PK we need changePK we need change

అంజనీపుత్రా (Anjani putra)! ఆ రెండుపార్టీల పాలనతో ప్రజలు విసిగెత్తి పోయారు. మార్పు రావాలి అంటే జనసేన పార్టీ (JanaSena Party) రావాలి అని ప్రజలు నిర్ణయించుకొన్నారు. ప్రజల్లో మార్పు మొదలు అయ్యింది. మార్పు రావాల్సింది జనసేన పార్టీ నాయకుల్లో (Janasena Leaders) అని ప్రజలు అనుకొంటున్నారు. మీ కోటల తలుపులు ఇప్పటికన్నా తెరవండి. వాస్తవాలు తెలుసుకోండి అని ప్రజలు కోరుకొంటున్నారు.

మార్పుకోసం, ప్రజల కోసం కుటుంబ బంధనాలను తోచుకొని వచ్చి మీరు పార్టీ పెట్టారు. మీరు ఆశించిన అదే మార్పుకోసం మీ కోటరీ బందనాలను తెంచుకోవడం అనేది మీకు సాధ్యం కదా? పార్టీ విస్తరణ నేడు తక్షణ అవసరం. అవకాశవాదులను దూరం పెడుతూనే గెలుపు గుర్రాలకు అవకాశం ఇద్దాం. మీ దర్శనం కోసం ఎదురు చూస్తున్న వారికి మన కోటల తలుపులు తెరవండి.

అలానే అవసరమైన నిజమైన ఫీడ్ బ్యాక్ మీ కోటల గోడలు దాటి మీకు చేరడం లేదు. దీనికి ఏమిటి కారణం అనే దాని గురించి కూడా ఒక్కసారి ఆలోచించండి.

బాధిత వర్గాల పాలిత అర్జనుడా!

ఆకులు అలములు తిని బ్రతుకే పాండవులు (Pandavas) పచ్చినెత్తురు తాగే వారుగా మారిన తరువాతే మార్పు సంభవించింది. ఇదంతా రేపటి మార్పుకోసం. ఇది అంతా కుళ్లుపట్టిన రాజకీయ పార్టీలతో బ్రష్టుపట్టిన వ్యవస్థల ప్రక్షాళన కోసమే సుమా. ప్రజల బానిస బంధాలను మీరొక్కరే విడిపించగలరు. అది జరగాలంటే ముందు మీ బంధాలను తెంచుకొని రండి. అంజనీపుత్రా! మీ ఒక్కరికే ఇది సాధ్యం.

ఓ జనసేనుడా (Janasenuda)!

ఇది సలహా ఎంతమాత్రం కాదు. కోట్లాది గుండె చప్పుడు. వారి ఆశలసౌధం నుండి కారుతున్న కన్నీటి ధారల శబ్ధం. అంజనీపుత్రా! నీ బలం నువ్వు తెలుసుకో. అధర్మపాలన అంతం అవ్వాలి అంటే మీ పాదయాత్రకు ముందు జరగాల్సినవి చాలా ఉన్నాయి. ఇది ప్రజాస్వామ్యం. నాయకుల ద్వారానే పాలన జరుగుతుంది గాని ప్రజల ద్వారా కాదు. మనకు నాయకులు కావాలి. నాయకుల ధర్మ దర్శనానికి మీ కోటల తలుపులు ఇప్పటికైనా తెరవండి. ఇది మీ ప్రియాతి ప్రియమైన బాధిత ప్రజల కోసం. అధికారం దక్కని వర్గాలు కోరుకొంటున్న మార్పు కోసం.

ఆలోచించండి… ప్రజల్లో మార్పు మొదలు అయ్యింది. మారాల్సింది మన రాష్ట్ర-జిల్లా-తాలూకా నాయకులే. వారిని గాడిన పెట్టాల్సింది అంజనీపుత్రుడే? (Its from Akshara Satyam)

జనసేనానే ముఖ్యమంత్రి అభ్యర్థి: కొణిదెల నాగబాబు