Dharna for EWS QuotaDharna for EWS Quota

EWS రిజర్వేషన్ పోరాట వేదిక డిమాండ్
ఉత్తర్వులు ఇవ్వండి అంటూ ప్రభుత్వానికి లేఖ

రాజ్యాంగబద్ధమైన 10 % EWS కోటాను ఆర్ధికంగా వెనుకబడిన వర్గాలకు తక్షణమే అమలు చేయాలని EWS రిజర్వేషన్ పోరాట వేదిక ఏపీ ముఖ్యమంత్రిని (AP CM) డిమాండ్ చేసింది. ఇందుకు గాను విజయవాడలోని ధర్నా చౌక్’లో EWS రిజర్వేషన్ పోరాట వేదిక (Reservation Porata vedika) నేడు ధర్నా చేసింది.

నిరుపేద, పేద, మధ్య తరగతి ఓసీ విద్యార్థులు, నిరుద్యోగుల ప్రయోజనాలను పరిరక్షించే నిమిత్తం కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగబద్ధంగా 10 % EWS రిజర్వేషన్లను (Reservations) కల్పించింది. వాటిని ఆంధ్ర ప్రదేశ్’లో (Andhra Pradesh) కూడా యధావిధిగా అమలు చేయాలని డిమాండ్ చేసింది. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో గల ఉద్యోగాలలో పూర్తి స్థాయిలో సత్వరమే అమలు చేయాలని పోరాట వేదిక ఏపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది.

ఆంధ్ర ప్రదేశ్’లో గత రెండు సంవత్సరాల్లో లక్షలాది ఉద్యోగాలను భర్తీ చేసింది. కానీ వాటిలో ఈ EWS రిజర్వేషన్లను ఏపీ ప్రభుత్వం అమలు చేయలేదు. ఇందువల్ల వేలాది మంది ఓసీ విద్యార్థులు ఉద్యోగ అవకాశాలను కోల్పోయారు. ఓసీ సామజిక వర్గాలకు చెందిన రెడ్డి, కమ్మ, బ్రాహ్మణ, వైశ్య, క్షత్రియ, వెలమ, మార్వాడి, కాపు, తెలగ, బలిజ, ఒంటరి, సయ్యద్’లు తదితర వర్గాల నిరుద్యోగులు తీవ్రంగా నష్టపోయారు అని వీరు ప్రభుత్వానికి సమర్పించిన లేఖలో పేర్కొన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం ఓసీ సామజిక వర్గాల వారిని ఓటు బ్యాంకుగా పరిగణించడం లేదనే భావన ఓసీ వర్గాల్లో కలుగుతోంది అని తమ లేఖలో పొర్కొన్నారు. ప్రభుత్వం యొక్క ఓటు బ్యాంకు రాజకీయాల వల్ల నిరుపేద, పేద, మధ్య తరగతి ఓసీలు తీవ్రంగా నష్టపోతున్నారు అని వీరు పేర్కొన్నారు. EWS రిజర్వేషన్లు అమలుపై కోర్టుల్లో ఏవిధమైన అభ్యంతరాలు కూడా లేవు. అయినా రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు అమలు చేయడం లేదని వీరు ఆవేదన వ్యక్తం చేశారు.

ఓసీలపై సవతి ప్రేమ?

ఏపీ ప్రభుత్వం ఓసీలపై సవతి ప్రేమ చూపుతోంది అని EWS రిజర్వేషన్ పోరాట వేదిక తమ లేఖలో ఆరోపించింది. రాజ్యాంగబద్ధమైన ఓసీల హక్కులను ప్రభుత్వం పరిరక్షించడం లేదు. వీరికి జరుగుతున్న అన్యాయం పట్ల ప్రతిపక్ష పార్టీలు కూడా తగిన విధంగా స్పందించడం లేదని తమ లేఖలో ఆరోపించారు.

ఓసీల్లో ఉన్న నిరుపేద, పేద, మధ్య తరగతి నిరుద్యోగులకు జరుగుతున్న సామాజిక అన్యాయాన్ని ప్రభుత్వం పరిశీలించి సత్వరమే న్యాయం చేయాలని EWS రిజర్వేషన్ పోరాట వేదిక డిమాండ్ చేసింది. దీనికి సంబంధించి ఉత్తర్వులను తక్షణమే ప్రభుత్వం ఇవ్వాలని తాము సమర్పించిన లేఖలో డిమాండ్ చేశారు.

Narappa Cinema Sensor Completed