21,678 ఓట్లకు పరిమితమైన బీజేపీ
బద్వేల్ (Badvel) ఉపఎన్నికను (By Election) వైసీపీ (YCP) కైవసం చేసికొంది. ఉప ఎన్నికలో వైసీపీ అభ్యర్థి డాక్టర్ సుధ విజయం సాధించారు. బీజేపీ (BJP) అభ్యర్ధికి డిపాజిట్ కూడా దక్కలేదు. టీడీపీ (TDP), జనసేనలు (Janasena) పోటీచేయనప్పటికీ బీజేపీకి ఆశించిన స్థాయిలో ఓట్లు రాలేదు. బీజేపీకి కేవలం 21,678 ఓట్లు మాత్రమే దక్కాయి. గత ఎన్నికల్లో ఇక్కడ టీడీపీకి 32.36 శాతం ఓట్లు లభించగా ఈసారి జనసేన సైతం సహకరించినా బీజేపీ అభ్యర్థికి 14.73 శాతం ఓట్లు మాత్రమే దక్కడం గమనార్హం. వైఎస్సార్ సీపీ అభ్యర్థి దివంగత డాక్టర్ వెంకట సుబ్బయ్యకు గత ఎన్నికల్లో 95,482 (60.89 శాతం) ఓట్లు వచ్చాయి. అప్పుడు 1,56,819 (76 శాతం) ఓట్లు పోల్ కాగా ఈసారి 1,47,166 (68.39 శాతం) ఓట్లు పోలయ్యాయి. గతంతో పోలిస్తే ఈసారి పోలింగ్ దాదాపు 8 శాతం తగ్గినప్పటికీ వైఎస్సార్‌సీపీ (YSRCP) అభ్యర్థి డాక్టర్ సుధకు 1,12,211 (76.24 శాతం) ఓట్లు లభించడం గమనార్హం.