వనదేవతలు సమ్మక్క-సారలమ్మలువనదేవతలు సమ్మక్క-సారలమ్మలు

వనదేవతలు సమ్మక్క-సారలమ్మలు (Sammakka-Saralamma) కొలువైన మేడారం జాతర (Medaram Jatara) మహిమాన్వితమైనది. ఈ గొప్ప జాతర సందర్భంగా తెలంగాణ (Telangana) ప్రజలు, ముఖ్యంగా అడవి తల్లి బిడ్డలకు భక్తి పూర్వక శుభాకాంక్షలను జనసేనాని (Janasena) పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) తెలియచేసారు. బుధవారం నుంచి మొదలవుతున్న వనదేవతలు సమ్మక్క-సారలమ్మలు జాతర భారతీయ సనాతన ధార్మిక వైశిష్ట్యానికి నిలువెత్తు నిదర్శనం. ఈ దేవతలు అడవి బిడ్డల వీరత్వానికి, ధీరత్వానికి ప్రతీకలు అంటూ పవన్ కళ్యాణ్ కొనియాడారు.

వనదేవతలు (Vana Devata) సమ్మక్క – సారలమ్మలు జాతర తెలంగాణాలో అత్యంత వైభవోపేతంగా జరుగుతుంది. ఈ వన జాతర దేశానికే తలమానికం అని పవన్ అన్నారు. దేశం నలుమూలలోని గిరిజనులు, గిరిజనేతరులు తమ ఇలవేల్పులుగా పూజిస్తున్న ఈ శక్తి స్వరూపిణీల జాతర నయానందకరం, భక్తి ముక్తిదాయకం అంటూ జనసేనాని కొనియాడారు.

మనదేశంలో కుంభమేళా (Kumbh Mela) తరవాత కోట్లాదిమంది ఈ జాతరకు ప్రతీసారీ తరలి వస్తున్నారంటే భక్తులు సమ్మక్క-సారలమ్మను ఎంతలా ఆరాధిస్తారో అర్ధం అవుతుంది. కోరిన కోర్కెలు నెరవేర్చే కొంగు బంగారం మేడారం గద్దె అని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఈ జాతర ఆద్యంతం గిరిజన సంప్రదాయంతో చూడ ముచ్చటగా, అనిర్వచనీయమైన ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిస్తుంది అని పవన్ కళ్యాణ్ అన్నారు.

తెలంగాణ ప్రాంతవాసులతోపాటు దేశ ప్రజలందరినీ దుష్ట శక్తుల నుంచి ఈ వనదేవతలు కాపాడి, కరుణ కటాక్షాలతో చల్లగా చూడాలని కోరుకుంతున్నాను. ప్రణామాలు అర్పిస్తున్నాను అని పవన్ కళ్యాణ్ తెలియ జేసారు.

దామోదరం సంజీవయ్య ఎప్పటికీ ఆదర్శ ముఖ్యమంత్రే!