KTR with Bheemla NayakKTR with Bheemla Nayak

భీమ్లానాయక్‌ ప్రీరిలీజ్ ఫంక్షన్’లో కీలక వ్యాఖ్యలు!

ఉన్నతమైన పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వాన్ని (Pawan Kalyan Personality) కేటీర్ (KTR) కీర్తించారు. జనసేనాని (Janasenani) గొప్పతనాన్ని కేటీర్ కొనియాడారు. చిరంజీవి (Chiranjeevi)  పిలిస్తే నాలుగేళ్ల క్రితం చరణ్‌ (Ram Charan) ఫంక్షన్‌కి వచ్చాను. ఇప్పుడు భీమ్లానాయక్‌ (Bheemla Nayak) సినిమా ప్రీ రిలీజ్‌ వేడుకకు (Prerelease fuction) తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధిగా రాలేదు. పవన్‌ కల్యాణ్‌ సోదరుడిగా వచ్చాను. సినిమా స్టార్‌లు చాలామంది ఉన్నాగాని కల్ట్‌ ఫాలోయింగ్‌ ఉన్నవారు పవన్‌ కళ్యాణ్ ఒక్కరే అంటూ కేటీర్ తన ప్రసంగాన్ని ప్రారంభించారు.

నేను కూడా కాలేజీలో చాటువుతున్న రోజుల్లో తొలిప్రేమ (Toli prema) చూశాను. పవన్‌ కల్యాణ్‌ అదే స్టార్‌డమ్‌ను (Stardom) మెయింటైన్‌ ఇన్నేళ్లు చేయడం గ్రేట్‌. చాలామంది అజ్ఞాత సూర్యులను పవన్ కళ్యాణ్ వెలుగులోకి తెచ్చారు. అలా వెలుగులోకి తెచ్చిన పవన్‌ కల్యాణ్‌, త్రివిక్రమ్‌, సాగర్‌ చంద్రకు, భీమ్లానాయక్‌ చిత్రబృందానికి నా శుభాకాంక్షలు అని తెలంగాణ ఐటీ మంత్రి అన్నారు.

భీమ్లానాయక్‌ సినిమా పెద్ద హిట్టవ్వాలి అని కేటీఆర్‌ ఆకాంక్షించారు. పవన్‌ కల్యాణ్‌ కథానాయకుడిగా నటించిన భీమ్లానాయక్‌ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ బుధవారం హైదరాబాద్‌లో బ్రహ్మాండంగా జరిగింది. కేటీఆర్‌తో పాటు తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, ఎమ్మెల్యేలు దానం నాగేందర్‌, మాగంటి గోపీనాథ్‌ అతిథులుగా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

కేసీఆర్‌ (KCR) నాయకత్వంలో సినిమా ఇండస్ట్రీకి దేశంలో హైదరాబాద్‌ హబ్‌గా ఉండాలి అనే లక్ష్యంతో పనిచేస్తున్నాం అని సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అన్నారు. సింగిల్‌ విండో, ఐదో షో, టికెట్‌ ధరల విషయంలో సీఎం, కేటీఆర్‌ డైరెక్షన్‌తో సత్వర నిర్ణయాలు తీసుకున్నాం. ఇండ స్ట్రీ, లక్షలాది కార్మికులు బాగుండాలనేది మా కోరిక అని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.

భీమ్లానాయక్‌ పవన్ కళ్యాణ్ ఏమన్నారు అంటే?

చిత్ర పరిశ్రమలో రాజకీయాలు ఇమడవు. ఇది కళాకారులు కలిసే ప్రాంతం. కుల, మత, ప్రాంతాలకి అతీతంగా కళాకారులు మాత్రమే ఉంటారు. చెన్నారెడ్డి లాంటి పెద్దలు చెన్నై నుంచి హైదరాబాద్‌కు తెలుగు చిత్ర పరిశ్రమను తెచ్చారు. ఇప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్‌ అందిస్తున్న తోడ్పాటుకు ముగ్ధులం. ఏ అవసరం ఉందన్నా స్పందించే తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ గారికి కూడా కృతజ్ఞతలు. నేను ఇప్పుడు జన జీవితంలో ఉన్నా నాకు అన్నం పెట్టింది సినిమానే అని పవన్ కళ్యాణ్ అన్నారు.

నాకు వేరే పని తెలియదు. అదే నాకు డబ్బు సంపాదించుకునే వృత్తి. తొలిప్రేమ, ఖుషీ లాంటి చిత్రాలని ఎంత బాధ్యతగా తీశామో… భీమ్లానాయక్‌’ని కూడా అంతే బాధ్యతగా తీశాం. అహంకారానికి, ఆత్మగౌరవానికి మధ్య మడమ తిప్పని యుద్ధమే ఈ సినిమా. పోలీసాఫీసర్‌కు రాజకీయ నేపథ్యం ఉన్న వ్యక్తికి మధ్య జరిగే సంఘర్షణను ఈ సినిమా చూపుతుంది అని పవర్ స్టార్ తెలిపారు.

ఈ సినిమాకి మూలాధారం నుంచి సహస్రాధారం దాకా అన్నీ త్రివిక్రమ్‌నే. త్రివిక్రమ్ లేకపోతే ఈ సినిమానే లేదు. రానా డానియల్‌ శేఖర్‌గా చాలా అద్భుతంగా నటించారు. సంయుక్తా మీనన్‌, నిత్యామీనన్‌ చక్కగా చేశారు అని జనసేనాని వివరించారు.

ఈ సినిమాతో చాలా మంది మేధావులని కలిశాను. యాక్టర్‌ని అయ్యాను కానీ హీరో ఎలా అవ్వాలో తెలియనప్పుడు నా కళ్లముందుకు వచ్చారు పవన్‌ కల్యాణ్‌. పవన్ కళ్యాణ్ చాలా స్పెషల్‌. కల్యాణ్‌ ఇంపాక్ట్‌తో ఇకపై నేను చేయబోయే సినిమాలు వేరేలా ఉంటాయి అని రానా అన్నారు.

శ్రీవారి దర్శనం టిక్కెట్ల సంఖ్య పెంపు-కోటా విడుదల

Spread the love