Sheep FightSheep Fight

సమకాలీన సామజిక సమస్యలపై  Akshara Satyam వ్యాఖ్యానం:

పొట్టేళ్ల పోట్లాటలోకి దూరితే నలిగేది అణగారిన వర్గాలకు చెందిన చలిచీమలే అనే అక్షర సత్యాన్ని (Akshara satyam) చలి చీమలు (Ants) తెలిసికొనేది ఎప్పుడు? చెప్పడానికి ఎవ్వరైనా నడుం బిగించి వస్తే వారికి అండగా ఉండటానికి వీరిలో ఐక్యత వచ్చేది ఎప్పుడు?

ఒక పాలక వర్గానికి/ప్రభుత్వానికి, ఆ పార్టీ నుండి నెగ్గిన ఒక ప్రజాప్రతినిధికి మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమంటున్నది అని మీడియా (Media) సాక్షిగా నమ్ముతున్నారు. ఈ కుల మీడియా (Kula Media) మన పాలకుల ఇద్దరి పెరట్లోనిదే కదా అని ఆలోచించం. వీరిలో ఒకరికి మద్దతు నిస్తే మనకి బానిసత్వం పోతుందా? అధికార ఫలాలు వస్తాయా? అసలు వీరి పోట్లాట నిజమేనా. లేక ఇది హస్తిన పెద్దల స్క్రీన్ ప్లే డైరెక్షన్’లో భగ్గుమంటున్నట్లు కథను రక్తి కట్టిస్తున్నారా అనేది తెలుసుకోలేరు. అనాదిగా ఇలానే చలిచీమలు మోసపోతున్నది.

నిజరూపం ఏమిటి?

ఒక బలవంతుడిని / పాలకుడిని మనం ఎదిరిస్తే ఏమి చేస్తాడో అనే భయంతో అణగారిన వర్గాలకు చెందిన చలి చీమల్లా బతుకు బండిని జీవచ్ఛవంలా సాగిస్తుంటారు. అటువంటి సమయంలో ఎవరో మరొకరు వచ్చి ఆ బలవంతుడిని లేదా పాలకుడిని ఎదిరించడం మొదలు పెడతారు. అప్పుడు ఈ జీవచ్ఛవాల్లో స్పందన మొదలు అవుతుంది. ఆ బలవంతుడిని ఎదిరించేవాడికి హారతులు ఇవ్వడం మొదలు పెడతారు. పూజించడం మొదలు పెడతారు. ఇదే బానిస మనస్తత్వం (Banisha Mentality).

అసలు మనం పూజలు మొదలు పెడుతున్నది ఎవరిని? వాడి నిజ రూపం ఏమిటి? వాడు గతంలో మన అణగారిన వర్గాలకు చేసిన అన్యాయం ఏమిటి? వాడు గతంలో మన జాతుల నుండి వచ్చిన పార్టీలపై ఎలా బురద చల్లాడు? అసలు వాడు నిజాయితీ పరుడేనా? నిజాయితీ పరుడే అయితే నిన్నటి వరకు అవినీతి పార్టీలకు ఎందుకు మద్దతు నిచ్చాడు? ఇది వాడిలో వచ్చిన మార్పునా? వారిలో వారికి వచ్చిన కీచులాటల్లో నటిస్తున్నాడా? లేక పోట్లాడుకొంటున్నట్లు నటిస్తున్న ఆ రెండు పొట్టేళ్ల మధ్య ఏమైనా వాటాల్లో తేడాలు వచ్చినవా? లేదా తిరగబడుతున్న వాడు ఢిల్లీ పెద్దల చేతిలో కీలు బొమ్మనా? మొదలైన విషయాలను ఈ అణగారిన వర్గాలకు చెందిన చలి చీమలు అస్సలు పట్టించుకోవు. ఎందుకంటే ఇదే బానిస మనస్తత్వం.

నలిగిపోయేది చలిచీమలేనా?

రెండు దున్నపోతుల కీచులాటలోకి వెళితే నలిగిపోయేది చలిచీమలే అనే అక్షర సత్యాలను ఈ చెలి చీమలు గాని లేదా చలిచీమల సంఘాలు కానీ అస్సలు పట్టించుకోవు. మా అణగారిన వర్గాల పార్టీ నాయకుడు వీరి పోట్లాటకి ఎందుకు మద్దతు నివ్వడం లేదు అనే అంతర్గత పోరాటాన్ని కొందరు మొదలు పెట్టేస్తారు.

కిరీట దారి అయిన ఆ రెండో పొట్టేలుకు మా కుల సంఘ సంపూర్ణ మద్దతు అంటూ కొన్ని లెటర్ హెడ్ సంఘాలు తమ లెటర్ హెడ్స్ అమ్ముకోవడం మొదలు పెట్టేస్తుంటాయి.

చదువు సంస్కారం నేర్చుకున్నాము అని భావిస్తున్న కొన్ని తెలివైన ఆజ్ఞాన చలి చీమలు అయితే మరింత చొరవ చూపుతాయి. పాలక పొట్టేలు మీద ఉన్న కోపంతో కిరీటధారి అయిన రెండో పొట్టేలుకి అనుకూలంగా పోస్టులు పెట్టడం కొనసాస్తుంటారు.

వాడు మీద కోపంతో వీడికి వీడిమీద కోపంతో వాడికి. వారిద్దరి మీద కోవంతో మరొక కిరీట దారి అయిన పొట్టేలుకి మద్దతు నిచ్చికొంటూ పోతే మాకు అధికారం వచ్చేదెప్పుడు. ఆ రెండు పొట్టేళ్లు పోట్లాడుకొంటున్నట్లు నటిస్తున్నది అణగారినిన వర్గాల దృష్టిని మల్లించడానికే అని తెలిసికొనేదెప్పుడు.

ఎవరి పల్లకీ అయినా మేమె మోయాలా? ఎవరికి అయినా మేమే బాకాలు ఊదాలా? ఎవరికీ కొట్టుకొంటున్నా మేమే సమిధలం కావాలా? మీ ఆధిపత్య పోరాటాలకు మా రాధికారాన్ని బలి ఇవ్వాలా అనే విషయాలను ఈ చలి చీమలు తెలిసికొనేదెప్పుడు?

ఎన్నాళ్లీ మోసపోవడాలు?

ఎన్నాళ్లు ఈ బానిస మనస్త్వాలు. తరతరాలుగా నువ్వు మోసపోతున్నావు. ఎవడో ఒకడి పల్లకీ మోసుకొంటూ పోతే నువ్వు పల్లకీ ఎక్కేదెప్పుడు?

పొట్టేళ్ల పోరాటం వెనుక ఉన్న కుట్రల ను తెలిసికోండి. నీ పోరాట పటిమని ఎవరో ఒకరి పల్లకీలు మోయడానికి ఉపయోగించడం కాదు. మీ పల్లకీలు ఎక్కడానికి లేదా మీకు సహకారం అందిండానికి వస్తున్న వారి కోసమే మీ పోరాట పటిమని ఉపయోగించడం ఇకనైనా మొదలు పెట్టండి. ఆలోచించండి.

గమనిక: ఇది అణగారిన వర్గాల ఆవేదనకు కధా రూపమే గాని ఏ నాయకుడిని గాని లేదా ఏ కులాన్ని లేదా వర్గాన్ని ఉద్దేసించి కాదు.

Raghu Rama Krishna Raju Bail

… Akshara Satyam

Spread the love