Rajyadhikaram for KapuRajyadhikaram for Kapu
కాపులు (Kapu) అసంతృప్తితో రగిలిపోతున్నారని ఒకపక్కన జనసేనపై (Janasena) వైసీపీ (YCP) విష ప్రచారం చేస్తున్నది. మరొపక్కన టీడీపీ (TDP) జనసేన మద్దతుదారులపై వివక్షత చూపుతున్నదని జనసేన మద్దతు దారులు, ప్రధానంగా కాపులు రగిలి పోతున్నారు. 
ఇంతకీ పవన్ కళ్యాణ్ కాపులను మోసం చేస్తున్నాడా? పవన్ కళ్యాణ్’పై కాపుల్లో అసంతృప్తి అనే YCP చేస్తున్న ప్రచారంలో వాస్తవం ఎంత? అసలు పవన్ చేసిన తప్పు ఏమిటి అనేది చర్చిద్దాం?

సేనానిపై ప్రశ్న 1.: పవన్ కళ్యాణ్ గెలిచాక కాపులకు అన్యాయం జరుగుతున్నది?

సమాధానం: అసలు 1956 నుండి నేటి వరకు కాపులకు న్యాయం ఎప్పుడు జరిగింది. రెడ్డి ముఖ్యమంత్రుల్లో గాని, కమ్మ ముఖ్యమంత్రుల్లో గాని కాపులకు న్యాయం చేసిన ముఖ్యమంత్రి ఎవరు? అసలు తమ తమ స్వార్ధం కోసం తప్ప కాపులు కోసం ఉద్యమించిన కాపు నాయకులూ ఎవరు? కాపు సంఘాలు ఏవి? పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవ్వనే లేదు. పవన్ కళ్యాణ్ సీఎం అవ్వకుండానే పవన్ కళ్యాణ్ వల్ల కాపులకు అన్యాయం అనడం తప్పు.
YSR తో సహా రెడ్లు, రెడ్డి ప్రభుత్వాలు కాపులకు చేసిన మోసాలను, అన్యాయాలను కప్పిపుచ్చి, ఒక్క చంద్రబాబు మీదనే ఉద్యమించడం కాపులు చేస్తున్న తప్పు. కమ్మ వ్యతిరేక తతో కాపులు నాశనం అయిపోతున్నారు అనే వాస్తవాన్ని కాపులు గ్రహించాలి.

సేనానిపై ప్రశ్న 2.: కాపు రిజర్వేషన్లపై పవన్ కళ్యాణ్ ఎందుకు స్పందించడం లేదు?

సమాధానం: జనసేన అధికారంలోకి వస్తే, కాపులకు రిజర్వేషన్లను కల్పిస్తాను అని పవన్ కళ్యాణ్ తన పార్టీ 2019 మానిఫెస్టోలో పెట్టారు? అప్పుడు జనసేన పార్టీ గెలిచి ఉంటే కాపులు రిజర్వేషన్లు వచ్చి ఉండేవి ఏమో? అప్పుడు సేనాని గెలిస్తే మనకి అడిగే హక్కు కూడా ఉండేది. జనసేన 2024 మానిఫెస్టోలో కాపు రేజర్వేషన్లు గురించి హామీ ఇవ్వలేదు. అయినా ఒక కులం హక్కుల కోసం ఆ కుల సంఘాలు అనగా కాపు సంఘాలు పోరాటం చేయాలి గాని పవన్ కళ్యాణ్ కాదు. అలానే కాపు హక్కులా కోసం టీడీపీపై పోరాటం చెయ్యాలి గాని కేవలం 21 సీట్లు మాత్రమే ఉన్న పవన్ కళ్యాణ్ పై కాదు అని కాపులు తెలిసి కోవాలి.

సేనానిపై ప్రశ్న 3.: కాపు కార్పొరేషన్ కి ఇవ్వాలిసిన నిధులపై పవన్ కళ్యాణ్ ఎందుకు మాట్లాడం లేదు?

సమాధానం: కాపు కార్పొరేషన్ కి నిధులు ఇస్తాను అని హామీ ఇచ్చింది ( 2014 ఎన్నికల అనంతర ఉద్యమాల్లో) చంద్రబాబు నాయుడు గారు . అప్పుడు నిధులు ఇచ్చారు కూడా. 2019 లో ప్రభుత్వం మారాక కార్పొరేషన్ నిర్వీర్యం అయినా కాపులు నాడు నోరు ఎత్తలేదు. ఇప్పుడు ఇదే అలుసుగా తీసికొని, టీడీపీ కాపు కార్పొరేషన్ ని నిర్వీర్యం చేస్తున్నది. దీనిపై పోరాటం చేయాల్సింది కాపులు, కాపు సంఘాలు తప్ప పవన్ కళ్యాణ్ కాదు. పవన్ కళ్యాణ్ ఒక పార్టీ అధినేతనే గాని కాపు సంఘ నాయకుడు కాదు. పవన్ కళ్యాణ్ పై కాపు ముందర వేయడం కోసేమే టీడీపీ కాపులను అణచివేస్తున్నది అని గ్రహించాలి.

సేనానిపై ప్రశ్న 4.: EWS రిజర్వేషన్లపై పవన్ కళ్యాణ్ ఎందుకు పోరాటం చేయడం లేదు?

సమాధానం: EWS రిజర్వేషన్ పై హామీ ఇచ్చింది టీడీపీ ప్రభుత్వం. అమలు చేయడానికి నాడు చర్యలు తీసికొంది. అయితే వైసీపీ ప్రభుత్వం వచ్చాక EWS అమలుపై అడ్డు తగిలింది జగన్ మోహన్ రెడ్డి. అప్పుడు కాపులు, కాపు సంఘాలు ఉద్యమించి ఉంటే, EWS వచ్చి ఉండేది. కాపులు, కాపు సంఘాలు ఆ నాడు మౌనం వహించి, ఈనాడు మాట్లాడం వల్ల ఉపయోగం ఏమిటి? కాపులు తెలివైన వాళ్ళు అయితే EWS లో వాటా అమలు జరపమని టీడీపీ ప్రభుత్వంపై వత్తిడి తేవాలి గాని పవన్ కళ్యాణ్ పై కాదు. కాపులు ఎక్కిన కొమ్మ నరుక్కొనే అమాయకులు అని చెప్పడానికి ఇదే చక్కటి ఉదాహరణ.

సేనానిపై ప్రశ్న 5.: కాపులకు రాజ్యాధికారం, కావాలి అలానే రిజర్వేషన్ కావాలి. దీనిపై పవన్ స్పందించాలి?

సమాధానం: ఏ జర్వేషన్ ఉందని కమ్మలు, రెడ్లు అధికారాన్ని అనుభవిస్తున్నారు. సమాజ సంపదలో మెజారిటీ భాగాన్ని కలిగి ఉన్నారు. రిజర్వేషన్ ఉన్న దళితులూ, బీసీలు ఎందుకు అధికారాన్ని పొందలేక పోతున్నారు? సంపన్నులు ఎందుకు కాలేక పోయారు. రిజర్వేషన్లు అన్నిటికీ సమాధానం కాదు. అందుకే రాజ్యాధికారం కావాలంటే రిజర్వేషన్ వదులు కోవాలి అలానే రిజర్వేషన్ కావాలి అంటే రాజ్యాధికారం వదులుకోవాలి. రెండు కావాలి అని అనడం కాపులు ఎక్కిన కొమ్మను నరుక్కోవడం లాంటిదే…

సేనానిపై ప్రశ్న 6.: అసలు రాజ్యాధికారం సాధనలో పవన్ కళ్యాణ్ సంధించింది ఏమిటి?

సమాధానం: ఒకపక్కన కాపులు వాస్తవాలు తెలిసికోకుండా ఒక పార్టీని గెలిపించడం ఆ తరువాత గెలిచిన పార్టీతో గొడవలు పెట్టుకొని మరో పార్టీని గెలిపించడం మాత్రమే కాపులు చేస్తున్నారు. కాపుల ఆలోచనలో, ఆచరణలో స్టెబిలిటీ లేదు. మరో పక్కన టీడీపీ, వైసీపీ పార్టీలను ఒకేసారి ఎదుర్కొనే సత్తా జనసేనకు లేదు అలానే కాపులకు లేదు. అందుకే పవన్ కళ్యాణ్ ఒక పార్టీతో ఒత్తు పెట్టుకొన్నారు. అది టీడీపీతో పొత్తు పెట్టుకున్నా లేక వైసీపీతో పొత్తు పెట్టుకున్నా ఒక్కటే. ఏ రాయి అయినా పళ్ళు ఊడగొట్టుకోవడానికి ఒక్కటే అన్నట్లు పొత్తు జనసేనకు అవసరం అన్నది కాపులు గమనించాలి. పవన్ పొత్తుల్లో వెళ్లడం రాజ్యాధికార సాధనలో భాగమే అని కాపులు గుర్తించాలి. పొత్తు లేకపోతే జనసేన నిలదొక్కుకోగలదా అని కాపులు ఆలోచన చేయాలి.

సేనానిపై ప్రశ్న 7.: అసలు పవన్ కళ్యాణ్ కాపులను ఎందుకు కలుపుకోవడం లేదు?

సమాధానం: అసలు జనసేన పార్టీలో మెజారిటీ పదవులు కాపులే దక్కించుకున్నారు అనే వాస్తవాన్ని కాపులు, కాపు సంఘాలు తెలిసికోక పోవడం విచారకరం. అలానే జనసేన పార్టీ ఒక్క కాపులనే కాదు ఏ కుల సంఘాన్ని కూడా చేరదీయడం లేదు. కానీ ప్రజల్లో జనసేన రోజు రోజుకీ చొచ్చుకు పోతున్నది. తన ఓటు బ్యాంకుని జనసేన భారీగా పెంచుకొంటూ పోతున్నది. ఇది జనసేన పార్టీకి మంచిదే అని కాపులు తెలుసుకోకపోవడం విచారకరం.
అయితే పవన్ కళ్యాణ్ ప్రజాసేవ పేరుతో పార్టీని, పార్టీ కార్యకర్తలను, తనకు మద్దతు నిస్తున్న వర్గాలను పట్టించుకోకపోవడం ముమ్మాటికి తప్పే. దీనికి పవన్ కళ్యాణ్ గారిలో మార్పు రావాల్సింది ఉంది.

సేనానిపై ప్రశ్న 8.: ఇంతకీ కాపుల కింకర్తవ్యం ఏమిటి?

సమాధానం: దశాబ్దాలుగా కాంగ్రెస్ గాని, టీడీపీ గాని వైసీపీ గాని కాపులకు అన్యాయం చేస్తూనే ఉన్నవి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గాని పవన్ కళ్యాణ్ పార్టీని గాని కాపులు దూరం చేసికొంటే మరల టీడీపీ, వైసీపీలే ఉంటాయి. ఈ రెండు పార్టీలు కాపులకు అన్యాయం చేస్తూనే ఉంటాయి.
బీజేపీ తాను ఇచ్చిన హామీలను నెరవేర్హుకోవడానికి BJP అధికారంలోకి అనంతరం దాదాపు 30 సంవత్సరాలు  పట్టింది. జనసేన అధికారంలోకి రానేలేదు. పవన్ కళ్యాణ్ ఇంకా సీఎంనే కాకుండా పవన్ ఏమి చేయగలడు అని కాపులు, అణగారిన వర్గాలు గ్రహించాలి. లేకపోతే నష్టపోయేది కాపులే.
కమ్మ రెడ్డి వర్గాలు వారి కుల పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు ఏమి జరిగినా రెడ్లు, కమ్మలు నోరు తెరవరు. అలానే కాపులు కూడా నోరెత్తరు. కానీ మొదటి సారి మాత్రమే అధికారంలోకి అది కూడా భాగస్వామ్యం ద్వారా వచ్చిన పవన్ కళ్యాణ్ గారిని మాత్రం నిరంతరం కాపులే దూషిస్తున్నారు.
సేనలో అధికభాగం పదవులు పొందిన కాపులే తిడుతుంటే, మిగిలిన వర్గాలు కూడా ఇదే పంథా అనుసరిస్తే, జనసేన పార్టీ ఉంటుందా. అప్పుడు కాపులకి అధికారం వచ్చే అవకాశం ఈ శాతబ్దికి ఉంటుందా?
అందుకే కాపులు టీడీపీ మీద కోపంతో, వైసీపీ ట్రాప్ లో పడి జనసేన పార్టీ మీద అసంతృప్తి పెంచుకొని జనసేన పార్టీని దూరం చేసికొంటే నాశనం అయ్యేది కాపులు తదితర అణగారిన వర్గాలే.
అలానే పచ్చ మీడియా, నీలి మీడియా లేదా టీడీపీ, వైసీపీల్లో ఉన్న సహచర కాపులు చేస్తున్న విష ప్రచారానికి లోనయ్యి, రాక రాక వచ్చిన జనసేన పార్టీని బలహీన పరచుకోకండి. జనసేన పార్టీ అంటూ ఉంటే అధికారం ఎప్పుడైనా వచ్చి తీరుతుంది. జనసేన లేకపోతే కాపుల ఉనికే ఉండకుండా పోతుందేమో?
సేనానిని వ్యతిరేకించే కాపు నాయకుల్లారా! ప్రస్తుత రాజకీయాల్లో పవన్ కళ్యాణ్’ని మించిన నాయకుడు ఎవరైనా ఉన్నారా? ఆలోచించండి (It’s from Akshara Satyam)
Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *