Pawan KalyanPawan Kalyan

యోధుల్లా పోరాటానికి చలిచీమలు సిద్ధం
మిడిల్ లెవెల్ నాయకులు కరవు
జనసేన అధికారంలోకి రావాలంటే…

ఆంధ్ర ప్రదేశ్’లో (Andhra Pradesh) జరిగిన ఎంపీటీసీ (MPTC), జడ్పీటీసీ (ZPTC) ఎన్నికల్లో (Elections) జనసేన పార్టీ (Janasena Party)లో ఉన్న చలిచీమలు (Ants) సాధించిన విజయాలు/స్థానాలు తక్కువే కావచ్చు. కానీ ఆ సాధించిన విజయాలు సామాన్యమైనవి కావు. సుమారు 190 ఎంపీటీసీ స్థానాలు, 2 జడ్పీటీసీ జనసేన గెలిచినట్లు వార్తలు అందుతున్నాయి. అధికార పార్టీ ఒత్తిళ్లను, ప్రలోభాలకు, సంక్షేమ పధకాల భయాలను పక్కకు పెట్టి జనసేనకు ఓట్లు వేస్తున్నారు. ఇదే మార్పుకి సంకేతం.

ఓడినచోట అతితక్కువ మెజారిటీతో జనసేన (Janasena) ఓడిపోయినా స్థానాలు ఎక్కువే ఉన్నాయి. ఉదాహరణకు కాజులూరు మండల ZPTC స్థానాన్ని కేవలం 650 ఓట్లు తేడాతో జనసేన కోల్పోవలసి వచ్చింది. జనసేనకు ఇటువంటి విజయాలు పెద్దవి అనే చెప్పాలి. జనసేనకు అనుకూలంగా వోటింగ్ శాతం గణనీయంగా పెరుగుతున్నది.

జనసైనికుల విజయాలకు కారకులు ఎవరంటే?

నిన్నటి ఎన్నికల విషయమై పార్టీ అధిష్టానం సరి అయిన సలహాలు, సూచనలు క్రింది స్థాయి నాయకులకి  అంతగాఇవ్వలేదు. పోటీ చెయ్యండి అని పార్టీ నాయకులను కూడా అధిష్టానం పెద్దగా ఆదేశించలేదు. కొంత మంది జిల్లా స్థాయి నాయకులూ కూడా అనేక కారణాల వాళ్ళ పెద్దగా ఈ ఎన్నికలను పట్టించుకోలేదు. పోటీ చేసిన చోట వర్గ విబేధాలు కూడా కొట్టొచ్చినట్లు కనపడుతున్నాయి.

కానీ పార్టీ కార్యకర్తలు, కొంతమంది నాయకులు మాత్రం తమ నాయకుడు జనసేనుడుపై ఉన్న నమ్మకంతో, మార్పు రావాలి అనే పట్టుదలతో అతి తక్కువ చోట్ల పోటీ చేశారు. ఈ క్రెడిట్ అంతా చలి చీమల్లో ఉన్న పోరాట పటిమ అనే చెప్పాలి. జనసేనుడు పవన్ కళ్యాణ్’పై ప్రజలకు ఉన్న నమ్మకమే అని చెప్పాలి. కొన్ని చోట్ల గెలిచారు. చాల చోట్ల రెండో స్థానంలో నిలిచి ప్రజల మనస్సులను గెలిచారు. చాలా చోట్ల జనసైనికులు తెలుగుదేశాన్ని వెనుకకు నెట్టేశారు. జనసేనుని అండతో చలిచీమలు కూడా మదపుటేనుగులను ఓడించగలవు అని మరొక్కసారి నిరూపించారు.

ప్రభుత్వాన్ని ఎదిరించి పోటీచేయడం అంటే సామాన్య విషయం కాదు. అలానే తెలుగుదేశం (Telugu Desam) చేసే విష ప్రచారాన్ని తట్టుకొని నిలబడడం అంటే కూడా జనసైనికులకు సామాన్య విషయం కాదు. పాలక, ప్రతిపక్షాలను ఎదిరించి పోటీచేసిన ప్రతీ చలిచీమకు (జనసైనికుడికి-సైనికురాలుకి) అభినందనలు చెప్పాలి. మార్పు కోసం పోరాడే ప్రతీ యోధుడి వెంట, యోధురాలు వెంట మా Akshara Satyam ఎప్పుడూ ముందే ఉంటుంది.

అలానే చలి చీమలు చేస్తున్న పోరాటాన్ని, మార్పుకోసం వారిలో ఉన్న ఆరాటాన్ని, అధిష్ఠానము చలనంపై వారిలో ఉన్న ఆవేదనని జనసేనుడు కూడా తెలుసుకోవాలి. చలిచీమల ఆవేదనని జనసేనుడికి చేరవేయడంలో కూడా మా Akshara Satyam ఎప్పుడూ ముందే ఉంటుంది. మీ తరపున పోరాటం చేస్తూనే ఉంటుంది.

ఎవరు ఎన్ని అనుకొన్నా జనసేనుడు తన ఆఫీస్ కోటలు దాటి, జనాల్లోకి వచ్చేవరకు మా ఈ Akshara satyam వత్తిడి తీసికొని వస్తూనే ఉంటుంది. మార్పుకోసం పోరాటం చేస్తున్న ఈ చలిచీమలు తరుపున మా Akshara Satyam స్వరాన్ని గట్టిగా వినిపిస్తూనే ఉంటుంది.

ప్రస్తుత రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ అంటే ఒక నిజాయితీ పరుడు. జనసేనుడిని మించిన నాయకుడు మరొకడు లేదు అని ప్రజలుగట్టిగా నమ్ముతున్నారు. అలానే ఆంధ్రాలో ప్రస్తుత పరిస్థితులను చక్కదిద్దే నిబద్దత ఉన్న నాయకుడు పవన్ కళ్యాణ్ ఒక్కడే అని కూడా ప్రజలు నమ్ముతున్నారు. అందుకే పోటీ చేసిన ప్రతీ చోటా జనసేనకు ప్రజల మద్దతు లభిస్తున్నది.

జనసేన ఎక్కడ విఫలం అవుతున్నది?

కానీ పవన్ కళ్యాణ్ చేస్తున్న పోరాటాల్లో నిలకడ ఉండటం లేదు. ప్రభుత్వ, ప్రతిపక్ష తప్పిదాలను ఎండగట్టి ప్రజలకు చెప్పడంలో జనసేనుడు విఫలం అవ్వుతున్నాడు. ఆ రెండు పార్టీల అధినాయకుల్లో ఉన్న రహస్య అవగాహనను విడమరిచి చెప్పే మీడియా యంత్రాంగాన్ని కూడా జనసేనుడు ఏర్పరచుకోలేక పోతున్నాడు అని ప్రజలు నమ్ముతున్నారు.

తమ వద్ద అస్త్రాలు లేకపోయినప్పటికీ చలి చీమలు / జనసైనికులు వీధుల్లోకి వచ్చి పోరాటం చేస్తూనే ఉన్నారు. కానీ వారికి మార్గ నిర్ధేశనం చేసే మిడిల్ లెవెల్ లేదా కింద స్థాయి నాయకులను ఇవ్వడంలో జనసేనుడు విఫలం అవుతున్నాడు.

జనసేనుడు వీటిని చక్క దిద్దాలి. ప్రజల్లోకి రావాలి. ఆ రెండు పార్టీల మధ్య ఉన్న రహస్య అవగాహనను బయటపెట్టగలగాలి. అధికారమే లక్ష్యంగా జనసేనుడి కార్యక్రమాలు ఉండాలి. అలా చేసిన రోజున జనసేనకు ఓటు వేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. జనసేనకు అధికారం కట్టబెట్టడానికి కూడా ప్రజలు సిద్ధంగా ఉన్నారు.

అయితే ప్రజల నాడిని తెలిసికొని, ప్రజల అభీష్టానికి అనుగుణంగా పార్టీని పరిగెత్తించే విధంగా జనసేనుడు నడుచుకొంటాడా లేదా అనేదే మిలియన్ డాలర్ల ప్రశ్న.

మార్పు కోసం నేను సైతం అంటూ…

మీ

Akshara satyam

Spread the love