Pawan Kalyan and Chandra BabuPawan Kalyan and Chandra Babu

జనసేనాని (Janasenani) పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) మౌనం వెనుక దాగిఉన్న వ్యూహాలు ఏమిటి? జనసేన పార్టీ (Janasena Party) బలోపేతంపై సేనాని వెనుకడుగు వేయడంపై దాగిఉన్న అక్షర సత్యం (Akshara Satyam) ఏమిటి…  ఇల్లేమో దూరం.. అసలే చీకటి.. గాఢాంధకారం… దారి అంతా గతుకులు… చేతిలో దీపం కూడా లేదు.. కానీ, గుండెల నిండా ధైర్యం ఉంది అనే ఆవేశంతో, ఆక్రోశంతో, ఆవేదనతో, జనసేన అనే పార్టీని పవన్ కళ్యాణ్ స్థాపించారు. సేన ద్వారా సమాజానికి ఆశలు చూపించారు. చలి చీమలను పులి పిల్లల్లా తయారు చేశారు. కానీ సేనానిలో ఉన్న ఆనాటి ఆవేశం నేడు ఏమి అయిపోయింది? పులిపిల్లల్లా మారిన చెలి చీమల నేటి మనోవేదనకు కారణం ఏమిటి?

చావు అంటే భయం లేదు. సంపూర్ణ సమాజంపై తప్ప, బంధు మిత్ర, సపరివారంపై ప్రేమ లేదు. డబ్బు అంటే పిచ్చి లేదు. పదవి అంటే వ్యామోహం లేదు. కానీ చచ్చుబడ్డ వ్యవస్థలను మేల్కొల్పాలి. అధికార ఫలాలు సమాజంలోని అన్ని వర్గాలకు తమాషాలో దక్కాలి. అందుకే పూలపానుపు లాంటి సినీజీవితాన్ని వదిలి, దుర్గంధంతో కంపుకొడుతున్న రాజకీయాల్లోకి జనసేనాని ప్రవేచించారు. రాజకీయాలను ప్రక్షాళన చేస్తారు. పరిపాలన అంటే ఎలా ఉంటాదో చేసి చూపిస్తారు అని నాడు సమస్త జనులు భావించారు. ప్రజల అంచనాలకు అనుగుణంగా జనసేన పార్టీ బలోపేతం ఎప్పుడు?

ఉగ్ర నరసింహుడు పవన్ కళ్యాణ్ లో దాగి ఉన్న నాటి పౌరుషం ఏమి అయిపోయింది? సేనాని నాటి మాటలకు కార్యాచరణ ఎక్కడ? తాడిత పీడిత బాధిత వర్గాలు కోరుకొంటున్న సేనాని ద్వారా మార్పు ఏమి అయిపోయింది? ప్రజా పక్షపాతిగా పోరాడాల్సిన పవన్ కళ్యాణ్ పచ్చ పార్టీ పక్షపాతిగా ఎందుకు కొనసాగుతున్నారు? శత్రు శ్రేయోభిలాషుల క్షేమాన్ని మాత్రమే కోరే పూజారుల అష్టోత్తరాల మధ్య పవనేశ్వరుడు యోగనిద్రలో ఎందుకు మునిగి తెలియాడుతున్నాడు? ఇటువంటి మన అందరి విమర్శలకు, అలానే మన అందరి మదిలోని మెదిలే ప్రశ్నలకు సమాధానమే నేటి ఈ విశ్లేషణ సూటిగా సుత్తి లేకుండా.

జనసేనానికి అసలు వ్యూహాలు ఉన్నాయా?

1. జనసేనానికి వ్యూహాలు లేకపోయి ఉంటే అసలు జనసేన పార్టీనే నేడు ఉండి ఉండేది కాదు. జనసేన పార్టీ ఈ స్థాయికి ఎదగడానికి సేనాని కష్టం అలానే వ్యూహాలే కారణం. అలానే జనసేన ఇంకా ఎదగకుండా ఉండడానికి కూడా సేనాని వ్యూహాలే కారణం.

2. యుద్ధంలో ఆవేశం ఉండాలి. మహా సంగ్రామానికి (యుద్ధానికి) కావాల్సిన సన్నద్ధతలో ఆలోచన ఉండాలి, ఆచరణ ఉండాలి. ఆ సన్నద్ధతలో భాగంగానే సేనాని పొత్తుల వ్యూహంతో వెళుతున్నాడు. అయితే ఆచరణలో కొంత అలసత్వం ఉన్నప్పటికీ జనసేనపార్టీ ఇమేజ్ ని పెంచడంలో సేనాని వ్యూహాత్మకంగానే వెళుతున్నారు. దేశస్థాయిలో జనసేన గురించి నేడు చెప్పుకొనే స్థాయికి పార్టీ ఎదగడానికి కూడా సేనాని వ్యూహాలే కారణం.

3. జనసేన పొత్తుల వ్యూహంతో వెళ్లి ఉండకపోతే మరొక్కసారి ఆ రెండు సామజిక వర్గాలు, లేదా ఆ రెండు పార్టీలు ఒక్కటి అయ్యి జనసేనని ఓడించడానికి ప్రయత్నించి ఉండేవారు. మనల్ని తొక్కడానికి ప్రయత్నించి ఉండేవారు.

4. జనసేన పార్టీని 2014 లో ప్రారంభించినప్పటికీ జనసేన రాజకీయ ప్రస్తానం మొదలు అయ్యింది 2024 లోనే అని చెప్పాలి. 2014 లో పోటీచేయాలిసిన స్థానాల్లో 2024 లో పోటీచేసింది. నిజానికి జనసేన పార్టీ 10 సంవత్సరాల కాలాన్ని వృధా చేసి ఉండవచ్చు.

5. పది సంవత్సరాల వృధాలో కూడా సేనాని తప్పు లేదు అని చెప్పాలి. ఎందుకంటే కాపులపై ఉన్న కులముద్ర, కాపు ఉద్యమాలు పెట్టిన పెంట, ప్రజారాజ్యం ఓటమి, విలీనం, పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లు, అణగారిన వర్గాల్లో ఉన్న పేదరికం, అనైక్యత, ఆ రెండు పాలక వర్గాల్లో ఉన్న రహస్య సంబంధ బాంధవ్యాలు అనే గుదిబండలే పది సంవత్సరాల కాలాన్ని వృధా చేసాయి తప్ప పవన్ కళ్యాణ్ తప్పిదం కాదు అని ఒప్పుకోక తప్పదు.

6. తీవ్ర ప్రతికూల పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ పార్టీని పెట్టినప్పటికీ, జనసేన పార్టీ ఈ స్థాయికి ఎదిగింది అంటే అది కేవలం పవన్ కళ్యాణ్ వ్యూహాల వల్లనే తప్ప మరేది కాదు. పవన్ కళ్యాణ్ సాగతీత వ్యూహాలు ఉండి ఉండక పోతే జనసేన అనే పార్టీ నేడు ఉండి ఉండేది కాదేమో. అయితే కేవలం 21 స్థానాల్లో మాత్రమే పోటీచేయడం అనే సేనాని అతి మంచితనం తప్పిదంగానే భావించాలి.

6. ఐదు సంవత్సరాలు కలిసి ఉండమని ప్రజలు కూటమికి తీర్పు ఇచ్చాక సేనాని కూటమిలో కొంతకాలంపాటు మౌనంగా ఉండి తీరాల్సిందే. సేనాని యోగనిద్రలో ఉన్నంతవరకే కూటమి సక్రమంగా ఉంటుంది. టీడీపీగాని, లేదా లోకేష్ అనుచర గానం కానీ రెచ్చిపోతున్నారు. జనసేనకు తీవ్ర నష్టం కలిగిస్తున్నారు అనేది పవన్ కళ్యాణ్ కి తెలుసు. అయినను అయన మౌనం వహిస్తున్నది రాష్ట్రము కోసం, తన పార్టీపై ప్రజల మన్ననలు పొందడం కోసం. సరిఅయిన సమయం కోసం మాత్రమే యోగనిద్రలో ఉంటున్నాడు తప్ప తన లక్ష్యాన్ని మరిచి పోలేదు అని గమనించాలి. టీడీపీ తన తప్పులను సరిదిద్దుకోలేకపోతే, ప్రళయ రుద్రుడులా కూటమి నుండి బయటికి వచ్చి తీరుతాడు. అధికారంలో మార్పు అనే మన లక్ష్య సాధనకు చేరుకొంటాడు.

7. పొత్తులు పెట్టుకోవడం, పొత్తుల్లో మౌనంగా ఉండడం అనేవి సేనాని వ్యూహాల్లో భాగమే. సేనాని వ్యూహాల్లో నేటివరకు పెద్దగా తప్పులు లేవు. జనసేన వ్యూహాలను సమర్ధించాలి గాని అనుమానించడం మంచిది కాదు. జనసేన పార్టీ ఎదుగుదలకు పొత్తులు పెట్టుకోవడం, చుట్టరికాలు చేయడం కూడా ముమ్మాటికీ సమర్ధనీయమే. అయితే రాష్ట్రము పేరుతో పొత్తులు పెట్టుకోవడం, ఆ పెట్టుకొన్న పొత్తులు పేరుతో తన జనసేన పార్టీ భవితను మరిచిపోతే మాత్రం జనసేన పార్టీ మనుగడనే కష్టం కావచ్చు.

8. అలానే ప్రజల కోసం సేనాని తన సర్వస్వాన్ని త్యాగం చేయడాన్ని అభినందించాలి గాని తప్పు బట్టడం మంచిది కాదు. ప్రజల కోసం, రాష్ట్రము కోసం సేనాని నిరంతరం పనిచేస్తూ ఉండడం కూడా తప్పు కాదు. కానీ ప్రజల కోసం, రాష్ట్రము కోసం పనిచేస్తూ, తన మద్దతుదారులను, తన నాయకులను, కార్యకర్తలను నిర్లక్ష్యం చేయడం మాత్రం తప్పిదంగానే భావించాలి.

బడుగుల ఆశలసౌధానికి రక్తాక్షర సందేశం:

1. పవనేశ్వరా! ఈ రోజు కాకపోయినా రేపైనా టీడీపీ, వైసీపీలు జనసేన పార్టీకి అలానే జనసేన మద్దతుదారులకు సమాన ప్రత్యర్థులే అనే వాస్తవాన్ని మరిచిపోకండి. అందుకే ప్రతీ విషయంలో జనసేనాని ఆచితూచి మాట్లాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సీఎం బాబుని, మంత్రి లోకేష్ ని, టీడీపీని చీటికీ మాటికీ శృతి మించిన పొగడ్తలతో పొగడడం అనేది జనసేన పార్టీకి అంత శ్రేయస్కరం కాదు.

2. నిన్నటి టీడీపీ మహానాడును ఉద్దెశించి జనసేనాని పేజీల పేజీల ట్వీట్లను పెట్టడం జరిగింది. అలానే ఎన్టీఆర్ ఒక మహాపురుషుడు అన్నట్లు పవనేశ్వరుడు ట్వీట్ చేయడం కూడా జరిగింది. రేపటి మన శత్రువుని మా దేవుడు పవన్ కళ్యాణ్ ఇలా మెచ్చికోవడం ఏమిటి అని జనసేన మద్దతుదారులు తమలో తామే రగిలిపోతున్నారు. ఇదేమిటి పవన్ కళ్యాణ్ ని మా దేవుడుగా భావిస్తుంటే, మా దేవుడేమో మా శత్రువులను కౌగిలించుకొంటాడు, పేజీలకు పేజీలు ట్వీట్లు చేస్తుంటాడు అని తాడిత పీడిత వర్గాలు తమలో తామే కుములిపోతున్నాయి.

3. భాగస్వామ్య పార్టీ ఆవిర్భావ సభను ఉద్దేశించి మెచ్చుకొంటూ జనసేనాని ట్వీట్ చేయడం ముమ్మాటికీ తప్పు కాదు. అలానే ఒక మహానటుడు, రాజకీయాల్లో చరిత్ర సృష్టించిన ఎన్టీఆర్ జన్మదినంపై ట్వీట్ చేయడం కూడా తప్పు కాదు. అయితే జనసేనాని పవన్ కళ్యాణ్ గారు ఒక పార్టీకి అధినేత అనే విషయాన్ని మరిచిపోయి ఒక స్థాయిని మించి మెచ్చుకోవడం జనసేనకు (దీర్ఘకాలంలో) ముమ్మాటికీ మంచిది కాదేమో?

4. నిజానికి రాక్షసులు అంటే దేవతలకు, మానవులకు శత్రువులు. కానీ దేవుడుకి రాక్షసులు, దేవతలు, మానవులు అందరూ సమానమే. దేవుడు అందరినీ సమానంగానే చూస్తాడు. సమానంగా మెచ్చుకొంటాడు. అందుకే ధర్మాన్ని పాటించడంలో దేవుడిలాంటి పవనేశ్వరుడికి మన మిత్రులు, మన శత్రువులు కూడా సమానమే. పవన్ కళ్యాణ్ అందరినీ సమదృష్టితోనే చూస్తాడు అనేది కూడా తాడిత పీడిత బాధిత వర్గాలు గమనించాలి. అలానే తన జనసేన పార్టీని, పార్టీ లక్ష్యాన్ని మరిచిపోయి టీడీపీని అతిగా పొగడడం పవన్ కళ్యాణ్ మానుకోవాలి. అవసరం వచ్చినప్పుడు కూటమి తప్పులను కూడా సద్విమర్శలు చేయడంలో వెనుకాడ రాదు.

అంజనీపుత్రా! అతిమంచితనం అనర్ధదాయకం?:

1. సమస్త ఆర్యావర్తనానికి ఏకఛత్రాధిపతి, సామ్రాట్ అయిన ధర్మరాజు తన రాజ్యాన్ని కౌరవుల మాయాజూదంలో పోగొట్టుకున్నాడు. ఇదే సభలో ధర్మరాజు తన అన్నదమ్ములను బానిసలుగా మిగుల్చుతాడు. చివరకు భార్య ద్రౌపది ఘోరాతి ఘోరంగా అవమానింప బడుతుంది.

2. మాయాజూదం ద్వారా దుర్యోధనుడు, దృతరాష్ట్రుడు, శకుని చాలా తప్పు చేస్తున్నారు అని ఆ సభలో ఉన్న వారు అందరూ భావిస్తుంటే ధర్మ రాజు మాత్రం దుర్యోధనుడు, ధృతరాష్టుడూని కొనియాడుతుంటాడు. దుర్యోధనుడు, ధృతరాష్టుడూ, శకునిలు ధర్మనిరతులు అని ధర్మరాజు మెచ్చుకొంటూ ఉంటాడు. కౌరవులను మెచ్చుకోవడం అంటే దుర్యోధనుని యొక్క గొప్పదనం కాదు. దర్యారాజు నమ్ముకొన్న యొక్క ధర్మం యొక్క గొప్పదనం/ బలహీనత అని గ్రహించాలి.

3. అలానే పొత్తు పేరుతో టీడీపీ వర్గాలు తనకు, తన పార్టీకి నష్టం కలిగిస్తున్నప్పటికీ సేనాని స్పందించడం లేదు సరికదా వారిని మెచ్చుకొంటున్నారు. నాడు ధర్మరాజు వలే నేటి పవన్ కళ్యాణ్ కూడా తనకు, తన పార్టీకి జరుగుతున్న నష్టాన్ని పట్టించుకోవడం లేదు. టీడీపీ శ్రేణులను, టీడీపీ అధినాయకులను సేనాని కౌగిలించుకోవడం, లేదా మెచ్చుకోవడం అనేది పవన్ కళ్యాణ్ నమ్ముకొన్న ధర్మం యొక్క గొప్పదనం లేదా అయన పాటిస్తున్న ధర్మం యొక్క బలహీనత.

4. అయితే నాడు ధర్మరాజు పాటించింది అసలు ధర్మం యొక్క వాస్తవ రూపం కాదు. అధర్ములు వద్ద అతి మంచితనం/పొగడ్తలు సమాజానికి మంచిది కాదు అని పాండవులకు స్పష్టంగా చెప్పడానికి పాండవుల వద్ద నాడు శ్రీకృష్ణుడు ఉన్నాడు.

5. అలానే పవనేశ్వరా! మీరు పెట్టింది ఒక రాజకీయ పార్టీ. మీరు రాజకీయ పార్టీ పెట్టింది రాజకీయాలు చేయడానికే తప్ప చుట్టరికాలు చేయడానికి కాదు. మీకొక దీర్ఘకాలిక లక్ష్యం ఉంది. నేడు మీరు పెట్టె ప్రతీ ట్వీట్/ప్రతీ పొగడ్త రేపు మీ తలకు/మీ పార్టీ తలకు చుట్టుకొంటుంది అని జనసేనానికి చెప్పడానికి శ్రీకృష్ణుడు లాంటి ఒక వ్యూహ చతురుడు జనసేనాని వద్ద ఉండాలి. నిజానికి సేనాని చుట్టూ ఉన్నది శ్రీకృష్ణుడు లాంటి వ్యూహాచతురులా లేక శకునిలాంటి శత్రు శ్రేయోభిలాషులా అనేది అంజనీ పుత్రుడు నిర్ణయించుకోవాలి?

6. శ్రీకృష్ణుడి లాంటి వ్యూహాచతురులను చుట్టూ పెట్టుకొంటే మార్పు సాధ్యమవుతుందిగాని శకుని మామలను చుట్టూ కోటరీగా పెట్టుకొంటే మార్పు సాధించడం సాధ్యం కాదు అనే వాస్తవం పవనేశ్వరుడికి తెలియంది కాదు.

7. క్లిష్ట సమయాల్లో దేవుడు కూడా సప్తర్షులతో, దేవతలతో, శిష్య పరివారంతో ఆలోచించే అతి ముఖ్య నిర్ణయాలు తీసికొంటూ ఉండేవారు. ఏకపక్ష నిర్ణయాలు ఎప్పటికీ శ్రేయస్కరం కాదు.

8. అందుకే వ్యూహా చతురులతో కూడిన పొలిట్ బ్యూరో వల్లనే మా దేవుడులాంటి సేనాని సీఎం అవ్వగలరు. మా సేనాని సీఎం అయినప్పుడే మా కల నెరవేరుతుంది. ఆరోజే మన రోజు అవుతుంది అనే అక్షర సత్యాన్ని సేనాని మరిచి పోరాదు.

పవనేశ్వరా! విజయానికి మనం, మన పార్టీ సన్నద్ధం అయ్యేవరకు పొత్తులు అనే చుట్టరికాలు చేయడం తప్పు కాదు. వాస్తవానికి రాష్ట్రానికి, జనసేన పార్టీకి కూడా పొత్తులు అవసరం. కానీ చుట్టరికాల (పొత్తుల) పేరుతో జనసేన పార్టీ పటిష్టతను పట్టించుకోకపోయినా… జన నాని సీఎం అవ్వాలి అనే అంతిమ లక్ష్యాన్ని మరిచిపోయినప్పుడే… పొత్తుల ఉచ్చులో పడి మనం మునిగి “పోతామేమో” ఆలోచించండి.

పవన్ కళ్యాణ్ ద్వారా బడుగులకు అధికారం ఎండమావేనా: అక్షర సందేశం

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *