Prakash JavadekarPrakash Javadekar

రాజధానుల పేరుతో జగన్ – బాబులు మోసం చేస్తున్నారు

వచ్చే ఎన్నికల్లో బీజేపీకి అవకాశం ఇవ్వండి
ప్రజాగ్రహ సభలో బీజేపీ నేత ప్రకాష్ జవదేకర్

ఏపీలో బెయిలుపై (Bail) ఉన్న నేతలు ఎప్పుడైనా జైలుకు (Jail) వెళ్లొచ్చని కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ సీనియర్‌ నేత (BJP Senior Leader) ప్రకాశ్‌ జావడేకర్‌ (Prakash Javadekar) సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో విధ్వంసకర పాలన సాగుతోందని, ఇచ్చిన హామీలేవీ సీఎం జగన్మోహన్‌రెడ్డి (Jagan Mohan Reddy) నెరవేర్చలేదని జావడేకర్ (Javadekar) విమర్శించారు. కుటుంబ ప్రయోజనాలు, అవినీతి (Corruption) తప్ప ప్రాంతీయ పార్టీలకు అభివృద్ధి పట్టదన్నారు. టీడీపీ (TDP), వైసీపీ (YCP) తోపాటు తెలంగాణలోని (Telangana) టీఆర్‌ఎస్‌ (TRS) కూడా తెలుగు ప్రజలను (Telugu People) మోసం చేశాయని అయన ఆరోపించారు. జగన్‌ (Jagan) అరాచక పాలన, వైఫల్యాలపై బీజేపీ (BJP) మంగళవారం విజయవాడలో నిర్వహించిన ప్రజా ఆగ్రహ సభలో (Prajagra Sabha) జావడేకర్‌ కీలక ప్రసంగం చేసారు.

అనుమతులు వినియోగించుకోవడంలో జగన్ – బాబులు విఫలం

రాష్ట్రానికి మేలు చేసేది బీజేపీ మాత్రమేనని, ప్రత్యామ్నాయంగా బీజేపీని ఆశీర్వదించాలని అయన విజ్ఞప్తి చేశారు. విభజిత రాష్ట్రానికి ఎంతో ప్రయోజనకరమైన పోలవరం ప్రాజెక్టు (Polavaram Project) నిర్మాణానికి జావడేకర్ కేంద్ర పర్యావరణ మంత్రిగా 2014లోనే అనుమతిని ఇచ్చింది. అయినప్పటికీ టీడీపీ, వైసీపీ ప్రభుత్వాలు ఇప్పటికీ ప్రాజెక్టు నుంచి నీరందించలేక పోయాయని అయన అన్నారు.

మద్యం డబ్బుతోనే ప్రభుత్వం నడుస్తోంది

రాజధాని (Capital) అమరావతి (Amaravati) కోసం అటవీ భూములను బదిలీ చేసాము. అయినప్పటికీ ఇక్కడి రెండు పార్టీలు రాజధాని ఎక్కడ అనే దానికోసం కొట్టుకుంటున్నాయని బీజేపీ అగ్రనేత దుయ్యబట్టారు. సంపూర్ణ మద్య నిషేధమని మాటిచ్చిన జగన్‌ ప్రభుత్వం ప్రజలను మోసగించారు. ఓట్ల కోసం ఇచ్చిన హామీని అధికారం దక్కగానే మరచిపోయారు. మడమ తిప్పేశారు. మద్యంపై వస్తున్న డబ్బుతోనే ఖజానా నింపుకొంటున్నారు.

కేంద్ర పథకాలకు రాష్ట్రము స్టిక్కెర్లు

కేంద్ర పథకాలకు (Central Schemes) బాబు జగన్’లు తన పేరు పెట్టుకుంటున్నారు. కేంద్రం ఇస్తున్న నిధులతో తన స్టిక్కర్లు (Stickers) వేసుకుంటున్నారు. ప్రధాన మంత్రి (Prime Minister) ఆవాస్‌ యోజన (పీఎంఏవై) కింద ఇళ్ల నిర్మాణానికి ఒక్కో లబ్ధిదారుడికి కేంద్రం రూ.1.60 లక్షలు ఇస్తున్నది. కానీ ఆ కాలనీలకు జగన్‌ పేరు పెట్టడం ఏంటి? మోదీ ఇస్తున్న నిధులతో నిర్మించేవి మోదీ కాలనీలు తప్ప జగనన్న కాలనీలు (Jagananna Colonieis) కాబోవు అని జావడేకర్ ప్రభుత్వంపై విరుచుకు పడ్డారు.

సమగ్ర శిక్ష అభియాన్‌  (Samagra shiksha abhiyan)పేరుతో కేంద్రం ఇస్తున్న నిధులతో జగనన్న కానుక (Jagananna Kanuka) అని పేరు ఎలా పెడతారు? పంచాయతీల నిధులను (Panchayat Grants) సైతం మళ్లించి ఉపాధి నిధులతో చేపట్టిన నిర్మాణాలకు జగన్‌ పేరు పెట్టుకోవడం ఏమిటి అంటూ మండిపడ్డారు. పోలీసు, ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీ, కాంట్రాక్ట్‌ లేబర్‌ పర్మినెంట్‌, రైతులకు క్రాప్‌ ఇన్సూరెన్స్‌ (Crop Insurance) ఇలా చెబుతూ పోతే అన్నింటా మడమ తిప్పడమేనన్నారు.

ఎర్రచందనం (Red sandal wood) స్మగ్లింగ్‌ అరికట్టేందుకు తాను కేంద్ర అటవీ పర్యావరణ మంత్రిగా ఉన్నప్పుడు స్పెషల్‌ టాస్క్‌ఫోర్స్‌ (STF) వేసిందని జావడేకర్‌ గుర్తు చేశారు. అయితే దాన్ని నటి ప్రభుత్వం రద్దు చేసింది అని అయన వివరించారు. అలానే ఇప్పుడు జగన్‌ కూడా విధ్వంసానికి ప్రాధాన్యమిస్తున్నారు అని జావడేకర్ విరుచుకు పడ్డారు.

ఆంధ్ర ప్రదేశ్ అంటే ఎంతో ఇష్టం!

ఆంధ్రప్రదేశ్‌తో (Andhra Pradesh) తనకు మంచి సాన్నిహిత్యం ఉంది. ఇక్కడి ప్రజలన్నా.. వంటలన్నా తనకు ఎంతో ఇస్తామని బీజేపీ (BJP) జాతీయ నేత జావడేకర్ అన్నారు. మోదీ ప్రధాని అయ్యాక ప్రపంచంలో భారతీయులు ఎక్కడికెళ్లినా గౌరవం లభిస్తోంది. అయోధ్య (Ayodhya), కాశీ (Kashi), ఛార్‌ధామ్‌ (Char Dham) తరహాలో దేశమంతా అభివృద్ధి చెందుతోందని అయన చెప్పారు. దేశంలో ఇలా ఉంటే… అంతర్వేది లక్ష్మీనరసింహ స్వామి (Lakshmi Narasimha Swamy) రథాన్ని (Chariot)  తగుల బెట్టడం, రామతీర్థంలో స్వామివారి విగ్రహ శిరచ్ఛేదం ఘటనలను జరుగుతున్నాయి. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని జావడేకర్ తెలిపారు.

కుల నాయకుల విష ప్రచారాన్ని తిప్పికొట్టండి: శాంతి సందేశం

Spread the love