Pawan Kalyan on Netaji ashesPawan Kalyan on Netaji ashes

నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ (Netaji Subash Chandra Bose) అస్థికలను (ashes) భారత్‌కు (India) తీసుకు రావాలి. తెచ్చిన ఆ చితాభస్మాన్ని ఎర్రకోటలో (Red Fort) ఉంచాలి అని జనసేన పార్టీ (Janasena Party) అధినేత (President) పవన్‌ కళ్యాణ్‌ (Pawan Kalyan) డిమాండ్‌ చేశారు. నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ అస్థికలు టోక్యోలోని (Tokyo) రెంకోజీ ఆలయంలో (Renkoji Temple) ఉన్నాయి. వాటిని మన దేశానికీ తీసుకొని రావాలి అంటూ జనసేనాని ఉద్వేగంతో మాట్లాడారు

హైదరాబాద్‌లోని శిల్పకళావేదికలో గురువారం నేతాజీ గ్రంథ సమీక్ష (Netaji Book Review) జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా పవన్‌ కళ్యాణ్‌, ఆంధ్రప్రభ ఎడిటర్‌ వైఎస్‌ఆర్‌.శర్మ, పుస్తక రచయిత ఎంవిఆర్‌.శాస్త్రి, గంగాధర్ శాస్త్రి, పద్మజా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

నేతాజీ అస్థికలను భారత దేశానికి

పవన్‌ కళ్యాణ్‌ ఈ సందర్భంగా మాట్లాడుతూ యువతకు ఉద్వేగభరితమైన సందేశాన్ని (Inspirational Message) ఇచ్చారు. ఎంతో మంది పాలకులు మారుతున్నారు. ఎన్ని దశాబ్దాలు గడచిపోయాయి. కానీ నేటికీ నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ చితాభస్మాన్ని మన దేశానికీ ఎందుకు తేలేకపోతున్నారో చెప్పాలని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. నేతాజీ అస్థికలను భారత దేశానికి తెచ్చి వాటిని ఎర్రకోటలో ఉంచాలని జనసేనాని (Janasenani) అన్నారు.

ఆస్థికలను మన దేశానికీ తెచ్చేంత వరకూ ప్రజా ఉద్యమాన్ని (Public Movement) కొనసాగించాల్సిన అవసరం ఎంతైనా ఉందని పవన్ అన్నారు. అందుకు నాయకులపై ఒత్తిడి తీసికొని రావాలని పవన్ తెలిపారు. నేతాజీ అస్థికలు తేవాలని డిమాండ్‌ చేస్తూ #renkojitoredfort, #bringbacknetajiashes అనే హ్యాష్‌ ట్యాగ్‌లను పవన్ కళ్యాణ్ ఆవిష్కరించారు. నేతాజీ సేవలను ఈ దేశం సరిగా గుర్తించలేదని పవన్ కళ్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. నిన్నకాక మొన్న వచ్చిన వారికి శిలా ఫలకాలు, విగ్రహాలు ఏర్పాటు చేస్తున్నారు. కానీ నేతాజీ లాంటి వారిని విస్మరిస్తున్నారు అంటూ పవన్ కళ్యాణ్ ఉద్వేగంగా మాట్లాడారు.

నేతాజీ అస్థికలను డీఎన్‌ఏ టెస్టు చేసి స్వదేశానికి ఎందుకు తీసుకురావట్లేదని పవన్ డిమాండ్ చేశారు. దీనికోసం ఒక ఉద్యమాన్ని హైదరాబాద్‌ నుంచే ప్రారంభించాలని పవన్ప్ర కళ్యాణ్జ ప్రజలకు పిలుపునిచ్చారు. తనని సీఎంను చేయమని, తన సినిమాలు చూడమని కోరను. కానీ నేతాజీ అస్థికలను మన దేశానికీ తెచ్చేందుకు మద్దతు కావాలని జనసేనాని ప్రజలకు విన్నవించారు.

కనీసం వంద రూపాయల నోటుపైన అయినా నేతాజీ బొమ్మ ఉండేలా ముద్రించాలని ఆయన డిమాండ్‌ చేశారు. దేశం కోసం ప్రాణాలర్పించిన స్వాతంత్య్ర సమరయోధుల సేవలను విస్మరించడం సిగ్గుసేటని జనసేనాని అన్నారు. దేశం కోసం ప్రాణాలర్పించిన నేతాజీ లాంటి వ్యక్తులను స్మరించుకోకపోతే మనకు ఈ దేశంలో ఉండే అర్హత లేదని పవన్ అన్నారు. నేతాజీనే జైహింద్‌ నినాదాన్ని మొదట తీసికొచ్చారు అని వివరించారు.

సుభాష్‌ చంద్రబోస్‌ చనిపోయే చివరి క్షణం వరకూ దేశ స్వాతంత్య్రం (Independence) కోసం పరితపించిన అంశాన్ని ఆయన పుస్తకంలోని కొన్ని వాక్యాలను చదివి వినిపించారు. ఏదోక రోజు నేతాజీ అస్థికలు భారత్‌కు తీసుకొస్తామని నాటి ప్రధాని వాజ్‌పేయి రెంకోజీ ఆలయంలోని విజిటర్స్‌ పుస్తకంలో రాసిన విషయాన్ని జనసేనాని తెలియజేసారు.

ఉగాది తర్వాత పవన్ కళ్యాణ్ నియోజకవర్గ సమీక్షలు