Gudem MRO OfficeGudem MRO Office

రిజిస్టర్ కార్యాలయం (Registrar Office) వద్ద రిజిస్ట్రేషన్ (Registration) చేసుకునే ముందు పత్రాలు సరిలేకపోతే తక్షణమే కార్యాలయం వద్దకు వచ్చి సరిచేసికోవాలని జంగారెడ్డిగూడెం తహసీల్దార్ జోషి అన్నారు. ఏలూరు జిల్లా, జంగారెడ్డిగూడెం మండలంలోని, మరియు జంగారెడ్డిగూడెం (Jangareddygudem) గ్రామాల్లో కొంత మంది ముఠాలుగా ఏర్పడి ప్రభుత్వ భూములు, చెరువులు మరియు ప్రైవేటు భూములకు కూడా దొంగ పట్టాలతో అక్రమ రిజిస్ట్రేషన్లు చేయించుకుంటున్నారు. సెటిల్ మెంట్ పేరుతో భూ యజమానుల నుండి లక్షలు ఆర్జిస్తున్నారని రెవిన్యూ అధికారుల దృష్టికి రావడం జరిగిందని తహసీల్దార్ జోషి వివరించారు.

కానీ ఈ విషయంలో ప్రజల నుండి ప్రభుత్వ భూములు, చెరువులు మరియు ప్రైవేటు భూములకు కూడా దొంగ పట్టాలతో రిజిస్ట్రేషన్ విషయమై ఏ విధమైన ఫిర్యాదులు ఈ కార్యాలయమునకు (జంగారెడ్డిగూడెం) నకు అందలేదు. ప్రభుత్వ భూములు, చెరువులు మరియు ప్రైవేటు భూములకు సంబంధించి ఎవరైనా నకిలీ పట్టాలు, పాస్ బుక్ లు సృష్టించినట్లైతే తహశీల్దార్ కార్యాలయమునకు పిర్యాదు చేయవచ్చు. సంబంధిత భూమి వివరాలు మరియు నకిలీ పట్టాలు, పాస్ బుక్ లు సృష్టించిన వ్యక్తుల వివరాలతో ఫిర్యాదు దాఖలు చేయాలని జంగారెడ్డిగూడెం ఎమ్మార్వో జోషి తెలిపారు.

ఆ పిమ్మట వెంటనే విచారణ జరిపి, సదరు వ్యక్తుల ఇళ్ళు/కార్యాలయాలలో సోదాలు జరిపి చట్టప్రకారం సదరు నకిలీ పట్టాలు, పాస్ బుక్’లు సృష్టించిన వ్యక్తులపై చర్యలు తీసుకుంటామన్నారు. అదే విధముగా ప్రజలు భూములు కొనుగోలుచేయు సమయంలో రెవిన్యూ రికార్డులను పరిశీలించుకుని, సదరు భూమి విషయంలో ఏదైనా సందేహాలు ఉన్నచో నేరుగా తహశీల్దార్ కార్యాలయాన్ని సంప్రదించి వివరాలు తీసుకోవాలని జోషి వివరించారు.

ఈ విషయంలో మధ్యవర్తులను ఆశ్రయించవద్దని నేరుగా తాసిల్దార్ కార్యాలయం వద్దకు రావాలని అన్నారు. అదేవిధముగా సబ్ రిజిస్ట్రార్, జంగారెడ్డిగూడెం వారికి, భూముల రిజిస్ట్రేషన్ సమయంలో, రెవిన్యూ రికార్డులను జాగ్రత్త గా పరిశీలించిన తదుపరి మాత్రమే రిజిస్ట్రేషన్ చేయవలెనని లేఖ ద్వారా కోరడమైనదని తహసీల్దార్ జోషి తెలిపారు.

హాలీవుడ్ క్రిటిక్ ఛాయిస్ సూపర్ అవార్డు అందుకున్న రామ చరణ్