53 Houses demolished53 Houses demolished

రాజకీయకక్ష సాధింపులో భాగంగా, అవసరం లేని ఇప్పటం గ్రామంలో (Ippatam village) రోడ్డు వేస్తామని (Road Expansion) 53 ఇళ్లు కూల్చిన జగన్ సర్కారు అంటూ జనసేన ఒక వ్యంగ్య కార్టూన్ (Janasena Cartoon) విడుదల చేసింది.

ఒక పక్కన వైసీపీ (YCP) జనసేనపై (Janasena) చేస్తున్న ప్రతి విమర్శలకు బెదరకుండా జనసేనాని ఇప్పటంపై తన పోరాటాన్ని కొనసాగిస్తున్నారు.

ఇప్పటంలో ఉన్న వైస్సార్ విగ్రహం (YSR Statue) తీసేసారు అని వైస్సార్ పార్టీ శ్రేణులు ప్రచారం చేస్తున్నాయి. లేదు వైస్సార్ విగ్రహం ఇప్పటికీ అక్కడే ఉన్నదీ అని జనసేన పార్టీ శ్రేణులు చెబుతున్నాయి.

ఇది ఇలా ఉండగా, ఇప్పటంలో ఉన్న రెండు విగ్రహాల్లో పాతది అయిన ఒక వైస్సార్ విగ్రహాన్ని తీసివేశారు. వివాదాస్పద స్థలంలో ఉన్న రెండవ వైస్సార్ విగ్రహం సోమవారం సాయంకాలం వరకు తీయలేదు అని స్పష్టమైన సమాచారం ఉన్నది. ఆ రెండవ వివాదాస్పద వైస్సార్ విగ్రహం ఇప్పటంలో ఇప్పటికీ ఉన్నదీ అని జనసేన వర్గాలు తెలియ జేస్తున్నాయి.

మునుగోడులో తెరాస ఘన విజయం

Spread the love