ఏపీ ప్రభుత్వానికి (AP Government) ఆర్బీఐ (RBI) మరో వెయ్యి కోట్ల రూపాయిల రుణాన్ని (Loan) మంజూరు చేసింది. ఏపీ ప్రభుత్వం ఆర్బీఐ వద్ద సెక్యూరిటీ బాండ్ల వేలం ద్వారా వెయ్యి కోట్ల రూపాయలను పొందింది. వేలంలో 5 రాష్ట్రాలు పాల్గొన్నాయి. ఏపీ ప్రభుత్వం అత్యధిక వడ్డీ 7 శాతం చెల్లించి రుణాన్ని సొంతం చేసుకుంది.
17 సంవత్సరాలకు 500 కోట్లు, 18 సంవత్సరాలకు మరో 500 కోట్లు రుణాన్ని సమీకరించింది. దీంతో కేంద్రం ఇచ్చిన అదనపు రుణ పరిమితిలో ఏపీకి 150 కోట్లు మాత్రమే మిగిలాయి. అయితే మళ్లీ అదనపు రుణ పరిమితి కోసం ఆర్ధిక శాఖ అధికారులు కేంద్రం వద్ద ప్రయత్నాలు చేస్తున్నారు. అదనపు రుణపరిమితి ఇవ్వకపోతే రాష్ట్రం మరింతగా ఆర్ధిక కష్టాలు ఎదుర్కోకతప్పదు అని ఆశ్లేషకుల భావన.