JanasenaniJanasenani

భరత ఖండం మొత్తంలో పార్టీ మీటింగుల్లో జాతీయ జెండా (National Flag) ఎగిరే పార్టీ జనసేన పార్టీ (Janasena Party). అలానే ప్రసంగం చివరిలో భారత్ మాతాకి జై జై… (Bharat Mata ki jai) హింద్ అని చెప్పే దేశభక్తి గల నాయకుడు ఉన్న పార్టీ జనసేన పార్టీ. అన్నిచోట్లా ఓడినా ఓటమి నాకు లెక్క లేదబ్బా… నిత్యం పోరాడే వాడు నిత్యం గెలుస్తూనే ఉంటాడమ్మా…. అని ఆచరణలో నిరూపిస్తున్న నాయకుడు ఉన్న ఏకైక పార్టీ జనసేన పార్టీ. ఒక్క జనసేనలో (Janasena) తప్ప మరే పార్టీలో కూడా ఇంత దేశ భక్తి లేదు.

జనంలోంచి వచ్చిన నాయకుడు

జైల్ ల్లోంచి కాకుండా జనంలోంచి వచ్చిన నాయకుడు ఉన్న పార్టీ కూడా జనసేన పార్టీనే. నేర చరిత్ర (Criminal History) ఎరుగని నాయకుడు ఉన్న పార్టీ జనసేన పార్టీ. రక్త మాంసాలను చెమటగా చిందిస్తూ, ప్రాణాలను కూడా పణంగా పెట్టి సంపాదించిన సొంత ధనాన్ని సొంతానికి వాడుకోకుండా ప్రజలకు పంచే నాయకుడున్న పార్టీ జనసేన పార్టీ.

ముఖానికి రంగు వేసుకొని సంపాదించిన సొమ్ముని దానం చేయడానికి తప్ప తన బిడ్డలకు వాడుకోలేని వ్యక్తి ఉన్న పార్టీ జనసేన పార్టీ. ప్రజా ధనాన్ని (Public Money) ఒక్క రూపాయి కూడా దోచుకోని నీతివంతుడు (Honest person), నిజాయితీ పరుడు ఉన్న పార్టీ జనసేన పార్టీ. చిప్పకూడు తిని కూడా చప్పుళ్ళు చేసే నేరగాళ్లకు భయపడని ఆరు అడుగుల మార్షల్ ఆర్ట్స్ (Marshal arts) రూపం ఉన్న నాయకుడు ఉన్న పార్టీ జనసేన పార్టీ. అతడే ఆరడుగుల బుల్లెట్. అంజనీ పుత్రుడు (Anjani Putrudu). జనసేనాని (Janasenani) పవన్ కళ్యాణ్ (Pawan Kalyan).

దేహానికి ధర్మానికి ఆరు అడుగుల ప్రతి రూపం

దేవాలయాల గురించి ప్రశ్నించిన గొప్ప దైవ భక్తుడు (Devotee). పర మంతాలను కూడా ప్రేమించే గొప్ప తాత్వికుడు మన పవన్ కళ్యాణ్. సుభాష్ చంద్ర బోస్ (Subash Chandra Bose) అస్థికలు గురించి మాట్లాడిన దేశ భక్తుడు. దేహానికి ధర్మానికి ఆరు అడుగుల ప్రతి రూపం ఈ జనసేనాని పవన్ కళ్యాణ్. ఆంధ్ర రాష్ట్ర హనుమంతుడు. అధర్మం పాలిట ఆరు అడుగుల రామబాణం (Rama Banam). అతడే జనసేనాని. అతడే పవన్ కళ్యాణ్.

అంత గొప్ప జనసేనాని మన పుణ్య భూమిలో పుట్టి మనముందుకు మన సమస్యల పరిస్కారం కోసం వస్తున్నారు. ధర్మానికి ప్రతిరూపమైన జనసేనాని మానవ రూపంలో మన ముందుకు వస్తున్నాడు. అటువంటి నిజాయితీ పరుడైన జనసేనాని ప్రజలంతా మద్దతు పలకాలి. అభిమానులు, జనసైనికులు సేనాని ఆగమనానికి ఎదురెళ్లి పూలవర్షం కురిపించాలి. మీ ఆధరణే ధర్మానికి కొండంత బలం. నీతికి వెయ్యి ఏనుగుల శక్తి వచ్చినట్లు అవుతుంది.

నిస్వార్థ నాయకుడికి అండగా

ధనానికి లొంగ కుండా ధర్మం కోసం నీతి గల వేదికను జనసేనాని ఎన్నుకొన్నారు. అటువంటి నిస్వార్థ నాయకుడికి అండగా ఉంటున్న ప్రతీ నాయకుడికీ కూడా చేదోడుగా ఉండాలి. జనసేన పార్టీ అధిపతి పవన్ కళ్యాణ్’కి, ఆయనకు అండగా ఉంటున్న నాయకులకు, శ్రీరాముడు వెంట నడిచే వానర సైన్యం లాంటి జనసైనికులకు, వీరికి మద్దతునివ్వబోతున్న అశేష ప్రజానీకానికి, అందరికీ సర్వ శక్తి సర్వ కార్య సిద్ది సర్వ జయం విజయీభవ…

పాలకులకు స్వామీజీ హితోపదేశం

ప్రజలు వేసే ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా గత ప్రభుత్వం తప్పు చేసింది కాబట్టి మేమూ తప్పు చేస్తాం అన్నట్లు నేటి పాలకులు మాట్లాడుతున్నారు. అలా మాట్లాడుతూ సమస్యను నేటి ప్రభుత్వ నాయకులు పక్కదారి పట్టిస్తున్నారు. పాలకులు తప్పించుకోకుండ ప్రజా ప్రశ్నలకు సూటిగా సమాధానం చెప్పాలి. ప్రజల పక్షాన సేనాని లేవనెత్తుతున్న ప్రశ్నలకు పాలకులు పరిష్కారం చూపాలి.

గత ప్రభుత్వం పేరు చెప్పి తప్పించుకోలేరు?

గత ప్రభుత్వం తప్పు చేసింది కాబట్టే ఆ ప్రభుత్వాన్ని ఓడించి నేటి ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకున్నారు. రేపు ప్రభుత్వం మారితే మీ ప్రభుత్వం పేరు చెప్పి ఆ రాబోయే కొత్త ప్రభుత్వం కూడా సమస్యలనుండి తప్పించుకోవచ్చా? అలా వచ్చే ప్రతీ ప్రభుత్వం పాత ప్రభుత్వాల పేరు చెప్పి తప్పించుకొంటే అప్పుడు ప్రజల పరిస్తితి ఏమిటి?

అభివృద్ధిని (Development) విస్మరించి, కేవలం సంక్షేమ పథకాల (welfare schemes) ప్రచారంతో 30 ఏళ్లు పాలిస్తాం అంటే కుదరదు. ప్రజా ప్రశ్నలకు పాలకులు (Rulers) నేరుగా సమాధానం చెప్పాలి. మీరు చెప్పే సమాధానాలు సంస్కార వంతమైన భాషతో చెబితో ప్రజలు సంతసిస్తారు. లేకపోతే అదే ప్రజలు ఆగ్రహిస్తారు.

పూజ్య శ్రీ మారుతీ మహానంద స్వామీజీ
(హిందూ ధర్మ గళం మండపేట కోనసీమ ఆంధ్రప్రదేశ్)

సోషల్ మీడియాను హోరెత్తించిన జనసేన
• 218 మిలియన్ల మందికి #GoodMorningCMSir