సామాన్యుని మదిలో ప్రశ్నలకు సమాధానాలు (Answers to common man questions)
మనః సాక్షి (Sakhi) లేని ఆధిపత్య పత్రికలో/మీడియాలో (Media) కాపుకాసే వర్గంలో (Kapu Kase) అనుమానాలు మెదిలేటట్లు, కాపు కాసే యువతలో (Kapu Youth) విభజన వచ్చేటట్లు ఒక వార్త కధనం వచ్చింది. మన ఆధిపత్య మీడియాలో (Ruling media) వచ్చిన ఆ వివక్షాపూర్తిత వార్తను చుసిన వారికి కొన్ని ప్రశ్నలు రాక తప్పదు. వారి మదిలో రాబోయే లేదా వస్తున్న ఆ ప్రశ్నలకు సమాధానాలు చెప్పడానికి చేసిన చిరు ప్రయత్నమే నేటి ఈ మా ప్రత్యేక కధనం (Special Story).
అయితే ఆధిపత్య మీడియా (Media) చేస్తున్న విష ప్రచారాల్లో నిజమున్నదా లేక మేము ఇస్తున్న సమాధానాల్లో నిజమున్నదా అనేది ఆయా వర్గాలే నిర్ణయించుకోవాలి. తద్వారా తమ తమ పాలకులను ఎన్నుకోవాలి అని అణగారిన వర్గాల యువత (Youth of suppressed classes) నేడు గట్టిగా స్పందిస్తున్నది. వారి ఆవేదనల సమాహారమే ఈ మా ప్రత్యేక కధనం.
కాపులకు (Kapus) పవన్ అన్యాయం చేశాడా?
కాపులకు కావాల్సిన రిజర్వేషన్ల (Kapu Reservations) అంశాన్ని జనసేన తన మేనిఫెస్టో లో (Janasena Manifesto) పెట్టింది. 9 వ షెడ్యూల్లో (9th Schedule) కాపు రిజర్వేషన్ అంశాన్ని పెట్టేటట్లు చేస్తాను. రిజర్వేషన్ సాధిస్తాను అని పవన్ (Pawan Kalyan) నాడు ప్రతిపాదించారు. ఇదే తప్పు అని కుల సంఘాలు భావిస్తే కాపులకు పవన్ అన్యాయం చేసినట్లే.
పవన్ తన మేనిఫెస్టోలో పెట్టినందులకు కులసంఘాలకు (Kula sangam) కృతజ్ఞత కూడా లేదు. అయినా పైరవీల మీద నెట్టుకొచ్చే సంఘాలకు కృతజ్ఞత ఉంటుందా అనే కాపు యువత (Kapu Youth) ఆరోపణలు నిజమేనా అని ఒక్కోసారి అనిపిస్తున్నది.
పవన్ కాపు ఉద్యమాలకి మద్దతు నివ్వకుండా తప్పు చేశాడా?
కాపు ఉద్యమాలు (Kapu agitations) నేడు వైసీపీ ప్రభుత్వంపై (YCP Government) కూడా చేసి ఉంటే పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) చేసింది తప్పే అని భావించేవాళ్ళం. పవన్ ముద్దాయి అయి ఉండేవాడు. కానీ కమ్మ ప్రభుత్వాలు (Kamma Governments) ఉన్నప్పుడు కాపు ఉద్యమాలు చేసి… రెడ్డి ప్రభుత్వాలు (Reddy Governments) ఉన్నప్పుడు మౌనం వహిస్తే ప్రజలు ఏమనుకోవాలి. నాటి కాపు ఉద్యమాలు కాపుల కోసమా లేక రాజన్న కుటుంబం (Rajanna Family) కోసమా అని నేడు కాపు యువత ప్రశ్నిస్తున్నది.
దొడ్డలకు లాభం చేకూర్చడానికి చేసే ఉద్యమాలకు పవన్ కళ్యాణ్ ప్రత్యక్ష మద్దతు నివ్వకపోవడం ముమ్మాటికీ సరియైనదే. ఒక రాజకీయ పార్టీ అధినేతగా పవన్ చేసింది ముమ్మాటికీ సరియైనదే కాపులు భావిస్తున్నారు. .
కాపు సమస్యలపై బాబుతో పవన్ పోరాటం చేయలేదు?
కుల సమ్యస్యలపై (Problems of Kapus) పోరాటం చేయడానికి ఉద్యమ సంఘాలు (Udyama sangalu), కుల సంఘాలు ఉన్నాయి. వారే వీటిపై పోరాటం చెయ్యాలి. అంతే గాని రాజకీయ పార్టీలు (Political Parties) కులంపై ఎప్పుడు పోరాటం చెయ్యవు. సొంత కులంపై అస్సలు పోరాటం చెయ్యవు. అలా చేస్తే పార్టీకి ఆ పార్టీకి నూకలు ఉండవు.
అయినా టీడీపీ (TDP) కమ్మవారి (Kamma) సమస్యలపై బహిరంగ పోరాటం చేస్తున్నదా? అలానే వైసీపీ (YCP) రెడ్డి (Reddy) సమస్యలపై బహిరంగ పోరాటం చేస్తున్నదా? బీజేపీ బ్రాహ్మణుల సమస్యలపై బహిరంగ పోరాటం చేస్తున్నదా? మరి జనసేన ఎందుకు కాపుల సమస్యలపై బహిరంగ పోరాటం చెయ్యాలి? జనసేన ప్రజల కోసం వచ్చిందే గాని అమ్ముడుపోయే కులసంఘాల కోసం, ఉద్యమ సంఘాల కోసం వచ్చింది కాదు అంటూ కాపులు చైతన్యవంతులు అవుతున్నారు.
పవన్ కాపులకు ఎందుకు మద్దతునివ్వడం లేదు?
ఆ రెండు కుటుంబాల పల్లకీలు ఎంతకాలం మొయ్యాలి. ఇంకానా అని స్వయంగానే పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) అనేక మీటింగుల్లో అన్నారు. రాజ్యాధికారం ఆ రెండు వర్గాల నుండి మారాలి అని జనసేనాని (Janasenani) అనేక సభలో చెప్పారు. ఇది కుల సంఘాలకు అర్ధం కాక పోతే ఏమి చెయ్యాలి.
పవన్ బాబుకి ఎందకు మద్దతు నిచ్చారు?
పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టి పోటీచేయాలి అని భావిస్తున్న తరుణంలో పోటీచేస్తే ఊరుకొనేది లేదు అని ఇదే కుల సంఘాలు నాడు పచ్చ మీడియాకి (Pacha Media) ప్రకటనలు ఇచ్చారు. మన కులసంఘాలు నాడు పవన్ కళ్యాణ్’పై వత్తిడి కూడా తెచ్చాయి అనే చెప్పాలి. (ఈ విషయం నాకు కూడా ఒక రిటైర్డ్ జర్నలిస్ట్ ద్వారా తెలిసింది).
నేటి జగన్ పాలన (Jagan administration) బాబు పాలన (Babu administration) కంటే బాగుండి ఉంటే పవన్ నిర్ణయం తప్పునే అయి ఉండేది. నేటి జగన్ పాలన చూస్తుంటే పవన్ జగన్’ని నాడు నేడు వ్యతిరేకించడం తప్పు కాదు అనిపిస్తున్నది.
పవన్ బాబుని ఎందుకు ప్రశ్నించలేదు.
గుంటూరు మీటింగు (Guntur meeting) తరువాత పవన్ బాబుపై అనేక పర్యాయాలు విరుచుకు పడ్డాడు. దీనికి అనేక ఆధారాలు కూడా ఉన్నాయి.. అయినా పవన్ కళ్యాణ్ కి బాబు వైఖిరి నచ్చకే టీడీపీతో పొత్తు నాడు పెట్టుకోలేదు. నేడు పెట్టుకోవడం లేదు.
కానీ పవన్ పొత్తు పెట్టుకొన్నాడు అనే నీలి పార్టీ (Neeli Party), నీలి మీడియా (Blue Media) చేస్తున్న విష ప్రచారానికి మన కుల సంఘాలు మద్దతు పలుకుతున్నాయి. కానీ విమర్శలను తిప్పికొట్టలేక పోతున్నాయి. పవన్ కళ్యాణ్’పై కుల ముద్ర వేయడానికి మన కుల సంఘాలు విశేషంగా ప్రయత్నాలు చేస్తున్నాయి అని కాపులు (Kapus) భావిస్తున్నారు.
అయినా ఎందరో మదిలో మెదులుతున్న అనుమానాలకు సమాధానంగా అయినా పవన్ బాబు వైకిరిపై మాట్లాడాల్సి ఉంది. కానీ రెండు మదపుటేనుగులపై ఒక్కసారే పోరాటం చేయడం అనేది చాలా కష్టం. ఇదే పవన్ ఆలోచన అయిఉండవచ్చు. ఇది కుల సంఘాలకు, ఉద్యమ సంఘాలకు అర్ధం కాకపోతే ఏమి చెయ్యాలి?
పవన్ కాపు నాయకుడు అని ఎందుకు చెప్పుకోలేక పోతున్నాడు?
బాబు (Babu) నేను కమ్మ నాయకుడుని (Kamma Leader) అని చెప్పుకొంటున్నాడా? లేదా బాబుని కమ్మ నాయకుడు అని చెప్పుకోమని మన కుల సంఘాలు చేస్తున్నాయా?
అలానే జగన్ (Jagan) నేను రెడ్డి (Reddy) నాయకుడుని అని చెప్పుకొంటున్నాడా? లేదా జగన్ని రెడ్డి నాయకుడు అని చెప్పుకోమని మన కుల సంఘాలు ఎందుకు వత్తిడి చేస్తున్నాయా?
ఒక్క పవన్ కళ్యాణ్’పైనే ఎందుకు కుల ముద్ర వేస్తున్నారు. మన కుల సంఘాలు రంగాపై ఇలా కులముద్రవేసే మనకి లేకుండా చేశాయి . పవన్ కళ్యాణ్’ని కూడా మరో రంగాగా చేసి జనానికి కూడా మనకి దూరం చేయాలని ఈ కుల సంఘాలు ప్రయత్నం చేస్తున్నాయా అంటూ కాపులు నేడు కులసంఘాల వైకిరిపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు?
బాబు కాపులకు అన్యాయం చేస్తే పవన్ ఎందుకు ప్రశ్నించలేదు?
కాపులకు అన్యాయం చేస్తే ప్రశ్నించాల్సింది ఉద్యమ సంఘాలు. కుల సంఘాలు. పవన్ కళ్యాణ్ కాదు. రాజకీయంగా పవన్ ప్రశ్నిస్తున్నాడు. ప్రశ్నించాలి కూడా. ఇంకా ప్రశ్నించాల్సి ఉంది. గట్టిగా బాబుని ప్రశ్నిస్తాడు కూడా. కానీ రెండు విష సర్పాలపై ఒక్కసారే విరుచుకు పడాలి అంటే కాస్త ఆలోచన, వ్యూహం, సహనం ఉండాలి. అది మన కుల సంఘాలకు లేకపోతే ఎలా?
బాబు కాపులకు అన్యాయం చేయలేదా?
బాబు ముమ్మాటికీ కాపులకు అన్యాయం చేసాడు. అలానే నాటి రాజన్న (Rajanna) వారి పుత్రుడు కూడా కాపులకు అన్యాయం చేసారు. ఈ ముగ్గురు కాపులకు అన్యాయాలు చేస్తున్నారు. కానీ కుల సంఘాలు, ఉద్యమ సంఘాలు ఒక్క కమ్మ వ్యతిరేకతనే ఎందుకు టార్గెట్ చేస్తున్నాయి. అయినా ఈ రెండు పార్టీల్లో పనిచేస్తున్న కాపు నాయకులను వదిలేసి పవన్’పై మాత్రమే ప్రెస్ మీట్లు పెట్టడానికి కారణం ఏమిటి? ఈ ఉద్యమ సంఘాలు, కొంగ్రొత్త కుల సంఘాలు వీటికి ఏమని సమాధానాలు చెప్పగలవు?
ఇంతకీ పవన్ కళ్యాణ్ తప్పు చేయలేదా?
పవన్ తప్పు చేసాడు. కాపులను, కాపు ఉద్యమ సంఘాలను, కాపు నాయకులను నమ్ముకొని పవన్ తప్పు చేసాడు. కాపు రిజర్వేషన్ అంశాన్ని తన మానిఫెస్టోలో పెట్టి పవన్ తప్పు చేసాడు. కాపులు ఓటమితో రగిలిపోతున్నారు అనే బాధతో అన్నని ఎదిరించి మరో పార్టీ పెట్టి పవన్ తప్పు చేసాడు.
కులాన్ని మోసం చేస్తున్న కాపు నాయకులను దరి చేరదీయకుండా దూరంపెడుతూ పవన్ తప్పు చేస్తున్నాడు. అందుకే పవన్ ఓడిపోయాడు. పాపం ఫలితాన్ని అనుభవిస్తున్నాడు అని కాపులు పవన్’పై సానుభూతి చూపించడం మొదలు పెట్టారు. కాపులు వాస్తవాలు తెలిసికోవడం మొదలు పెట్టారు.
ఇంతకీ కాపు సంఘాలు-ఉద్యమ సంఘాలు ఏమి చేయాలి?
టీడీపీకి కమ్మ ముద్ర (Kamma Mudra), వైసీపీకి రెడ్డి ముద్ర (Reddy mudra) వేయలేని ఈ సంఘాలు జనసేనపైనే ఎందు కాపు ముద్ర (Kapu Mudra) వేస్తున్నాయి అనేది తమకి తామే ప్రశ్నించుకోవాలి.
అధికారాన్ని అనుభవించిన బాబుని, అధికారాన్ని అనుభవిస్తున్న బాబుని కాపులకు న్యాయం చేయమని అడగలేని ఈ సంఘాలు ఒక్క పవన్ కళ్యాణ్’పైనే ఎందకు బురద చల్లుతున్నాయి అనేది తమకి తామే ప్రశ్నించుకోవాలి.
కాపు కార్పొరేషన్ (Kapu Corporation) ఉందా లేదా, కాపులకు విదేశీ విద్యకి సాయం (Assistance to foreign study) అందుతున్నదా లేదా, రైతు భరోసాలో (Rythu Bharosa) కాపులకు ఎందుకు స్థానం లేదు, కాపు రిజర్వేషన్లను (Kapu Reservations) వైసీపీ (YCP) ఎందుకు అమలు జరపడం లేదు, EWC లో 5 % కాపులకు అనేది ఎందుకు ఆగిపోయింది మొదలైన అంశాలపై పోరాటం చేయాల్సిన కాపు సంఘాలు, కాపు ఉద్యమ సంఘాలు ఎందుకు చేయలేక పోతున్నాయి.
( ఈ మా కధనం మోసం చేసే ఉద్యమ సంఘాలు-కుల సంఘాలు ఏమైనా ఉంటే వాటిపైనే గాని చిత్త సుద్ధితో పనిచేసే వాటిపైన కాదని గమనించగలరు. కాపుయువత ప్రతిస్పందనల సమాహారాన్ని మీకు అందించడంలో బాధ కలిగించే అంశాలు ఏమైనా ఉంటే మాకు తెలియచేయగలరు.)
ఆలోచించండి… ఉద్యమ సంఘాల, కుల సంఘాల చేతకాని తనాన్ని కప్పి పుచ్చి కోవడానికేనా పవన్ కళ్యాణ్’పై కుల ముద్రవేయడానికి ప్రయత్నిస్తున్నాయి. బురద చల్లుతున్నాయి. ఇంతకీ మనకి ఇది గిట్టుబాటేనా అనే యువతకి ఏమి చెబుదాం?
–Its from Akshara Satyam
Excellent.. 100% TRUE.