Kaneeti VaradaKaneeti Varada

కౌలు రైతు కుటుంబాల యాతన అనంతం
కౌలు రైతు కుటుంబాలకు భరోసా ఇవ్వని ప్రభుత్వం
తెనాలిలో నాదెండ్ల మనోహర్ ఎదుట బాధిత మహిళ ఆక్రందన

రాష్ట్రంలో ఎక్కడ చూసినా కౌలు రైతుల (Tenant Farmers) బలవన్మరణాల వ్యధలు ఎదురవుతూనే ఉన్నాయి. కౌలు రైతుల కుటుంబాలు పడుతున్న యాతన గుండెను పిండేస్తూనే ఉంది. జనసేన పార్టీ (Janasena Party) రాజకీయ వ్యవహారాలు కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ (Nadendla Manohar) శుక్రవారం సాయంత్రం తెనాలి నియోజకవర్గం (Tenali Constituency), అత్తోట గ్రామంలో పర్యటించి జనసేన నాయకులను (Janasena Leaders), పార్టీ శ్రేణులను, రైతులను పలకరించారు.

అత్తోట గ్రామంలో నారాయణో రాజగోపాలచార్యులు ఇంటికి వెళ్లి వారితో మాట్లాడుతున్న సమయంలో ఇటీవల ఆత్మహత్య చేసుకున్న కుంచవరం (Kunchavaram) గ్రామానికి చెందిన కౌలు రైతు తోట శ్రీనివాసరావు భార్య శ్రీమతి అంజలీదేవి తన బిడ్డలతో కలిసి నాదెండ్ల మనోహర్’ని కలిశారు.

ఏడు ఎకరాలు కౌలు తీసుకుని వరి, జొన్న పంటలు వేసిన తన భర్తకు వరుసగా మూడు సంవత్సరాలు దిగుబడులు రాక నష్టాలు వచ్చాయని చెప్పారు. కౌలు డబ్బులు కట్టేందుకు, సాగు పెట్టుబడి కోసం తెచ్చిన అప్పులు రూ. ఏడు లక్షలు కావడంతో ఏం చేయాలో తెలియని వేదనతో 2021 మార్చిలో గడ్డి మందు తాగి తన భర్త పొలంలోనే ఆత్మహత్య (Farmer suicide) చేసుకున్నాడని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. పంట కోసం చేసిన అప్పులు తన భర్తను బలి తీసుకున్నాయని ఆమె కన్నీటి పర్యంతమయ్యారు. తనను తన ఇద్దరు పిల్లలను అనాథలను చేసి వెళ్లిపోయాడని మనోహర్ ఎదుట ఆమె బోరున విలపించారు. మినీ అంగన్వాడీ కేంద్రంలో కార్యకర్తగా పని చేస్తున్న తనకు నెల వారీ ఇంటి నిర్వహణకు కూడా ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని, ఇద్దరు చిన్నారుల భవిష్యత్తు ఏమైపోతుందో నంటూ ఆమె వాపోయారు అని నాదెండ్ల మనోహర్ తెలిపారు.

ఈ సందర్భంగా మనోహర్ ఆమెతో మాట్లాడుతూ- ప్రభుత్వం నుంచి కౌలు రైతులు ఆత్మ హత్యకు పాల్పడితే 7 లక్షల రూపాయలు పరిహారం వస్తుందని, మీకు అది ఏమైనా అందిందా అని ఆరా తీశారు. 2021 ఆగస్టు నుంచి ప్రభుత్వ కార్యాలయాలు (Government offices) చుట్టూ పరిహారం కోసం తిరుగుతున్నానని, ప్రతి కార్యాలయం అధికారి తమకు సంబంధం లేదని పంపిస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని కార్యాలయాలు తిరగలేక విసుగు పుట్టిందని ఆమె చెప్పారు. ఇవ్వాల్సిన పరిహారాన్ని సైతం అధికారులు రాకుండా చేస్తున్నారంటూ.. మీరే ఆదుకోవాలి అంటూ నాదెండ్ల మనోహర్ దగ్గర వాపోయారు.

పవన్ కళ్యాణ్ ఆదుకోవాలి

ప్రభుత్వం నుంచి తమకు ఒక్క రూపాయి కూడా పరిహారం అందలేదని, కౌలు రైతు చనిపోయిన తర్వాత త్రిసభ్య కమిటీ కూడా రాలేదని, కేవలం కానిస్టేబుల్ వచ్చి వెళ్ళాడని ఆమె చెప్పారు. తమ కుటుంబాన్ని పవన్ కళ్యాణ్ ఆదుకోవాలని ఆమె కోరారు. జనసేన పార్టీ చేపట్టిన కౌలు రైతుల భరోసా యాత్ర (Kaulu Rythu Barosa Yatra) ద్వారా కచ్చితంగా ఆదుకుంటామని, చిన్నారులు కార్తికేయ, లక్ష్మీ నాగ దుర్గ చదువు బాధ్యతను తీసుకుంటామని మనోహర్ భరోసా ఇచ్చినట్లు తెలిపారు.

కౌలు రైతుల పరిహారం (Compensation) విషయంలో ప్రభుత్వం ఇష్టానుసారం వ్యవహరిస్తోందని, తమకు కావలసిన వారికి మాత్రమే పరిహారం ఇవ్వడం ఈ ప్రభుత్వ వ్యవహార శైలిని బయటపెడుతుందని నాదెండ్ల మనోహర్ అన్నారు.

కొల్లిపర చెక్ డ్యామ్ మన ఉమ్మడి ఆశయం

‘తెనాలి నియోజకవర్గం, కొల్లిపరలో చెక్ డ్యామ్ (Kollipara Check dam) నిర్మించాలని గతంలో ఎప్పటినుంచో అనుకున్నాం. దీనివల్ల రైతాంగానికి ఎంతో మేలు జరుగుతుందని భావించాం. దీనికి గతంలో ప్రతిపాదనలు పంపినా, అది సాకారం కాలేద’ని నాదెండ్ల మనోహర్ చెప్పారు. కొల్లిపర గ్రామంలో పలువురు రైతులను కలిశారు. వారి సమస్యలు అడిగి తెలుసు కున్నారు.

ఆ గ్రామం నుంచి ఇటీవల జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ సమక్షంలో పార్టీలో చేరిన వి.ఎస్.రామిరెడ్డి, చాగంటి సుబ్బారెడ్డిల ఇళ్లకు వెళ్లి వారి యోగ క్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా స్థానిక నాయకులతో మనోహర్ గారు మాట్లాడుతూ… “రాజకీయాలను ఎన్నికల సమయంలో చూసుకోవచ్చు.

ఇప్పుడు మాత్రం పార్టీలకు రాజకీయాలకు అతీతంగా కలిసి పని చేద్దాం. కచ్చితంగా కొల్లిపరకు అవసరమైన సాగు, తాగునీరు అందించేలా పనిచేద్దాం. స్థానిక గ్రామాభివృద్ధి అందరి ధ్యేయంగా ముందుకు వెళ్దాం. అంతా కలిసికట్టుగా పని చేస్తే, అందరూ కలిసి వస్తారు. గతంలో తలపెట్టిన సుమారు రూ. 300 కోట్ల పనులకు ఇప్పటివరకు గ్రహణం వీడ లేదు” అని నాదెండ్ల మనోహర్ అన్నారు.

కొల్లిపర తర్వాత అత్తోటలో (Attota) రాజగోపాలచార్యులు ఇంటికి వెళ్లి నూతన వధూవరులను ఆశీర్వదించారు. స్థానిక శివాలయంలో వినాయకుడి గుడి వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి బండారు రవికాంత్, గుంటూరు జిల్లా ఉపాధ్యక్షుడు ఇస్మాయిల్ బేగ్, గుంటూరు జిల్లా కార్యదర్శులు పెరికల రాంబాబు, గుంటూరు కృష్ణ మోహన్, చదలవాడ వేణుమాధవ్, పార్టీ నేతలు తోటకూర వెంకట రమణారావు, యర్రు వెంకయ్య నాయుడు తదితరులు పాల్గొన్నారు.

అధర్మంగా అడ్డుకుంటే మేము రోడ్డెక్కుతాం: జనసేనాని

Spread the love