Advani-Joshi-Uma BharatiAdvani-Joshi-Uma Bharati

తీర్పు వెలువరించిన సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం

బాబ్రీమసీద్ (Babri Masjid) కేసుపై కోర్ట్  తీర్పు వెలువరించింది. అందరూ నిర్దోషులే అంటూ సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం తీర్పు నిచ్చింది. ఎప్పటినుండో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న బాబ్రీ మసీద్ కూల్చివేత కేసుకు ముగింపు పలికింది. మసీద్ కూల్చివేత కేసులో నిందుతులుగా ఉన్న మాజీ ఉపప్రధాని శ్రీ అద్వానీ, శ్రీ మురళీ మనోహర్ జోషి, ఉమా భారతితో పాటు ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు అంతా నిర్దోషులుగా తేలుస్తూ సిబిఐ ప్రత్యేక న్యాయస్థానము నేడు తీర్పు చెప్పింది. వీరిపై ఉన్న ఆరోపణలపై ఎటువంటి ఆధారాలు లేవని కోర్ట్ పేర్కొంది. నిందులపై మోపిన అభియోగాలను సిబిఐ రిరూపించలేక పోయిందని కోర్ట్ పేర్కొంది. సరి అయిన ఆధారాలు లేనందున వారి అందరిపై ఉన్న అభియోగాలను కొట్టివేస్తున్నట్లు న్యాయ మూర్తి సురేంద్ర కుమార్ యాదవ్ తీర్పులో వెల్లడించారు.

351 మంది సాక్షులను విచారణలో భాగంగా సిబిఐ న్యాయస్థానం విచారించింది. ఈ కేసులో మొత్తం నిందితులు 49 మంది. అయితే 28 సంవత్సరాల సుదీర్ఘ విచారణలో 17 మంది నిందితులు కేసు విచారణలో ఉండగానే మరణించారు. మిగిలిన నిందితులను నిర్దోషులుగా తేలుస్తూ సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం నేడు తీర్పు నిచ్చింది.

శ్రీ అద్వానీ, శ్రీ మురళీ మనోహర్ జోషీ లాంటి ప్రముఖులు ఈ కేసులో నిందితులుగా ఉండడం వలన ఈ కేసుపై రాబోయే తీర్పుపై దేశమంతా ఉత్కంఠతతో ఎదురుచూసింది. సుదీర్ఘ విచారణ అనంతరం ఆరోపణలు ఎదుర్కొంటున్న వారంతా నిర్దోషులుగా తెలుస్తూ సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం నేడు తీర్పు చెప్పింది.