Kona Tatarao Press meetKona Tatarao Press meet

రాజధాని పేరిట దోచుకోవడం.. దాచుకోవడం మినహా చేసింది లేదు
40 నెలల పాలనలో ఉత్తరాంధ్రకు చేసిన అభివృద్ధి ఏంటి?
విశాఖకు ఎన్ని ప్రాజెక్టులు, ఎన్ని పరిశ్రమలు తెచ్చారు?
పవన్ కళ్యాణ్ ప్రశ్నలకి మంత్రులు సమాధానం చెప్పాలి
ప్రభుత్వ వైఫల్యాలు ప్రశ్నిస్తే.. గ్రామ సింహాల్లా మొరుగుతారా?
మీడియా సమావేశంలో జనసేన పార్టీ పీఏసీ సభ్యులు కోన తాతారావు

వికేంద్రీకరణ (Decentralization), విశాఖ రాజధాని (Visakha capital) అంటూ రాష్ట్ర మంత్రులు వీధి నాటకాలతో ఉత్తరాంధ్ర (Uttarandhra) ప్రజల్ని మోసం చేయాలని చూస్తున్నారని జనసేన పార్టీ (Janasena Party) పీఏసీ సభ్యులు కోన తాతారావు (Kona Tatarao) స్పష్టం చేశారు. వైసీపీ ప్రభుత్వ (YCP Government) బూటకపు మాటలు నమ్మే పరిస్థితుల్లో ప్రజలు లేరన్నారు. జగన్ రెడ్డి (Jagan Reddy) నేతృత్వంలో అడుగడుగునా జన వంచక పాలన సాగుతోందన్నారు. ప్రభుత్వ వైఫల్యాలు ప్రశ్నించినందుకు మంత్రులు గ్రామ సింహాల్లా మారి మొరుగుతున్నారని తెలిపారు. అమర్నాథ్ లాంటి ……. అరుపులకి ఎవరూ భయపడరని కోన తాతారావు చెప్పారు.

మంగళవారం విశాఖలో పార్టీ రాష్ట్ర నాయకులతో కలసి కోన తాతారావు మీడియా సమావేశం (Janasena Press meet) నిర్వహించారు. ఈ సందర్భంగా కోన తాతారావు మాట్లాడుతూ “జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ట్విట్టర్ మాధ్యమం ద్వారా వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే.. మంత్రులంతా ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం మొదలు పెట్టారు అని కోన తాతారావు అన్నారు.

ఉత్తరాంధ్ర మంత్రులకు సవాల్…

ఉత్తరాంధ్రకు ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రులు (Uttarandhra ministers) తమ యజమానికి కాస్త ఎక్కువ విశ్వాసం చూపే ప్రయత్నం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ మీద అవాకులు చెవాకులు పేలుతున్న మంత్రులు అమర్నాథ్, బొత్స సత్యనారాయణ, ధర్మానలకు ఉత్తరాంధ్ర ప్రాంతవాసులుగా చిన్న సవాలు విసురుతున్నాం. దాన్ని స్వీకరించి ఉత్తరాంధ్ర ప్రజలకు సామాధానం చెప్పే దమ్ము మీకుందా? వైసీపీ అధికారంలోకి వచ్చిన 40 నెలల కాలంలో ఉత్తరాంధ్ర ప్రాంతానికి వైసీపీ ప్రభుత్వం చేసిన అభివృద్ధిపై శ్వేతపత్రం విడుదల చేయగలరా?

అమర్నాథ్ (Gudiwada Amarnath) పరిశ్రమల మంత్రిగా విశాఖకు ఒక్క పరిశ్రమ గాని, ఒక్క ప్రాజెక్టుగాని తెచ్చారా?

దసపల్లా భూముల (Dasapalla lands) నుంచి రుషికొండ (Rushikonda) వరకు దొరికిన భూమినల్లా అధికారుల్ని భయపెట్టి లాక్కోవడం, పర్యావరణాన్ని నాశనం చేయడం మినహా మీరు చేసిందేంటో ప్రజలకు చెప్పాలని జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం.

మీ యజమానురాలు.. ముఖ్యమంత్రి గారి సతీమణి శ్రీమతి భారతిరెడ్డి కోసం ప్యాలెస్ నిర్మాణానికి రుషికొండ బహూకరించిన మాట వాస్తవమా? కాదా? ప్రజలకు చెప్పాలి అని జనసేన నాయకులు డిమాండ్ చేస్తున్నారు.

• దమ్ముంటే విజయసాయి ఆక్రమణల్ని అడ్డుకోండి

విశాఖ వీధుల్లో రికార్డింగ్ డాన్సులు వేసుకునే మంత్రి అమర్నాథ్ లాంటి వారు ఏదో మంత్రి పదవి కాపాడుకోవడానికి పవన్ కళ్యాణ్ మీద విమర్శలు చేశారంటే సరే.. నాలుగు దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్న ధర్మాన, బొత్సల బుద్ది ఏమయ్యింది. ఉత్తరాంధ్రలో పుట్టిన మీకు జన్మభూమి మీద నిజంగా ప్రేమ ఉంటే మీ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆక్రమణలను అడ్డుకోండి. విశాఖ చుట్టూ ఎవరి స్థాయిలో వారు భూ దోపిడి చేస్తున్నారు. మంత్రి అమర్నాథ్, అతని అనుచరులు బయ్యవరం కొండలు, వాగులు ఆక్రమించి అనధికారికంగా వేసిన లే అవుట్లపై గౌరవ లోకాయుక్త విచారణకు ఆదేశించిన మాట వాస్తవం కాదా? పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల ముందే చెప్పారు వైసీపీకి ఓటు వేస్తే విశాఖ చుట్టూ ఉన్న కొండలు, గుట్టలు దోచేస్తారని. జనసేనాని చెప్పినట్టే వైసీపీ నాయకులు ఖాళీగా కనబడిన భూములన్నీ మాయం చేస్తున్నారు అని కోన తాతారావు అన్నారు.

• మీ ధ్వంస రచనలన్నీ విశాఖ ప్రజలు పసిగడుతున్నారు

జగన్ రెడ్డి ప్రభుత్వానికి (Jagan Reddy Government) ఒక్క రాజధాని కట్టేందుకే శక్తి లేదు. మూడు రాజధానులు కడతామంటే విశాఖ ప్రజలు నమ్ముతారా? ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టడానికి, ప్రజల మధ్య గొడవలు పెట్టడానికే ఈ ధ్వంస రచనలన్న సంగతి ప్రజలు గ్రహించ లేరనుకున్నారా? ఉత్తరాంధ్ర ప్రజలకు వైసీపీ కపట నాటకాలు అర్థమైపోయాయి. నిజాయితీ, నిబద్దతతో కూడిన రాజకీయాలు చేస్తున్న పవన్ కళ్యాణ్’కి పట్టం కట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు. మీ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయి” అని కోన తాతారావు అన్నారు.

మీడియా సమావేశంలో పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సుందరపు విజయ్ కుమార్, పార్టీ నాయకులు పీవీఎస్ఎన్ రాజు, డా.పంచకర్ల సందీప్, శ్రీమతి పసుపులేటి ఉషాకిరణ్, పీతల మూర్తి యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

వైసీపీ నాయకులపై జనసేన నాయకులు చేసిన తీవ్రమైన ఆరోపణలపై వైసీపీ ఎలా స్పందిస్తుందో చూడాలి.

మీడియా స్వేచ్ఛను హరిస్తున్న ప్రభుత్వాలు: ఐజేయూ అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి

Spread the love