Siva Shankar master

కొరియోగ్రాఫర్‌ (choreographer) శివ శంకర్‌ మాస్టర్‌ (Shiva Shankar Master) మృతి పట్ల చిరంజీవి (Chiranjeevi) సంతాపం తెలియజేసారు. ‘‘శివ శంకర్‌ మాస్టర్‌ మరణ వార్త ఎంతో కలచి వేసింది. వృత్తిపరంగా, వ్యక్తిగతంగా, ఎన్నో సవాళ్లు అధిగమించి వందల సినిమాలకు కొరియోగ్రాఫర్‌గా శివశంకర్ మాస్టర్ పని చేశారు. ఆయన నేను కలిసి ఎన్నో సినిమాలకు పని చేశాం. ముఖ్యంగా ‘ఖైదీ’ (Khaidi) సినిమాకు సలీం మాస్టర్‌ (Salim Master) అసిస్టెంట్‌గా నాకు చాలా స్టెప్స్‌ ఆయనే కంపోజ్‌ చేశారు. అప్పుడు మొదలైన మా స్నేహం చాలా బలపడింది. తర్వాత కూడా ఎన్నో సినిమాలకు కలిసి పని చేశాం అంటూ చిరు తన దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.

చరణ్‌కు బ్లాక్‌ బస్టర్‌ అయిన ‘మగధీర’ (Magadheera) సినిమాలోని ‘ధీర ధీర’ పాటకు శివశంకర్‌ మాస్టర్‌కు జాతీయ అవార్డ్‌ కూడా అందుకున్నారు. ఆయనను చివరిగా ఆచార్య (Acharya) సెట్స్‌’లో కలిశాను, అదే చివరిసారి అవుతుందని నేను ఊహించలేదు. ఒక ఆత్మీయుడిని కోల్పోయినట్టు అనిపిస్తోంది. ఆయన మృతి కేవలం నృత్య కళా రంగానికే కాదు, యావత్‌ సినీ పరిశ్రమకే తీరని లోటు’ అని మెగాస్టార్ చిరు అన్నారు. శివశంకర్‌ మాస్టర్‌ ఆరోగ్య పరిస్థితి (Health Condition) తెలుసుకున్న చిరంజీవి రూ.3లక్షల సాయం చేసిన సంగతి అందరికీ తెలిసిందే!

ప్రభుత్వానివి కాకి లెక్కలు! హెలీకాప్టర్ లెక్కలు! – నాదెండ్ల