Pawan Kalyan with Balayya LokeshPawan Kalyan with Balayya Lokesh

జనసేనాని, జనసేన పార్టీ శ్రేణులను గుద్దుకు పోతాము అన్నట్లు టీడీపీ శ్రేణులు ప్రవర్తిస్తున్నాయి. స్వతంత్రంగా నెగ్గలేని చంద్రబాబుని మా పవణేశ్వరుడు పవన్ కళ్యాణ్ పొత్తు వ్యూహంతో గెలిపించాడు. మా జనసేనుడు త్యాగాల వల్లనే టీడీపీకి అధికారం దక్కింది. టీడీపీని గెలిపించిన మా నాయకుడి పవన్ కళ్యాణ్ నెత్తిమీద మీ టీడీపీ పెత్తనం ఏమిటి? పవన్ కళ్యాణ్ రాష్ట్ర అభివృద్ధి కోసం ఆలోచిస్తుంటే, బాబు మాత్రం తన కుటుంబ సామ్రాజ్య విస్తరణ కోసమే ఆలోచిస్తున్నట్లు ఉంది. బాబు పుత్ర వాత్సల్యం కూటమి ఐక్యతని దెబ్బ తీయడం లేదా అని జనసేన పార్టీ శ్రేణులు ఆవేదన చెందుతున్నాయి?

టీడీపీ జనసేన పార్టీల మధ్య రగులుతున్న ఈ రగడపై జనసేనాని పవన్ కళ్యాణ్ స్పందించారు. జనసేన పార్టీ శ్రేణులను తగ్గమని తరచూ హెచ్చరికలు కూడా చేస్తున్నారు. కానీ టీడీపీ నుండి గాని చంద్రబాబు నుండి కానీ ఎటువంటి అధికారిక ఖండన రావడం లేదు. టీడీపీ మౌనం వెనుక ఏమైనా కుట్ర దాగి ఉన్నదా అనే అనుమానాలు కలుగుతున్నాయి? పవన్ కళ్యాణ్ ఉనికిపై చంద్రబాబు నాయుడు గాని అయన పరివారంగాని ఏమైనా కుట్రలు పన్నుతున్నారా అనే అనుమానాలు రోజు రోజుకీ పెరుగుతున్నాయి.

ఒక పక్కన జనసేన పార్టీ శ్రేణులను గుద్దుకు పోదాం అన్నట్లు టీడీపీ పాచికలు వేస్తుంటే, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాత్రం “అయినను సర్దుకు పోదాం” అని పదే పదే ఎందుకు అంటున్నారు. పవన్ కళ్యాణ్ ఈ మెతక వైకిరికి కారణం వ్యూహమా లేక మరేదైనానా? అయినా ఎన్నాళ్లీ సేనాని త్యాగాలు, సర్దుబాట్లు అని సర్వత్రా చర్చించు కొంటున్నారు. అతివాదులు, కమ్మ వ్యతిరేకులు, వైసీపీ ప్రేమికులు అయితే మరీ రెచ్చగొడుతున్నారు.

అసలు ఈ రచ్చకు కారణం ఏమిటి?

1. అయితే టీడీపీ, జనసేన పార్టీల మధ్య ఈ రచ్చకు కారణం బాబు పుత్ర వాత్సల్యం, టీడీపీ శ్రేణుల అత్యుత్సాహమే తప్ప వైసీపీ కాదు అని అర్ధం అవుతున్నది. అయితే టీడీపీ – జనసేనల మధ్య రగిలిన ఈ చిచ్చుని వైసీపీ వాడుకొంటున్నది అని చెప్పవచ్చు.

2. టీడీపీ యువ కిశోరం నారా లోకేష్ డిప్యూటీ సీఎం కావాల్సిందే అనే వాదనను టీడీపీ ఉద్దేశపూర్వకంగా పెంచుతున్నది అనిపిస్తున్నది. కడపలో జరిగిన సమావేశంలో సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో నారా లోకేష్ ని డిప్యూటీ సీఎంని చెయ్యాలి అని టీడీపీ కడప జిల్లా అధ్యక్షుడు డిమాండ్ చేశారు. అయినప్పటికీ చంద్రబాబు నాయుడు ఈ ప్రకటనను ఖండించక పోవడం అనుమానించవలసిన విషయం.

3. ఏపీ ముఖ్యమంత్రికి కావాల్సిన అర్హతలు ఒక్క లోకేష్ కే ఉన్నాయి. వచ్చే 20 సంవత్సరాలు నారా లోకేష్ నే ముఖ్యమంత్రిగా ఉంటారు అని మంత్రి టి జి భరత్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి సమక్షంలో, దావోస్ లో, అన్నప్పటికి బాబు అధికారికంగా నేటికీ ఖండించలేదు. అసలు దావోస్ పెట్టుబడులు కోసం వెళ్ళారా లేక లోకేష్ ని ముఖ్యమంత్రిగా ప్రకటించడానికి వెళ్ళారా. వచ్చే 20 సంవత్సరాలు లోకేష్ నే సీఎం అయితే జనసేన పరిస్థితి ఏమిటి? బీజేపీ పరిస్థితి ఏమిటి? టీడీపీ పల్లకీలు మొయ్యడానికే సేనాని జనసేన పార్టీని పెట్టారా. బాబు కుటుంబం కోసమే సేన పొత్తు పెట్టుకోవాలా అని జనసేన శ్రేణులు, ప్రజలు కూడా చర్చించుకొంటున్నారు.

లోకేష్ ని సీఎం చేయడానికి పవన్ అంగీకారం అవసరమా?

4. నిజానికి టీడీపీకి 89 ఎమ్మెల్యేలు ఉంటే చాలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవచ్చు. అలాంటిది టీడీపీకి 136 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అంటే జనసేన, బీజేపీ, వైసీపీ కలిసినా గాని టీడీపీ ప్రభుత్వానికి వచ్చే డోకా ఏమీ లేదు. లోకేష్ బాబుని సీఎంగా ప్రకటించడానికి అవసరమైన మద్దతు బాబుకి ఉన్నది. బీజేపీకి కేంద్రంలో టీడీపీ అవసరము ఉంది కాబట్టి లోకేష్ ని సీఎం గా చేసినా గాని బీజేపీ అడ్డుచెప్పలేదు. పవన్ కళ్యాణ్ బీజేపీ మాట జవదాటరు కాబట్టి లోకేష్ కి అడ్డు చెప్పకపోవచ్చు. ఒకవేళ పవన్ కళ్యాణ్ అడ్డు చెప్పినా గాని ఉన్న ఎమ్మెల్యేల మద్దతుతో లోకేష్ ని సీఎంగా బాబు చేసుకోవచ్చు కదా.

5. కావాల్సిన మద్దతు ఉన్నప్పటికి బాబు లోకెష్ ని ఎందుకు సీఎంగా గాని డిప్యూటీ సీఎంగా చేయడం లేదు. లోకేష్ డిప్యూటీ సీఎం అని, కాదు కాదు లోకేష్ నే సీఎం అనే గందరగోళ పరిస్థితిని బాబు ఎందుకు సృష్టిస్తున్నారు. దావోస్ లో కూడా సీఎం ప్రస్తావన ఎందుకు తేవాల్సి వచ్చింది. ఒక వేళ ఈ మొత్తం గందరగోళంలో బాబు ప్రమేయం లేకపోతే బాబు ఎందుకు బహిరంగంగా ఖండించడం లేదు? కనీసం లోకేష్ అయినా ఖండించారా అంటే లేదు అనే చెప్పాలి? ఈ ప్రశ్నలకు సమాధానాలను పవన్ కళ్యాణ్ గాని, బీజేపీ గాని తెలిసికోగలగాలి.

6. కొద్ది నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల ముందు టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల శ్రేణుల మధ్య విభజన రేఖలు కూటమికి తీవ్ర నష్టాన్ని కలిగిస్తాయి. తద్వారా ఈ లొల్లి వైసీపీకి మాత్రమే లాభం అని టీడీపీకి తెలియదా అంటే తెలుసు. అయినప్పటికీ టీడీపీ శ్రేణులు ఈ డిప్యూటీ సీఎం లొల్లిని ఎందుకు తెస్తున్నారు?

క్షమాపణ చెప్పమనడం పవన్ చేసిన నేరమా?

7. తిరుపతిలో జరిగిన తొక్కిసలాట మరణాలకు టీటీడీ ఛైర్మెన్ అండ్ కో క్షమాపణ చెప్పాలి అని పవన్ కళ్యాణ్ అనడం నేరమా? నేరం కానపుడు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలతో మా టీడీపీకి సంబంధం లేదు అని నారా లోకేష్ ఎందుకు అన్నారు? పవన్ కళ్యాణ్ ప్రభుత్వంలో భాగం కాదా? పవన్ వ్యాఖ్యలతో లోకేష్ కి టీడీపీకి సంబంధం లేకపోతే టీడీపీ నిర్ణయాలతో పవన్ కళ్యాణ్ కి సంబంధం ఉంటుందా? అసలు ప్రభుత్వంలో సమిష్టి నిర్ణయం ఉంటుంది అని లోకేష్ కి తెలిసి కూడా మాకు సంబంధం లేదు అని ఎందుకు అన్నారు?

8. డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ దూసుకుపోతుంటే, టీడీపీ నాయకులూ, మంత్రులు మాత్రం వివాదాల్లో చిక్కుకు పోతున్నారు. పవన్ గ్రాఫ్ రోజు రోజుకీ పెరుగుతూ పోతుంటే టీడీపీ గ్రాఫ్, మరియు లోకేష్ గ్రాఫ్ రోజు రోజుకీ దిగజారిపోతున్నది అనే విశ్లేషణలు చూసి చంద్ర బాబు, లోకేష్ బాబు లేదా టీడీపీ భయపడుతున్నారా? అందుకే పవన్ కళ్యాణ్ కి ముకుతాడు వేయడం కోసమే డిప్యూటీ సీఎం అనే రాద్ధాంతం చేస్తున్నారా?

9. డిప్యూటీ సీఎం అంటే మంత్రితో సమానం అని టీడీపీ మీడియా మరియు టీడీపీ శ్రేణులే చెబుతున్నాయి. నారా లోకేష్ తండ్రి ముఖ్యమంత్రి. నారాలోకేష్ కీలకమైన మంత్రిగా కూడా ఉన్నారు. అయినప్పటికీ కేవలం డిప్యూటీ ముఖ్యమంత్రి కోసం లోకేష్ ఎందుకు ప్రయత్నం చేస్తున్నారు. తద్వారా సేనానితో రగడకు ఎందుకు సిద్ధం అవుతున్నారు. అసలు టీడీపీ వ్యూహం ఏమిటి?

10. లోకేష్ ని సీఎం గా అనౌన్స్ చేసినా, లోకేష్ ని డిప్యూటీ సీఎంగా చేసినా గాని పవన్ కళ్యాణ్ అడ్డు తగులుతారు. అప్పుడు కూటమి విచ్చిన్నం అవుతుంది. ఒకవేళ కేంద్ర రాజకీయాల దృష్ట్యా బీజేపీ, పవన్ కళ్యాణ్ లు లోకేష్ ఫార్ములాకి అంగీకరించినప్పటికీ జనసేన అనుయాయులు, బీజేపీ అనుయాయులు, న్యూట్రల్ ఓటరులు కూటమికి ఓటు వేయరు. అప్పుడు వైసీపీనే మరల ధికారంలోకి రావచ్చు అని అని చంద్రబాబుకి, టీడీపీకి తెలుసు. అయినప్పటికీ డిప్యూటీ సీఎం లేదా సీఎం లొల్లి ఎందుకు చేస్తున్నారు?

11. వైసీపీ సోషల్ మీడియా నాయకులపై గాని, వైసీపీలోని అక్రమార్కులపై గాని, లేదా టీడీపీని, పవన్ కళ్యాణ్ లాంటి వారిపై దుర్భాషలాడిన వారిపై టీడీపీ ఎందుకు చర్యలు తీసికోలేకపోతున్నది. జగన్ పాలనలో జరిగిన తప్పులపై కూటమి ప్రభుత్వం ఎందుకు చొరవ తీసికోవడం లేదు. వైసీపీతో టీడీపీకి లోపాయికారి ఒప్పందం ఉంది అనే ఆరోపణలు నిజమేనా?

టీడీపీ వ్యూహం ఏమిటి?

12. మొదట లోకేష్ ని మొదట డిప్యూటీ సీఎంగా చేసి, అనంతరం (వచ్చే ఎన్నికల లోగా) లోకేష్ ని సీఎంగా చేయడమే బాబు ధ్యేయంగా కనిపిస్తున్నది. వివిధ విశ్లేషకుల భావన కూడా ఇదే. పవన్ కళ్యాణ్ నిత్యం రాష్ట్రము కోసం ఆలోచిస్తాడు. అందుకే లోకేష్ ని సీఎం చేసినా గాని పవన్ టీడీపీతోనే ఉంటాడు అని బాబు & కో అంచనాలా ఉంది. వైసీపీ మీద ఉన్న వ్యతిరేకతతో పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికల్లో కూడా కూటమితోనే ఉంటాడు అని టీడీపీ అధిష్టానం భావనలా కనిపిస్తున్నది. అందుకే టీడీపీ డిప్యూటీ సీఎం అంశాన్ని ఎత్తికొన్నట్లు కనిపిస్తున్నది.

13. ఒకవేళ లోకేష్ ని సీఎం చేయడం ఇష్టంలేని పవన్ కళ్యాణ్ కూటమి నుండి బయటికి పోయినా గాని రాబోయే ఐదు సంవత్సరాలు ప్రభుత్వం కొనసాగుతుంది. వచ్చే ఎన్నికల్లో పొత్తు లేకపోతే, ఓట్లు చీలిపోయి వైసీపీకి లాభిస్తుంది అని టీడీపీకి తెలుసు. కూటమి లేకపోయినప్పుడు వైసీపీ అధికారంలోకి వచ్చినా గాని, దానికి టీడీపీ సిద్ధం అయినట్లు కనిపిస్తున్నది. 2034 లో వైసీపీని ఓడించడానికి జనసేన తిరిగి టీడీపీతో తప్పక కలుస్తాది. ఈలోగా లోకేష్ సీఎంగా ఎస్టాబ్లిష్ అవుతాడు. అప్పుడు జనసేనానీ పవన్ కళ్యాణ్ టీడీపీకి నిత్య అనుచరుడుగానే మిగులుటగాడు అనేది టీడీపీ అధిష్టానం అంచనా అని విశ్లేషకుల భావన.

ఇంతకీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కింకర్తవ్యం ఏమిటి?

14. రాష్ట్ర, దేశ శ్రేయస్సు దృష్ట్యా ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీల కూటమి అవసరం ఎంతైనా ఉంది. రాబోయే రోజుల్లో కూడా కూటమి ఉండాలి. కూటమి లేకపోతే వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. వైసీపీ తిరిగి అధికారంలోకి వస్తే, రాష్ట్రానికే కాదు టీడీపీకి, జనసేన ఉనికి కూడా ప్రమాదం అనేది అందరికీ తెలిసిందే. అందుకే కూటమి ఉండాలి. అయితే ఈ కూటమిలో జనసేన భాగస్వామి పార్టీగా ఉండాలి గాని బానిస పార్టీగా మిగల కూడదు. రాబోయే 20 సంవత్సరాల్లో లోకేష్ నే సీఎం అంటే జనసేన పార్టీని టీడీపీ బానిస పార్టీగానే చూస్తున్నది. దీనిపై పవన్ కళ్యాణ్ తక్షణమే ఆలోచన చేయాలి. మా జనసేన భాగస్వామి పార్టీనే గాని టీడీపీకి బానిస కాదు అనే విషయాన్ని బాబుకి స్పష్టం చేయాలి.

15. బాబు సీఎం. బాబు కుమారుడు లోకేష్ మంత్రి. లోకేష్ తోడల్లుడు ఎంపీ. బాబు వదిన గారు ఎంపీ. బాబు బావమరిది ఎమ్మెల్యే. ఇన్ని పదవులు అనుభవిస్తున్నా గాని లోకేష్ కి మరల డిప్యూటీ సీఎం ఇవ్వలిసిన అవసరం ఏమిటి? అప్పుడు కూటమి లో ఉన్న మిగిలిన పార్టీల ప్రాధాన్యం ఏమిటి అనే విషయాన్నీ బాబుకి స్పష్టం చేయాలి.

16. ఒకవేళ లోకేష్ సీఎం అయితే జనసేన పార్టీలకు, బీజేపీలకు వచ్చే నష్టం తక్షణమే లేకపోవచ్చు. కానీ దీర్ఘకాలంలో కూటమి విజయంపై ఇది ప్రభావం చూపుతుంది. జనసేన పార్టీ ఉనికిపై లోకేష్ సీఎం అనే అంశం ప్రభావం చూపుతుంది. లోకేష్ ని సీఎంగా సేన , బీజేపీలు అంగీకరిస్తారా లేదా అనే విషయాన్నీ అంతర్గతంగా స్పష్టం చేయాలి. లేకపోతే గ్రౌండ్ లెవెల్ లో టీడీపీ శ్రేణులు, జనసేన కార్యకర్త్యలు కొట్టుకు చస్తారు. ఇది వైసీపీకి లాభిస్తుంది తప్ప కూటమికి కాదు అని గుర్తించాలి.

17. పొత్తు ధర్మం పేరుతో ఒక పక్కన జనసేన పార్టీ నాయకులను, జనసైనికులను, జనసేన శ్రేయోభిలాషులను పవన్ కళ్యాణ్ నిరంతర నియంత్రిస్తూ వస్తున్నారు. పొత్తు కొనసాగాలి అంటే ఇది ముమ్మాటికీ అవసరం. సేనాని నియంత్రలను అభినందించాలి. కానీ పొత్తు ధర్మం టీడీపీ అధినేత చంద్రబాబుకి, టీడీపీ నాయకులకు, టీడీపీ మీడియాకి లేదా? రాష్ట్ర శ్రేయస్సు, దేశ శ్రేయస్సు అని జనసేన అంటుంటే టీడీపీ శ్రేణులు మాత్రం పుత్ర వాత్సల్యం కోసం పనిచేయడం ఎంతవరకు సబబు. రాష్ట్ర శ్రేయస్సు, పొత్తు ధర్మం టీడీపీకి పట్టవా అనే వాటిపై బీజేపీ, జనసేన ఆలోచన చేయాలి. అవసరమైతే తగు అంతర్గత దిద్దుబాటు చర్యలు తీసికోవాలి. లేకపోతే వన్ సైడ్ పొత్తు ధర్మం వల్ల కూటమికి భారీ నష్టం కలగవచ్చు.

జనసేన వ్యూహాత్మక తప్పిదమే?

18. ఎవరు ఒప్పుకొన్నా ఒప్పుకోకపోయినా గత ఎన్నికల్లో కేవలం 21 సీట్లకే జనసేన ఒప్పుకోవడం అనేది వ్యూహాత్మక తప్పిదమే. వచ్చే ఎన్నికల నాటికి అయినా జనసేన సమ భాగస్వామి స్థాయికి ఎదగాలి. జనసేన కూటమిలో సమభాగస్వామి స్థాయికి ఎదగనంత కాలం జనసేన పార్టీ శ్రేణులను టిడిపి చులకనగానే చూస్తుంది. ఇది కూటమికి నష్టం కలిగిస్తుంది. లోకేష్ సీఎం అయినా డిప్యూటీ సీఎం అయినా పవన్ కళ్యాణ్ గారికి నొప్పించక పోవచ్చు. ఎందుకంటే ఆయన స్థిత ప్రజ్ఞుడు. కానీ కూటమిలో సేనకి సమ భాస్వామ్యం లేకపోతే జనసేన మద్దతు దారులకు తీవ్ర బాధను తలిగిస్తుంది. వచ్చే ఎన్నికలు నాటికి వీరి బాధ వైసీపీకి అనుకూలంగా మారవచ్చు.

19. కూటమిలో జనసేన సమభాగస్వామిగా కొనసాగాలి అన్నా , లేదా బీజేపీతో కలిసి పోటీచేయాలి అన్నా జనసేన పార్టీ సంస్థాగతంగా బలపడాలి. దాని కోసం జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అవసరమగు నిర్ణయాలను తక్షణమే తీసికోవాలి. పవన్ కళ్యాణ్ తన చుట్టూ ఉన్నవారిలో కూడా అవసరం అయితే మార్పులు చేర్పులు చేయాలి. జనసేనానీ పవన్ కళ్యాణ్ సీఎం అవ్వాలి అనే లక్ష్యం ఉన్నవారినే తన చుట్టూ పెట్టుకోవాలి. అలానే జనసేన పార్టీ పటిష్టానికి నేటి నుండీ సేనాని తగు చర్యలు తీసికోవడం మంచిది.

చివరి మాట: టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిలో జనసేనకు ఇంచుమించు సమ భాగస్వామ్యం లేకపోయినా, లేదా లోకేష్ డిప్యూటీ సీఎం అయినా, లేదా లోకేష్ సీఎం అయినా పవన్ కళ్యాణ్ గారికి అభ్యంతరం ఉండకపోవచ్చు. అలానే అడ్డు చెప్పక పోవచ్చు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ స్థిత ప్రజ్ఞుడు.

కానీ వచ్చే ఎన్నికల నాటికి కూటమిలో జనసేనకు సమభాగస్వామ్యం లేకపోవడాన్ని జనసేన మద్దతుదారులు ఒప్పుకోకపోవచ్చు. అలానే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ఉండగా, లోకేష్ ని డిప్యూటీ సీఎంగా గానీ లేదా సీఎంగా గానీ జనసేన శ్రేయోభిలాషులు, మెజారిటీ ప్రజలు ఒప్పుకోరు. అందుకే కూటమి పదికాలాలు పాటు ఉండాలంటే టీడీపీ తన వైఖరిని తక్షణమే మార్చుకోవాలి. సేనకు, బీజేపీకి తగు ప్రాధాన్యం ఇవ్వాలి. అలానే కూటమి భాగస్వామ్య పార్టీలు అన్ని కూడా అదుపులో ఉండాలి. కలిసి మెలిసి పనిచేయాలి. జనసేనకు సమ భాగస్వామ్యం ఇవ్వకపోతే కూటమికి భారీ నష్టం అనే విషయాన్ని టీడీపీకి స్పష్టంగా చెప్పగలగాలి. లేకపోతే టీడీపీ పుత్ర వాత్సల్యం వైసీపీకే లాభించవచ్చు. అంజనీపుత్రా! ఆలోచించండి (It’s from Akshara Satyam)

 ఎన్నాళ్లీ మీ త్యాగాలు: హరిహర వీరమల్లుకి అక్షర సందేశం

Spread the love