Journalist welfareJournalist welfare

రాష్ట్ర ప్రభుత్వం (State Government) జర్నలిస్టుల (Journalist) సంక్షేమానికి (welfare) కూడా ప్రాధాన్యం ఇవ్వాలని ప్రియదర్శిని కళాశాల ప్రిన్సిపాల్, సామాజికవేత్త అలుగు ఆనంద శేఖర్ కోరారు. ఇటీవల మరణించిన సీనియర్ జర్నలిస్ట్ సింగులురి ప్రవీణ్ కుమార్ నాయుడు కుటుంబాన్ని ప్రభుత్వం ఆర్ధికంగా ఆదుకోవాలని జనగారెడ్డిగూడెం (Jangareddygudem) ప్రియదర్శిని కళాశాల ప్రిన్సిపాల్ ఆనంద శేఖర్ కోరారు. ప్రవీణ్ కుమార్ నాయుడు సంతాప సభ సీనియర్ జర్నలిస్ట్ గొల్లమందల శ్రీనివాసరావు అధ్యక్షతన ప్రియదర్శిని కళాశాలలో శుక్రవారం జరిగింది.

ముఖ్య అతిధిగా (Chief Guest) పాల్గొన్న అలుగు ఆనంద శేఖర్ మాట్లాడుతూ సమాజ సేవకు అంకితమై అసువులు బాసిన జర్నలిస్ట్ కుటుంబాలను ప్రభుత్వంతో పాటు ప్రతి ఒక్కరూ ఆదుకోవాలన్నారు. ఎపి డబ్యూజెఎఫ్ రాష్ట్ర కార్యదర్శి కె.ఎస్.శంఖర్ రావు మాట్లాడుతూ జర్నలిస్టులు నిత్యము ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొని రావడానికి ఎన్నో వ్యయ ప్రయాసలకు గురవుతున్నారు. వీరి కుటుంబాలు ఆర్ధికంగా ఎన్నో ఇబ్బందులకు గురి అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేసారు. ఇటీవల మరణించిన ప్రవీణ్ కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు. సీనియర్ జర్నలిస్ట్ కె.వి.రమణారావు మాట్లాడుతూ పాత్రికేయులంతా సమాజ సేవలో మునిగి, తమ కుటుంబ సభ్యుల ఆరోగ్యం పట్టించుకోవడం లేదని అన్నారు.

పాత్రికేయులందరూ గ్రూప్ ఇన్సూరెన్స్ (Group Insurance) తీసుకోవాలని చెప్పారు. అలానే ప్రభుత్వం ప్రవీణ్ కుమార్ కుటుంబానికి ఇంటిస్థలం, పక్కా గృహం (Permanent House) కేటాయించాలని ఈ సందర్భంగా కోరారు. ప్రవీణ్ కుమార్ ఇద్దరు ఆడపిల్లలకు ఆర్థిక చేయూతగా సభలో అలుగు ఆనందశేఖర్ ఐదువేల రూపాయలు, కె.ఎస్. శంఖరరావు ఐదువేల రూపాయలు, ప్రముఖ వ్యాపారవేత్త కె.ఫణికుమార్ పదివేల రూపాయలు విరాళాన్ని ప్రకటించారు.

పాత్రికేయులు, దాతలు ముందుకు వచ్చి ప్రవీణ్ కుమార్ భార్యా, పిల్లలకు ఆర్థిక సహాయాన్ని చేయాలని పిలుపునిచ్చారు. ముందుగా ప్రవీణ్ కుమార్ మృతికి సంతాప సూచికంగా పాత్రికేయులు నివాళులు అర్పించి రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టు పి.ఎన్.వి.రామారావు, జి.వెంకేటేశ్వరరావు, కె.రవికిరణ్, బండి ప్రసాద్, కలపాల శ్రీనివాసరావు, పి.నాగరాజు,లోకేష్, కె.చందు, బి.శ్రీను, కిషోర్, ఎమ్.జి.ఆర్., దీపక్ తదితరులు పాల్గొన్నారు.

అభాగ్యుల దీనగాధలంటే ఆట కాదురా శివా?