Maddi anjaneya swamyMaddi anjaneya swamy

పశ్చిమగోదావరి (west Godavari) ఏలూరు (Eluru) జిల్లా, జంగారెడ్డిగూడెం మండలము, గురవాయిగూడెం గ్రామము నందు తెల్ల మద్ది చెట్టు క్రింద స్వయంభువులై వెలిసిన శ్రీ మద్ది ఆంజనేయస్వామి (Maddi Anjaneya Swamy) వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామి వారి దర్శనార్ధము చుట్టు ప్రక్కల గ్రామముల నుండియే గాక సుదూర ప్రాంతముల నుండి అధిక సంఖ్యలో భక్తులు విచ్చేసారు. శ్రీస్వామి వారి ఆలయము చుట్టూ 108 ప్రదక్షణలు చేసి, మొక్కుబడులు తీర్చుకున్నారు.

స్వామి (Maddi Anjaneya Swamy) వారికి అత్యంత ప్రీతీకరమైన తమలపాకులు (నాగవల్లీ దళములు)తో అష్టోత్తరం పూజలను, అన్నప్రాసనలు, వాహనం పూజలను నిర్వహించుకునారు.

స్వామి వారి దర్శనార్దం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫుడ్ కమీషన్ మెంబర్ నాగాబత్తుల శ్రీనివాసరావు (Nagabathula Srinivasa Rao) కుటుంబ సభ్యుల సమేతఃముగా విచ్చేసి స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించరు. వీరిని ఆలయ కార్యనిర్వహణాధికారి స్వామి వారి శేషవస్త్రములతో సత్కరించి ప్రసాదములు అందజేసారు.

పశ్చిమగోదావరిజిల్లా ఉంగుటూరు నీలాద్రిపురం గ్రామస్తులచే భజన కార్యక్రమము జరుపబడినది. శ్రీ స్వామి వారి దర్శనముంకు విచ్చేసిన సుమారు 1150 మంది భక్తులకు స్వామి వారి నిత్య అన్నదాన సత్రం నందు అన్నప్రసాద వితరణ జరుపబడినది.

మంగళవారం మద్యాహ్నం గం.04.30 ని.ల.వరకు శ్రీ సామి వారి దేవస్థానమునకు వివిధ సేవల రూపేణ రూ. 1,35,250/- లు సమకూరినది. స్వామి వారి దర్శనముంకు విచ్చేసిన భక్తులకు ఎటువంటి అసౌకర్యము కలగకుండా ఆలయ పర్యవేక్షకులు జవ్వాది కృష్ణ పర్యవేక్షణలో తగిన ఏర్పాట్లు గావించినట్లు ఆలయ ధర్మకర్తల మండలి అద్యక్షురాలు శ్రీమతి సరితా విజయభాస్కర రెడ్డి మరియు ఆలయ కార్యనిర్వహణాధికారి ఆకుల కొండలరావు తెలియజేశారు. .

జంగారెడ్డిగూడెం నుండి గరువు బాబురావు, 9948175358

జంగారెడ్డిగూడెంలో ఘ‌నంగా స్వాతంత్ర దినోత్స‌వ వేడుకలు

Spread the love