార్టీ (Janasena Party) కృషి చేస్తుందని రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ (Political affairs committee chairmen) నాదెండ్ల మనోహర్ (Nadendla Manohar) తెలిపారు. మహిళా సాధికారితే లక్ష్యంగా జనసేన పని చేస్తుందని అయన తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికలను (Local Body Elections) నయానో భయానో ఏకగ్రీవం చేసుకోవాలన్న అధికార పార్టీ కుట్రలను మన వీర మహిళలు నాడు భగ్నం చేశారు. జనసేనాని (Janasenani) పిలుపు మేరకు ఆనాడు ఎన్నికల్లో ధైర్యంగా నిలబడి పోరాడింది మన మహిళలే అని నాదెండ్ల అన్నారు.

అంతర్జాతీయ మహిళా దినోత్సవం (International womes day) జనసేన పార్టీ (Janasena Party) ఆధ్వర్యంలో మంగళగిరి రాష్ట్ర కార్యాలయంలో (Mangalagiri party office) ఘనంగా జరిగింది.  నాదెండ్ల మనోహర్ ఈ సందర్భంగా మాట్లాడారు. “మహిళల ప్రాంతీయ కమిటీలు వేశాక జరుగుతున్న తొలి సమావేశం ఇది. రాష్ట్రాన్ని నాలుగు ప్రాంతాలుగా విభజించి నాలుగు రీజనల్ కమిటీలు వేశాం. ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి, కృష్ణా – పెన్నా, రాయలసీమ రీజనల్ కమిటీలను ఇప్పటి వరకు ఏర్పాటు చేశాం. తర్వలోనే జిల్లా, మండల, గ్రామ కమిటీలను కూడా నియమిస్తాం. క్షేత్రస్థాయిలో నిష్పక్షపాతంగా పనిచేసే మహిళలను గుర్తించి రీజనల్, జిల్లా కమిటీల్లో నియమించాలని శ్రీ పవన్ కళ్యాణ్ ఆదేశించారు. దానికి అనుగుణంగా కమిటీల్లో స్థానం కల్పిస్తాం అని నాదెండ్ల మనోహర్ అన్నారు.

అధికార పార్టీ అబద్ధాలను ఎండగట్టాలి

తమది సంక్షేమ ప్రభుత్వమని వైసీపీ నాయకులు (YCP Leaders) గొప్పగా చెప్పుకుంటున్నారు. వారి సంక్షేమం ప్రచారానికి మాత్రమే పరిమితమైంది తప్ప క్షేత్రస్థాయిలో లబ్ధిదారులకు చేరడం లేదు. అర్హులైన చాలా మంది మహిళలకు పెన్షన్లు (Pensions) అందడం లేదు. తాగునీరు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వేటకు వెళ్లి చనిపోయిన వ్యక్తుల కుటుంబాలకు నష్టపరిహారం ఇవ్వడంలో కూడా ప్రభుత్వం అలసత్వం వహిస్తోంది. ఇన్ని సమస్యలు పెట్టుకొని గొప్పగా ప్రచారం చేసుకుంటున్న ప్రభుత్వ తీరును వీర మహిళలు ఎండగట్టాలి.వీర మహిళ విభాగం క్షేత్రస్థాయిలో ప్రభుత్వ వైఫల్యాలపై పోరాటం చేయాలి అని మనోహర్ వివరించారు.

రాజకీయాల్లో ఓర్పు కావాలి

సోషల్ మీడియాలో (Social Media) కించపరిచారనో, అవమానించారనో వీర మహిళలు డీలా పడిపోవద్దు. రాజకీయ ప్రస్థానంలో ముందుకు వెళ్లాలంటే ఓర్పు ఎంతైనా అవసరం. బీఎస్పీ అధినేత్రి మాయవతిని (Mayavati) ఆదర్శంగా తీసుకోండి. అమరావతి మహిళా రైతులు అయితే దాదాపు 810 రోజులు ఉద్యమం చేశారు. తమ బిడ్డల భవిష్యత్తు కోసం కేసులు కూడా ఎదుర్కొన్నారు. వీళ్లను మనం స్ఫూర్తిగా తీసుకోవాలి. ఏ రాజకీయ పార్టీకి వీర మహిళ విభాగం వంటి విభాగం లేదు. జనసేన పార్టీకి మంచి పేరు తెచ్చేలా ధైర్యంగా ముందుకు దూసుకెళ్లండి అని నాదెండ్ల అన్నారు.

ఆవిర్భావ సభలో అతివలకు ప్రత్యేక ఏర్పాట్లు

గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం ఇప్పటం గ్రామంలో ఈ నెల 14న జనసేన పార్టీ ఆవిర్భావ సభకు (Janasena formation day) చక చక ఏర్పాట్లు జరుగుతున్నాయి. అధ్యక్షుల వారి సూచనల మేరకు సభా ప్రాంగణంలో మహిళల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నాం. వాళ్లకు సపరేట్ గా సీటింగ్’తో పాటు ఇన్ అండ్ ఎగ్జిట్ సపరేట్ గా ఉండేలా చర్యలు తీసుకుంటున్నాం. అలాగే టాయిలెట్లు ఏర్పాటు చేస్తున్నాం అని మనోహర్ వివరించారు.

మహిళా రైతులకు సత్కారం

అమరావతి రాజధాని (Amaravati Capital) ఉద్యమంలో అలుపెరుగని పోరాటం చేస్తున్న మహిళా రైతులు శ్రీమతి నంబూరి రాజ్యలక్ష్మి, శ్రీమతి కొవ్వాడ అన్నపూర్ణ, ప్రముఖ వయోలిన్ విద్వాంసురాలు శ్రీమతి బండమూడి సుమతిలను జనసేన పార్టీ వీర మహిళా విభాగం సత్కరించింది.

పార్టీ రాష్ట్ర కార్యదర్శులు శ్రీమతి ఆకేపాటి సుభాషిణి, శ్రీమతి ఘంటా స్వరూప, శ్రీమతి పొలాసపల్లి సరోజ, శ్రీమతి ప్రియా సౌజన్య, సంయుక్త కార్యదర్శి శ్రీమతి పోతిరెడ్డి అనిత, శ్రీకాళహస్తి ఇంఛార్జ్ శ్రీమతి కోట వినూత, వీరమహిళా విభావం రీజనల్ కమిటీ సభ్యులు శ్రీమతి ప్రియా సౌజన్య, శ్రీమతి కాట్నం విశాలి, శ్రీమతి కడలి ఈశ్వరి, శ్రీమతి చల్లా లక్ష్మి, శ్రీమతి షేక్ మొహమ్మద్ హసీనా బేగమ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

రాజకీయాలు ఆపి అసెంబ్లీకి రావడం మంచిది

Spread the love