ధర్మాన్ని చెరబట్టే రాక్షస పాలన ఎప్పటికైనా అంతము అవ్వాలిసినదే! వేదవతిని చెరబట్టాడు అనే ఆగ్రహముతో పరమశివుడు ఆ రావణుడిని సంహరించబోతుంటే విష్ణుమూర్తి అడ్డుకొని రావణుడికి ఆ రోజు ప్రాణబిక్ష పెట్టాడు. అలా ప్రాణ బిక్షపెట్టి ఉండకపోతే రావణుడి నుండి సీతమ్మకి, శ్రీ రాముడికి, రామసేనకు భాధలు ఉండేవి కావు. రావణుడిని ఆరోజునే శివుడే వధించి ఉండవలిసింది. కానీ విధి బలీయమైనది. రావణుడి చావు రాముడి అవతారములోనే రాసి ఉన్నది.
రాష్ట్రాన్ని విడతీసి చెడగొట్టారు అనే ఆగ్రహముతో తెలుగు ప్రజలందరూ మన చంద్రలోకాధీశుడుని గత ఎన్నికలలోనే ఓడించి, పచ్చ పార్టీని మట్టు పెట్టాలి అని తలచారు. కానీ జనసేనుడు అడ్డు వచ్చి పచ్చ పార్టీకి ఆయుష్షుని, పచ్చ దొరకి పదవీ భిక్షని పెట్టాడు. జనసేనుడు ఆరోజు పచ్చ పార్టీకి ఆ“బిక్ష” పెట్టి ఉండక పోతే నేడు మన ప్రజలకు, జనసేనుడికి, జన సైన్యానికి ఈ పచ్చ పరివారము చేతిలో భాదలు ఉండేవి కావు. కానీ విధి బలీయమైనది. పచ్చ పార్టీ పతనము తిరిగి జనసేనుడి చేతిలోనే రాసి ఉన్నది.
రాక్షస బుద్ది
రావణుడు ఆపదలో ఉన్నపుడు కాపాడిన “వేదవతి”నే రాక్షస బుద్దితో ఆ రావణుడు చెరబట్టడానికి ప్రయత్నిస్తాడు. స్త్రీని అవమానించిన పాపమే నీ సామ్రాజ్యపతనానికి హేతువు అని శపించి, వేదవతి తన జీవితాన్ని వదులు కొంటుంది.
చంద్రలోకాధీశుడు ఆపదలో ఉన్నప్పుడు జనసేనుడు వచ్చి కాపాడి, పదవీ బిక్షకూడా పెడతాడు. కానీ రాక్షస బుద్దితో మన “పచ్చ దొర” జనసేనుడినే అడ్డు తొలగించుకోవాలి అని తలుస్తాడు. తన దగ్గర ఉన్న అరుపు దళాలను, పచ్చమీడియాని ప్రయోగించడము జరిగింది. జనసేనుడి కుటుంబ సభ్యులను కూడా మీడియా పాలు చేయడము మనము చూసాము.
ప్రాణబిక్ష పెట్టిన విష్ణు మూర్తినే మరచి, ఆ విష్ణు అవతారమైన శ్రీరాముడి ధర్మపత్ని సీతమ్మ తల్లి జీవితాన్ని నాశనము చేయడానికి ఆ రావణుడి ప్రయత్నించాడు. అదే లంకా రాజ్య పతనానికి దారితీసింది.
పదవీబిక్ష, పార్టీకి ప్రాణబిక్ష పెట్టిన జనసేనుడి కుటుంబ వ్యక్తులలో కొందరిని అడ్డుపెట్టుకొని తద్వారా జనసేనుడికి అపఖ్యాతి తేవాలి అని నేటి చంద్రలోకాధీశుడు చేయని ప్రయత్నము లేదు. అదే పచ్చ సామ్రాజ్య పతనానికి దారి తీస్తున్నది.
విధి విలాపము వల్ల విడిపోయిన సీతమ్మ తల్లి, వాల్మీకి చెంతకు చేరినది. రాముడి ప్రాభవాన్ని భావితరాలకు తెలిపి, రామాయణమనే మహాగ్రంధాన్ని ఇవ్వడానికి అనేది ఆ వాల్మీకి లాంటి వారికే తెలుసు. కానీ వల్మీకులకు కాదు.
అయితే విధి విలాపము వల్ల జనసేనుని నుండి విడిపోయిన “ఆమెను” ప్రలోభ పరచడానికి పచ్చ మీడియా ప్రయత్నము చేస్తూనే ఉన్నది. అయినప్పటికీ కూడా జనసేనుడి సామాజిక స్పృహని, సేవా నిరతిని, సామాజిక మార్పు అనే సంకల్ప బలాన్నిఆమె బయట పెడుతూనే ఉన్నది.
నాటి మహాకవి వాల్మీకికి “కమ్మని పచ్చ పిచ్చి” లేదు కాబట్టి రామాయణ మహా కావ్యము ద్వారా వాస్తవాలు బయటికి తెచ్చారు. కానీ నేటి “వల్మీకులు” (“వాల్మీకులు” కాదు) లాంటి మీడియ, తమ “కమ్మని పచ్చ సిరా”తో జనసేనుడిని మకిలి పరచడానికి వాస్తవాలను తొక్కేస్తున్నారు.
రావణ వధతో రావణ సామ్రాజ్య పతనము ఎలా అయ్యిందో, నేడు పచ్చదొర సామ్రాజ్య పతనము కూడా జరిగి తీరుతుంది. నిద్ర నటించే కుంభ కర్ణుడు లాంటి వ్యవస్థలు ఎన్ని ఉన్నా, ఇంద్రజిత్తులాంటి దొరల మీడియా ఎన్ని వచ్చినా ఈ పచ్చసామ్రాజ్య పతనాన్ని ఆపలేరు. ఇదే అక్షర సత్యం.