AP in Debt trapAP in Debt trap

భారత ప్రభుత్వం (Indian Government) చేసిన అప్పు 153 లక్షల కోట్ల రూపాయలు అందులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (Andhra Pradesh Government) చేసిన అప్పు 4.5 లక్షల కోట్ల రూపాయలు. అనగా 140 కోట్ల భారత ప్రజలు సగటున సాలీనా లక్ష పదివేల రూపాయల అప్పు (Debt) భారం మోస్తున్నారు. పరోక్షంగా సంవత్సరానికి 9వేల రూపాయలు వడ్డీ ప్రతి భారతీయుడు కడుతున్నాడు (AP in Debt Trap).

5.2 కోట్ల జనాభా ఉన్న ఆంధ్రప్రదేశ్ లో ప్రతి ఒక్కరూ రమారమి 85 వేల రూపాయలు అప్పు భారం మోస్తున్నారు. ప్రతి ఒక్కరు పరోక్షంగా సంవత్సరముకి ఎనిమిది వేల రూపాయలు వడ్డీ కడుతున్నారు.

చేసిన అప్పు యొక్క అసలు తీర్చలేక పోవటం వలన ప్రతి సంవత్సరం వడ్డీ భారం అధికం అవుతూనే ఉంది. పోను పోను ఇలా తీసుకున్నటువంటి అప్పు ఒకవేళ సంపద సృష్టించకపోతే ఎనిమిది శాతం వడ్డీ కూడా భారమవుతుంది. ప్రత్యక్ష పరోక్ష టాక్స్ ల ద్వారా ప్రతి ఒక్కరు ప్రభుత్వ ఖజానాకి ఏదో రూపేన డబ్బు జమ చేస్తూనే ఉన్నారు.

అది కాకుండా ఏదైనా కొత్త నిర్మాణం చేపడితే నేషనల్ హైవేలో లా టోల్ టాక్స్ రూపేనా 100 కిలోమీటర్లు ప్రయాణం చేస్తే యాభై రూపాయలు కట్టే స్థితికి చేరుకున్నాం. పెట్రోల్ మీద సెస్ కడుతున్నాము. కొత్త వాహనం కొంటే రోడ్డు టాక్స్ తో పాటు సెస్ కడుతున్నాము. ఇలా ప్రతి రంగంలోనూ ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ పన్నులు కడుతూనే ఉన్నాము. ఇలా చెప్పుకుంటూ పోతే స్వచ మైన గాలి పీల్చాలన్న కూడ టాక్స్ కట్టాల్సి వచ్చే స్థితికి ఈ రోజున మనం చేరుకుంటున్నాము.

అది కాకుండా రాబోయే కాలంలో కూడా అధిక వడ్డీలు కట్టే విధంగా ఈరోజే అప్పులు చేస్తూ ఉన్నాము అంటే బ్రతికినంత కాలం ప్రభుత్వం చేసినటువంటి అప్పులు తీర్చటమే కాకుండా దానికి వడ్డీలు కూడా ప్రజలే కట్టాల్సి వస్తోంది. అప్పులు అభివృద్ధికి వాడుతున్నాము అన్న దాఖలాలు మెల్లమెల్లగా తగ్గిపోతున్నాయి. అభివృద్ధి చెందిన దేశాలలో విద్యా వైద్యానికి మాత్రమే ప్రభుత్వ నిధులు వాడతారు.

దేశంలో, రాష్ట్రంలలో చేసిన అప్పుని కూడా ప్రజలకు వివిధ పథకాల ద్వారా ఫ్రీగా ఇవ్వటంతో అప్పుతో పాటు వడ్డీ ప్రతి సంవత్సరం పెరిగి మరింత భారం అవుతోంది. ఆర్థిక వ్యవస్థ అటు దేశస్థాయిలో ఇటు రాష్ట్రల స్థాయిలో మెల్లమెల్లగా కుంటుపడుతోంది. పేదవానికి కావాల్సింది ఒక గూడు, చేతినిండా పని, ఇబ్బంది పడితే వైద్యం, తన పిల్లలకు చదువు.

ప్రభుత్వాలకు అప్పు చేయటంలో ఉన్నంత ఆసక్తి అప్పులు తీర్చడంలో ఉండడం లేదు. టాక్స్ వసూళ్ల విషయంలో ప్రభుత్వాలు ఆత్రుత చూపిస్తున్నాయి. కానీ ప్రభుత్వాలు ప్రజలకు అత్యుత్తమైనటువంటి సేవలు అందించాలి అని ఆలోచించడం లేదు. అందకే ప్రజలు అన్ని వైపులా, అన్ని విధాల ఇబ్బంది పడే స్థితిగతులు పెరుగుతూ ఉన్నాయి.

అప్పుల ఊబిపై నాణెంకు మరోవైపు

ఎటుపడితే అటు అప్పులు చేయడం వలన చివరకు సామాన్య మానవుడు ఆ భారం మొత్తం మోయాల్సి వస్తుంది.

1. అధిక పన్నులు:

రాష్ట్రం గాని దేశం గాని ఎక్కువ రుణం తీసుకున్నప్పుడు, సాధారణ పౌరుడు మీద పన్నులు పెరుగుతాయి. ఒక రాష్ట్రం అధిక రుణ భారాన్ని కలిగి ఉన్నప్పుడు, దానిని చెల్లించడానికి మరియు అదనపు ఆదాయాన్ని సంపాదించడానికి పన్నులను పెంచవలసి ఉంటుంది. ఇది వారి పునర్వినియోగపరచదగిన ఆదాయాన్ని తగ్గించడం ద్వారా మరియు వస్తువులు మరియు సేవలను కొనుగోలు చేయడం మరింత సవాలుగా మార్చడం ద్వారా సామాన్యులను ప్రత్యక్షంగా ప్రభావితం చేస్తుంది.

2. తగ్గించబడిన పబ్లిక్ సర్వీసెస్:

విద్య, ఆరోగ్య సంరక్షణ, రవాణా మరియు మౌలిక సదుపాయాల వంటి ప్రజా సేవలతో సహా వివిధ రంగాలలో రాష్ట్ర రుణం బడ్జెట్ కోతలకు దారి తీస్తుంది. నాణ్యమైన ప్రభుత్వ విద్య, ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలు మరియు రవాణా వ్యవస్థలకు సామాన్యులు దూరం అయ్యే పరిస్థితి వస్తుంది, ఇది వారి మొత్తం శ్రేయస్సు మరియు జీవన నాణ్యతను ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది.

3. ఉద్యోగ నష్టాలు:

అధిక రాష్ట్ర రుణం కూడా ప్రభుత్వ వ్యయంలో కోతలకు దారి తీస్తుంది, దీని ఫలితంగా ప్రభుత్వ రంగంలో ఉద్యోగాలు సృష్టించటం కష్టమవుతుంది. ఉన్న ఉద్యోగుల పైన పని ఒత్తిడి పెరుగుతుంది. ఉద్యోగులకు సరైన సదుపాయాలు కలగ చేయలేకపోవడం జరుగుతుంది. ఉద్యోగ భద్రత సవాలుగా మారవచ్చు. నిరుద్యోగుల సంఖ్య పెరుగుతుంది. సమాజంలో అస్థిరత్వం కలుగుతుంది ఇది పక్కనే ఉన్న శ్రీలంక దూరంగా ఉన్న వెనిజులాంటి అనేక దేశాలలో మనం చూస్తూనే ఉన్నాము..

4. ఆర్థిక అనిశ్చితి:

రాష్ట్ర రుణం అంశాల వారీగా ఆర్థిక అస్థిరతకు దోహదం చేస్తుంది. నిరుద్యోగం రేటు పెరుగుతుంది. వ్యాపార కార్యకలాపాలు తగ్గుతాయి. సామాన్యుని చేతిలో డబ్బు ఉండదు. కొనుగోలు శక్తి తగ్గుతుంది. రుణాలు పొందటం మరింత భారం అవుతుంది.
ఆదాయం సమకూర్చుకునే మార్గాలు క్రమేపీ తగ్గుతాయి. చివరకు పెరిగిన ఆర్థిక అభద్రత సామాన్య ప్రజానీకంను అత్యధికం గా ప్రభావితం చేస్తుంది. భవిష్యత్తు కోసం ప్లాన్ చేయడం చాలా కష్టతరం అవుతుంది.

5. అధిక వడ్డీ రేట్లు:

రాష్ట్రం గణనీయమైన రుణాన్ని కలిగి ఉన్నప్పుడు, దాని రుణాలపై అధిక వడ్డీ రేట్లను చెల్లించాల్సి ఉంటుంది. ఈ పెరిగిన వడ్డీ వ్యయాలు మొత్తం ఆర్థిక వ్యవస్థపై ట్రికిల్-డౌన్ ప్రభావాన్ని చూపుతాయి, రుణాలు మరియు క్రెడిట్ కార్డ్‌లపై వినియోగదారులకు అధిక వడ్డీ రేట్లకు దారి తీస్తుంది. పెట్టుబడులు తగ్గుతాయి ఉపాధి అవకాశాలు. కుంటుపడతాయి. సామాన్యుడు పెరిగిన రుణ ఖర్చులను ఎక్కువగా ఎదుర్కో వలసి వస్తుంది. క్రెడిట్‌ను పొందడం మరింత ఖరీదైనదిగా మారుతుంది. పెద్ద కొనుగోళ్లు చేయడానికి లేదా భవిష్యత్తులో పెట్టుబడి పెట్ట్టే సామర్థ్యాన్ని దెబ్బతీస్తుంది.

6. పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్:

ప్రభుత్వ రుణం పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్‌లలో పెట్టుబడి ని తగ్గిస్తుంది. రాష్ట్రమే అభివృద్ధి పనులకు నిధులు సమకూర్చకపోతే, ప్రైవేటు వ్యవస్థీకరణ అత్యధిక ఖర్చుతో ముందుకు రావాల్సి ఉంటుంది. ఇన్ని ఇబ్బందులతో ఎవరు ముందుకు రారు కూడా. దీని వలన రోడ్లు, వంతెనలు మరియు ఇతర ప్రజా సౌకర్యాలు క్షీణించవచ్చు. మరమ్మతులు లేదా ప్రత్యామ్నాయ మార్గాలు కష్టం అవ్వడం వలన సామాన్యుడుకు మరింత అసౌకర్యం కలుగుతుంది.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంకు పన్ను రూపేనా వస్తున్న ఆదాయం 91 వేల కోట్లు.  కాగా సాలిన 45 వేల కోట్లు అదనపు అప్పు చేయటం జరుగుతుంది. ఇలా చేసిన అప్పు ఇప్పటికి నాలుగున్నర లక్షల కోట్లు అయింది. అంటే 5.2 కోట్ల ఆంధ్ర ప్రజలు ప్రతి సంవత్సరం రమా రమి 17, 500 రూపాయలు పన్ను రూపేనా మరియు 8000 రూపాయలు వడ్డీ రూపేనా వెరసి 25500 రూపాయలు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి పౌరుడు ప్రభుత్వంకి ప్రత్యక్షంగా కడుతున్నాడు.

ఇలా చెప్పుకుంటూ పోతే ప్రభుత్వం చేసిన అప్పు కు అసలు తీర్చలేని పరిస్థితిలో ఉండటం వలన, రాబోయే మన తరాలు కూడా వడ్డీతో పాటు అసలు కూడా చెల్లించాల్సి వస్తుంది ఎందుకంటే మనం కొత్త రాష్ట్రం గా ముందడుగు వేసినప్పుడు 80 వేల కోట్ల అప్పుతో బయలుదేరాము ఇప్పుడు అది నాలుగున్నర లక్షల కోట్ల రూపాయలు అయ్యింది. అప్పుడు 2000 రూపాయల లోపు వడ్డీ కడితే ఇప్పుడు ఎనిమిది వేల రూపాయలు వడ్డీ ప్రతి ఒక్క పౌరుడు సంవత్సరంకు కడుతున్నాడు.

అంటే పోను పోను పేదవానిగా ప్రభుత్వ పథకాలు పైన ఆధారపడే వాళ్ళు కానీ లేదా పన్నులు ఎగవేసి దర్జాగా తిరిగే పౌరులు గాని ప్రోత్సహించబడతారు. మిగిలిన వారు కేవలం పని చేస్తూ వచ్చిన సంపాదన అంతా ప్రత్యక్ష , పరోక్ష పన్నులు కడుతూ ప్రభుత్వం చేసిన అసలు & వడ్డీలు కట్టడంలోనే వారి జీవితాన్ని వెళ్ళదీయాల్సి వస్తుంది

ఆలోచించండి… అభివృద్ధికి నోచుకొని, సంపద సృష్టించని అప్పు ఎప్పుడు సామాన్యుడికి గుది బండ అవుతుందే తప్ప ఎలాంటి ప్రయోజనం కలుగ చేయదు.

–Analysed by a retired officer from Andhra Pradesh

వైసీపీ అక్రమాలను బట్టబయలు చేసేందుకే విశాఖ వారాహియాత్ర