PK and MudragadaPK and Mudragada

ముద్రగడ-పవన్ కళ్యాణ్ అభిమానులకు అక్షర సందేశం!

సింహాలు చరిత్రను రాసుకోలేవు. సింహాలను వేటాడి తినే వేటగాళ్లు రాసేదే చరిత్ర. అందుకే సింహాల చరిత్ర వేటగాళ్ల పాలు అవుతున్నది. పల్లకీల మోతకే (Pallakela Motha) మిగిలిపోతున్నది.

పెద్దాయన ముద్రగడ (Mudragada) కులం కోసం తన ప్రయత్నాలు తాను చేశారు. అవి ఎందుకు ఫలించ లేదు అనే విషయాన్ని పక్కన పెడదాం. ముద్రగడ ఆలోచనలు అధికారం కోసం కాకుండా రిజర్వేషన్ల (Reservations) కోసం పని చేశాయి. కానీ ఫలించలేదు. అయన ఏనాడో రాజ్యాధికారం (Rajyadhikaram) కోసం పార్టీ పెట్టి ఉండాల్సింది. కానీ అయన అలా చేయలేదు. కారణం ఆ పెరుమాళ్ళకే ఎరుక?

సత్యాన్ని ముద్రగడ అంగీకరించాలి?

ఈ సత్యాన్ని ముద్రగడ అంగీకరించాలి. తన ఉద్యమాల్లో ఉన్న లోపాలను సవరించు కొంటూ తరువాత తరానికి ఆయన అవకాశం ఇవ్వాలి. తాను పెట్టలేని పార్టీని నేడు పవన్ (Pawan Kalyan) పెట్టారు. దాన్ని ముద్రగడ స్వాగతించాలి. మన Kapu చరిత్రను మనమే రాసుకొందాం అనే మార్పుకి సహకరించాలి. ఇదే పెద్దరికం.

ప్రస్తుతం మనకి కావాల్సింది రిజర్వేషన్లు కాదు. రాజ్యాధికారం. దాని కోసం జనసేన (Janasena) అనే పార్టీ వచ్చింది. దీనికి మేము బ్రహ్మరథం పడతాం అంటూ యువత ముందుకొస్తున్నది.

యువతలో (Youth) వచ్చిన ఈ మార్పును అంగీకరిస్తూ జనసేనకు మద్దతు నివ్వాల్సిన అవసరం ముద్రగడకి ఉంది. ఇది తన బాధ్యత. తన బాధ్యతను మరిచి కొత్త పార్టీ (New Political Party) అంటూ అడుగులు వేయడం పెద్దరికం అనిపించుకోదు. అలా చేస్తే అప్పుడు ఆయన చరిత్ర హీనులు అవ్వచ్చునేమో? ఆయన చేసిన సేవలు గొప్పవే. మరువలేనివి. కానీ జనసేనకి వ్యతిరేకంగా వెళితే మాత్రం జాతి ద్రోహులుగా మిగిలి పోవచ్చు అని యువత భావిస్తున్నది.

జనసైనికులకు పెద్దాయన తగిన సలహాలు, సూచనలు ఇస్తూ ఉండాలి. ఆశీస్సులు కూడా ఇవ్వాలి. ఆయన అనుభవాలను నేటి తరానికి పంచాలిసిన అవసరం కూడాను. ఇది సమాజానికి, అణగారిన వర్గాలకు తక్షణ అవసరం.

కలవక పోయినా గాని కుల ముద్ర వేస్తారు?

ముద్రగడ ఒక కులపెద్ద అవ్వచ్చు కానీ పవన్ కళ్యాణ్ కుల నాయకుడు కాదు. ఆయన ఒక పార్టీ అధిపతి. ఆయనకి అందరూ కావాలి. సమాజంలో అందరి సౌభాగ్యం కోసం పవన్ ఆలోచించాలి. అలానే అణగారిన వర్గాల్లో కొందరైన కాపులు గురించి కూడా పవన్ ఆలోచించాలి. కులముద్ర పడతాది అని భయంతో మౌనం వహించడం తగదు. కులముద్ర వేసే వేటగాళ్లు మీరు కలవక పోయినా గాని కుల ముద్ర వేస్తారు.

అందుకే ముద్రగడ జాతికి చేసిన సేవలను గౌరవిస్తూ, ఆయన అనుభవాన్ని జనసేనాని పరిగణలోకి తీసుకోవాలి. ఆయన ఆశ్శిసులను కూడా జనసేనాని తీసుకోవాలి. ముద్రగడని జనసేన పార్టీ ప్రముఖులు కలిసి ఆయన కోపానికి కారణాలను తెలుసుకోవాలి. శాంత పరచడానికి ప్రయత్నం చేయాలి. రాజ్యాధికారం సాధన కోసం పెద్దల ఆశీస్సులు కావాలి అనే విషయాన్ని మరువరాదు.

సింహాల చరిత్రను వేటగాళ్ళేరాయాలా?

ఇది తెలిసికోలేకపోతే సింహాల చరిత్రను వేటగాళ్ళే రాస్తూ ఉంటారు. మనం కన్నీరు కారుస్తూ పాలకుల పెరట్లో జీవితాలు గడుపుతూ ఉండాలి. మార్పు తేవాలి అంటే ముందు కుల పెద్దల, కుల నాయకుల ఆలోచనల్లో మార్పు తేవాలి. దాని కోసం సేనానిలో కూడా మార్పు రావాలి. సేనానిపై ముక్కోటి ఆశలను యువతపెట్టుకొన్నది. దాన్ని పాలకుల పాలు చేయవద్దు.

యువత అభిప్రాయం ఏమిటంటే?

అలాగే జనసైనికులు (Janasainik) కూడా సహనంతో ఉండాలి. ముద్రగడని గౌరవంతో చూడాలి. ఆయన ఆశీస్సులు తీసుకోవాలి. రాజ్యాధికార సాధన కోసం సహనంతో సాగిపోవాలి.

చివరగా కులంలో పెద్దవారు అయిన ముద్రగడ తప్పటగులు వేయడం ఇకనైనా మానుకోవాలి?  అవసరం లేని ఉత్తరాలు రాయడం మానుకోవాలి? మార్పుకు సహకరించాలి? జనసేనకు సహకరించాలి? ఇష్టం లేకపోతే మౌనం వహించాలి గానీ పల్లకీలు మోయడానికి ఉత్తరాలు రాయడం మానుకోవాలి? జాతి కోసం అయినా పెద్దాయన మౌనం మంచిది? అవసరం అయితే విశ్రాంతి తీసికోవాలి అనే యువత అభిప్రాయాల గురించి ఆలోచించాలి.

దీనికి పవన్ కళ్యాణ్ సహకారం కూడా ఉండాలి. చిరు లాంటి వారు ముందుకు రావాలి. లేకపోతే పెద్దాయన అనుభవాన్ని పాలకులు ఉపయోగించు కోవచ్చునేమో??

ఆలోచించండి… తరతరాలుగా పల్లకీలు (Pallakelu) మొస్తున్నాగాని ఎన్నాళ్లీ వేటగాళ్లు రాస్తున్న చరిత్రలను నమ్మి మీలో మీరు తిట్టుకోవడాలు. పల్లకీలు మోయడాలు. ఇంకానా? (Its from Akshara Satyam)

శ్రీమద్ది దేవస్థానానికి విచ్చేసిన రాష్ట్ర సమాచార కమిషనర్

Spread the love
2 thought on “కాపుల మధ్య వేటగాళ్ల విభజన “ముద్ర”లు?”
  1. Kapu nayakulu kallu terava valasina samayam RAJYADHIKARAM kosam youth ki disa nirdesam cheste
    RAJYADHIKARAM manade

Comments are closed.