శ్రీమద్ది ఆంజనేయ స్వామి (Maddi Anjaneya Swamy Temple) వారి దేవస్థానంనకు రాష్ట్ర సమాచార కమిషనర్ (Information Commissioner) శ్రీనివాసరావు దంపతులు శనివారం విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు. పశ్చిమగోదావరి జిల్లా (West Godavari District) జంగారెడ్డిగూడెం (Jangareddygudem) మండలం గురవాయి గూడెం గ్రామంలో మద్ది ఆంజనేయ స్వామి (Anjaneya Swamy) వెలసి ఉన్నారు. శ్రీ స్వామివారి దేవస్థానంనకు శనివారం రాష్ట్ర సమాచార కమిషనర్ శ్రీనివాసరావు దంపతులు విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు. వీరికి ఆలయ ధర్మకర్తల మండలి ప్రత్యేక ఆహ్వానితులు శ్రీ కర్పూరం రవి స్వామివారి శేష వస్త్రాలుతో సత్కరించి ప్రసాదం అందజేసారు.
వీరితోపాటు సి.హెచ్ ఆర్ వి సత్యనారాయణ, మహిళా చైర్మన్ వందనపు సాయి బాలపద్మ, జంగారెడ్డిగూడెం పిఎసిఎస్ అధ్యక్షులు వెంకటేశ్వరరావు… ద్వారకాతిరుమల ధర్మకర్త కర్పూరం గుప్త, మహంకాళి బాలకృష్ణ, పి వి. ఏ తారక్, కర్పూరం వెంకన్న… ఇతర ఆర్యవైశ్య ప్రముఖులు పాల్గొన్నారని ఆలయ ధర్మకర్తల మండలి అధ్యక్షురాలు శ్రీమతి కేసరి విజయ భాస్కర్ రెడ్డి, మరియు ఆలయ కార్యనిర్వహణాధికారి ఆకుల కొండలరావులు తెలియజేసారు.