Carona with IndiaCarona with India

3 . 43 లక్షల కొత్త కేసులు, 4000 మరణాలు

భారతదేశ (India) వ్యాప్తంగా ఇప్పటి వరకు 2 కొంతమంది కరోనా (Carona) నుండి మృత్యుంజయులు. కరోనా (Covid) ఉద్ధృతి ఇంకా కొనసాగుతోనే ఉంది. ఇంకోపక్కన కరోనా వైరస్ (Carona Virus) కట్టడికి పలు రాష్ట్రాలు విధించిన ఆంక్షలు పనిచేస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తున్నది. కొద్ది రోజుల క్రితం కేసులు నాలుగు లక్షల మార్కును దాతాయి. అయితే ఐదు రోజులుగా కొత్త కేసులు ఆ మార్కుకు దిగువగా నమోదు అవుతున్నాయి. గత 24 గంటల్లో కొత్తగా 3.43లక్షల మందికి కొత్తగా కరోనా సోకింది. ఇక మరణాల సంఖ్య సుమారు నాలుగువేలుగా ఉన్నదీ అని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. నిన్నటి రోజుతో పోల్చితే కేసులు, మరణాల సంఖ్యలో కూడా తగ్గుదల కనిపిస్తోంది. ఇది శుభ సూచకం.

తాజాగా 18,75,515 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. అందులో 3,43,144 మందికి కరోనా సోకినట్లు వెల్లడైంది. క్రితం రోజు (3,62,727) తో పోల్చితే కొత్త కేసులు కాస్త తగ్గాయి. దాంతో ఇప్పటి వరకు రెండు కోట్ల 40లక్షల మందికి ఈ కరోనా మహమ్మారి సోకింది. రెండు కోట్ల మందికి పైగా దాని నుండి బయట పడ్డారు. నిన్నటి రోజున 3,44,776 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. ఇప్పటి వరకూ కోలుకున్న వారి సంఖ్య 2,00,79,599గా ఉంది. గత 24 గంటల వ్యవధిలో కొత్త కేసుల కంటే రికవరీలే ఎక్కువగా ఉండటం ఊరటనిచ్చే అంశం. ప్రస్తుతం రికవరీ రేటు 83.50 శాతంగా ఉంది.

ప్రస్తుతం భారత దేశవ్యాప్తంగా 37,04,893 మంది కరోనాతో బాధ పడు తన్నారు. క్రియాశీల రేటు 15.41 శాతంగా ఉన్నది. మరోవైపు, నిన్నటి రోజున 4,000 మంది మృత్యువాత పది నాట్లు తెలుస్తున్నది చేరుకున్నారు.