Hari BabuHari Babu

మిజోరాం గవర్నర్’గా (Mizoram Governor) నియమితులైన కంభంపాటి హరిబాబుకు (Kambhampati Haribabu) జనసేనాని (Janasenani) అభినందనలు తెలియజేసారు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో (Andhra University) ఆచార్యుడిగా (Professor) విద్యార్థులను హరిబాబు తీర్చిదిద్దారు. ప్రజా ప్రతినిధిగా విశాఖ నగర అభివృద్ధికి ప్రశంసనీయమైన సేవలను కంభంపాటి హరిబాబు అందించారు. అటువంటి శ్రీ కంభంపాటి హరిబాబు మిజోరాం రాష్ట్ర గవర్నర్’గా నియమితులు కావడం చాలా సంతోషకరమైన విషయం అని పవన్ కళ్యాణ్ ఒక ప్రకటనలో తెలిపారు. శ్రీ హరిబాబు గారికి తన తరఫున, జనసేన (Janasena) పక్షాన హృదయపూర్వక అభినందనలను తెలియ జేశారు.

ఎంపీగా, ఎమ్మెల్యేగా విద్య, వైద్యం, స్కిల్ డెవలప్మెంట్ రంగాలపై శ్రీ హరిబాబు దృష్టిపెట్టారు. ఈశాన్య రాష్ట్రమైన మిజోరాం అభివృద్ధిలో శ్రీ హరిబాబు గారు అనుభవం ఎంతో దోహదపడుతుందనే విశ్వాసం ఉంది అని పవన్ ఆశాభావం వ్యక్తం జేశారు.

హర్యానా గవర్నర్’గా బాధ్యతలు స్వీకరించనున్న శ్రీ బండారు దత్తాత్రేయకు (Bandaru Dattatreya) కూడా పవన్ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజా జీవితంలో విశేష అనుభవం ఉన్న శ్రీ దత్తాత్రేయ ఇప్పటి వరకూ హిమాచల్ ప్రదేశ్ (Himachal Pradesh) రాష్ట్రానికి విలువైన సేవలు అందించారు. హర్యానా రాష్ట్ర అభివృద్ధిలో తన వంతు పాత్రను దత్తాత్రేయ పోషిస్తారనే నమ్మకం ఉంది అని పవన్ ఆశాభావం వ్యక్తం జేశారు

First International Best Actor S V Ranga Rao

Spread the love