Revanth ReddyRevanth Reddy

తెలంగాణ ఎన్నికల్లో (Telangana Elections) కాంగ్రెస్ (Telangana Congress) అనూహ్య విజయం సాధించింది. కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీ నాయకుడుగా రేవంత్ రెడ్డి (CLP Leader Revanth Reddy) ఎన్నికయ్యారు. మరో కొద్ది గంటల్లో రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ముఖ్య మంత్రిగా (Telangana CM) ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ప్రత్యర్థి పార్టీలు అయినా భారాస, బీజేపీ లను మట్టి కరిపించిన రేవంత్ రెడ్డి వార్తల్లోని నాయకుడిగా మారారు.

భారాసపై (BRS), బీజేపీపై (BJP) తన పదునైన మాటల తూటాలతో విరుచుకు పడుతూ తెలంగాణ కాంగ్రెస్ (Telangana Congress) పార్టీని విజయంపై నడిపించిన రేవంత్ రెడ్డి (Revanth Reddy) అభినందనీయుడే . అందుకే రేవంత్ రెడ్డి నిజాంగా పోరాట యోధుడి అని సమస్త జనులు కొనియాడుతున్నారు. నిజానికి రేవంత్ రెడ్డి మాటల్లో దిట్ట… వ్యూహాల్లో మేటి.

వాస్తవానికి రేవంత్ రెడ్డి తన తూటాల్లాంటి మాటలతో సూటిగా, కుండబద్దలు కొట్టినట్లుండే ప్రసంగాలతో తన ప్రత్యర్థులకు ముచ్చెమటలు పట్టించేవాడు. ప్రత్యర్థులను దీటుగా ఎదుర్కోవడంలో రేవంత్ రెడ్డి చూపించే దూకుడు కార్యకర్తలు, నాయకులను ముందుకు నడపడంలో నాయకత్వ పటిమ రేవంత్ రెడ్డిలో ఉన్న ప్రత్యేకతలుగ చెప్పుకోవచ్చు.

రేవంత్ రెడ్డి దూకుడైన తత్వంతో ప్రత్యర్థులకు ముచ్చెమటలు పట్టిస్తూ ఉండడమే కాదు.
కాకలు తీరిన నేతలున్న కాంగ్రెస్‌లో అంచెలంచెలుగా ఎదుగుతూ, కాంగ్రెస్ లో చేరిన ఆరేళ్లలోనే సీఎం పదవి సొంతం చేసుకొన్న ఘనత రేవంత్‌రెడ్డిది.

2017లో రేవంత్ రెడ్డి తెలుగుదేశం నుండి బయటపడి కాంగ్రెస్‌లో రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. రేవంత్‌రెడ్డి అనతి కాలంలోనే 2018లో పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నియమితులయ్యారు. అదే ఏడాది జరిగిన శాసనసభ ఎన్నికల్లో కొడంగల్‌లో బరిలో నిలిచి ఓటమిని ఎదుర్కొన్నారు. అయినా వెనకడుగు వేయలేదు. 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో మల్కాజిగిరి స్థానం నుంచి రేవంత్ రెడ్డి విజయం సాధించారు. ఓవైపు లోక్‌సభ సభ్యుడిగా కొనసాగుతూనే తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో తన ప్రత్యేకత చాటుకుంటూ రేవంత్ రెడ్డి వచ్చారు. అధిష్ఠానం దృష్టిలో పడ్డారు. తెలంగాణ కాంగ్రెస్ కి రేవంత్ రెడ్డినే సరి అయినా సారధి అని కాంగ్రెస్ అధిష్టానం భావించింది. అందుకే 2021 జూన్‌ 26న పీసీసీ అధ్యక్షుడిగా నియమితులయ్యారు.

తెలంగాణ పిసిసి బాధ్యతలను స్వీకరించే నాటికే పార్టీలోని కీలక నేతల ఇళ్లకు వెళ్లి కలసి వచ్చారు. అందరం కలిసి పోరాటం చేద్దాం అనే సంకేతాలిచ్చారు. రేవంత్ రెడ్డి తీరుపై సొంత పార్టీ నాయకులే కొందరు విమర్శలు చేశారు. అయినప్పటికీ రేవంత్ రెడ్డి తనదైన పంథాలో ముందుకు సాగారు కానీ వెనకడుగు వేయలేదు. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడంపై
రేవంత్ రెడ్డి దృష్టి సారించారు. అందుకే కాంగ్రెస్ పార్టీ విజయ పథంవైపు నడిచింది.

గెలుపు వైపు పార్టీని పార్టీని పరిగెత్తించిన యోధుడు

2023 లో తెలంగాణాలో జరుగబోవు ఎన్నికల్లో కాంగ్రెసు పార్టీని గెలిపించడమే లక్ష్యంగా రేవంత్ రెడ్డి వ్యూహాలు రచించడం ప్రారంభించారు. అందుకే పార్టీని ఏడాదిన్నర ముందునుంచే సభలతో సమాయత్తం చేశారు. రాష్ట్రంలోని ప్రధాన సమస్యలను గుర్తించి పోరాటం చేసారు. ఆ సమస్యలకు కాంగ్రెస్‌ పరిష్కారాలను ఇస్తుంది అంటూ ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లారు. 2022 మే 6న వరంగల్‌లో నిర్వహించిన రైతు డిక్లరేషన్‌ నుంచి కామారెడ్డిలో ఇటీవల నిర్వహించిన బీసీ డిక్లరేషన్‌ వరకు అనేక అంశాలపై వివిధ ప్రత్యేక హామీలను ప్రకటించడంలో రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా వ్యవహరించారు.

ప్రతి కీలక కార్యక్రమానికి పార్టీ అగ్రనేతల్లో ఎవరో ఒకరు హాజరయ్యేలా రేవంత్ చూశారు. వరంగల్‌లో రైతు డిక్లరేషన్‌ సభకు రాహుల్‌ గాంధీ వచ్చారు. హైదరాబాద్‌లో యూత్‌ డిక్లరేషన్‌ సభకు ప్రియాంకా గాంధీ వచ్చారు. చేవెళ్లలో దళిత డిక్లరేషన్‌ సభకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అలానే కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్‌ సభకు కర్ణాటక సీఎం సిద్దరామయ్య హాజరు అయ్యేటట్లు రేవంత్ రెడ్డి జాగ్రత్తలు తీసికొన్నారు. తొలుత 13 రోజులపాటు పాద యాత్ర నింర్వహించారు. అందులో భాగంగా వివిధ జిల్లాల్లో నిర్వహించిన సభలు పార్టీని విజయం దిశగా నడిపించాయి అని చెప్పాలి. నిరుద్యోగం, యువత సమస్యల విషయంలో ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సంధించడం జరిగింది. ధరణి సమస్యలు సహా వివిధ అంశాలను ప్రజల్లోకి బలంగా రేవంత్ రెడ్డి తీసుకెళ్లారు. పార్టీపరంగా 40 లక్షల డిజిటల్‌ సభ్యత్వాలు నమోదు చూపించడం కూడా కాంగ్రెస్ విజయానికి సహకరించింది అని చెప్పాలి.

అన్ని ప్రచార మాధ్యమాలను వాడుకొంటూ…

కాంగ్రెస్ పార్టీ వ్యూహాలను భారాస, భాజపాలకు దీటుగా అమలు చేయడంలో రేవంత్‌రెడ్డి ప్రత్యేక శ్రద్ధ చూపించారు. సామాజిక మాధ్యమాలను అనుకూలంగా ఉపయోగించుకున్నారు. వాటి ద్వారా ప్రత్యర్థుల విమర్శలకు దీటుగా స్పందించడం కాంగ్రెస్‌కు కలసివచ్చింది. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వార్‌ రూం ద్వారా వ్యూహాలను సమర్థంగా అమలు చేయగలిగారు. పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీలూ ప్రజల్లోకి బలంగా చేరేందుకు సామాజిక మాధ్యమాలను రేవంత్ రెడ్డి ఉపయోగించుకున్నారు. భారాస ప్రభుత్వ తీరుపై విమర్శలు ప్రజల్లోకి చేరేందుకు ప్రత్యేక ప్రచార వ్యూహాలను అమలు చేశారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న భారాస, కేంద్రంలో అధికారంలో ఉన్న భాజపాను శాసనసభ ఎన్నికల్లో దీటుగా ఎదుక్కోన్నారు. కాంగ్రెస్‌ను తెలంగాణలో తొలిసారిగా అధికారం దక్కేలా చేయడంలో రేవంత్‌ రెడ్డి సఫలం అయ్యారు.

విద్యార్థి నాయకుడిగా రేవంత్ రెడ్డి ప్రస్థానం

రేవంత్‌రెడ్డి తండ్రి నరసింహారెడ్డి అప్పట్లో గ్రామానికి పోలీస్‌ పటేల్‌గా ఉండేవారు. తల్లి రామచంద్రమ్మ గృహిణి. వ్యవసాయ కుటుంబం నుండి రేవంత్ రెడ్డి వచ్చారు. రేవంత్‌ హైస్కూల్‌ విద్య వనపర్తిలోని జడ్పీ బాలుర పాఠశాలలో చేసారు. 1983-1985లో వనపర్తిలోనే ఇంటర్‌ బైపీసీ చదువుకున్నారు. రేవంత్‌రెడ్డి రాజకీయ ప్రస్థానం ఏబీవీపీలో ప్రారంభమైంది. 1992 నుంచి చురుకైన కార్యకర్తగా పనిచేసేవారు. 2004లో కొంతకాలం భారాసలో పనిచేశారు. 2009లో కొడంగల్‌ నుంచి తెదేపా తరపున ఎమ్మెల్యే టికెట్‌ తెచ్చుకుని రాజకీయ కురువృద్ధుడు గుర్నాథ్‌రెడ్డిని ఓడించారు.

కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌రెడ్డి తమ్ముడు పద్మనాభరెడ్డి కుమార్తె గీతను ఆయన ప్రేమించి.. పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. స్థిరాస్తి వ్యాపారంలో మంచి గుర్తింపు కూడా తెచ్చుకున్నారు.

కాంగ్రెస్‌లో చేరిన కొద్దికాలంలోనే అగ్రనేతలు సోనియా, రాహుల్‌, ప్రియాంకా గాంధీల అభిమానాన్ని రేవంత్‌ రెడ్డి పొందారు. తెలంగాణలో 21 రోజుల పాటు సాగిన రాహుల్‌ గాంధీ జోడోయాత్రను విజయవంతం చేయడంలో రేవంత్ ప్రధాన పాత్ర పోషించారు. మహబూబ్‌నగర్‌ జిల్లాలోని కృష్ణా వద్ద ప్రారంభమైన పాదయాత్ర నిజామాబాద్‌ జిల్లా మద్నూర్‌లో ముగిసేవరకు.. విజయవంతం చేయడంలో రేవంత్ రెడ్డి కీలక పాత్ర పోషించారు అని చెప్పాలి.

తెలంగాణ కొత్త సీఎంగా రేవంత్ రెడ్డి!