Arumilli RadhakrishnaArumilli Radhakrishna

OTS పేరుతో పేద ప్రజలపై వేధింపులు (Harassment) పెట్టడం తగదు అని తణుకు (Tanuku) ఎమ్మెల్యే (MLA) ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. ఎప్పుడో నిర్మించుకున్న పేదల ఇళ్లకు ఇప్పుడు అప్పు కట్టాలని ప్రజలపై ఒత్తిడి చేయటం దారుణమని తణుకు నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. ఓట్స్’ని వెంటనే రద్దుచేసి… పెదప్రజలకు న్యాయం చేయాలని కోరుతూ మండల అభివృద్ధి అధికారి ( MDO )కు మరియు మున్సిపల్ కమిషనర్’కు (Municipal Commissioner) వినతిపత్రం అందచేశారు.

ఈ సందర్భంగా ఆరిమిల్లి మాట్లాడుతూ పేదవాడి సొంతింటి కల నెరవేర్చాలని లక్ష్యంతో స్వర్గీయ నందమూరి తారకరామారావు (Nandamuri Taraka Rama Rao) ఆంద్రప్రదేశ్ (Andhra Pradesh) లో 1983 లో మొదటిసారి పక్కాగృహ నిర్మాణ పధకాన్ని ప్రవేశపెట్టారన్నారు. అప్పటినుంచి ఎందరో ముఖ్యమంత్రులుగా పనిచేసిన పేదల ఇళ్ల నిర్మాణానికి వారి సహాయ సహకారాలు అందిస్తూనే వచ్చారన్నారు. ‘ఒక్క చాన్స్‌ ప్లీజ్‌’ అని ప్రజలను వేడుకుని ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించిన జగన్మోహన్‌ రెడ్డి రెండున్నరేళ్లు పూర్తిచేసుకున్నారన్నారు. ఇప్పుడు కొత్తగా సంపూర్ణ గృహహక్కు (OTS) పేరుతో పేద ప్రజలనుంచి 10వేల రూపాయల నుంచి 40 వేల రూపాయలవరకు డబ్బులు వసూలు చేయటం తగదని అరిమిల్లి అన్నారు.

ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం (State Government) 4800 కోట్ల రూపాయలను వసూలుచేయటనికి తెర తీసిందన్నారు. పలు ప్రాంతాలలో OTS పథకానికి ఆగికరించకపోతే పెన్షన్లు , రేషనకార్డులు (Ration Cards) , ప్రభుత్వ పథకాలు కట్ చేస్తామని వాలంటీర్లతో బెదిరించి మరీ పేదల దగ్గర నుంచి డబ్బులు గుంజే ప్రయత్నం చేస్తున్నారన్నారు. డ్వాక్రా (Dwakra) మహిళలకు బ్యాంకుల ద్వారా అప్పులిచ్చి మరీ OTS వసూళ్లు చేస్తున్నారన్నారు.పేదలకు సంబందించిన ఇళ్లను ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వాల్సినదిగా తెలుగుదేశం పార్టీ (Telugu Desam) తరుపున డిమాండ్ చేశారు.

కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ (Municipal Chairmen) దొమ్మేటి వెంకట సుధాకర్ , నర్సాపురం పార్లమెంట్ జిల్లా ఉపాధ్యక్షులు బసవ రామకృష్ణ , పట్టణ ప్రధాన కార్యదర్శి ఒమ్మి రాంబాబు , రాష్ట్ర మహిళ కార్యదర్శి తామరపు రమణమ్మ , పట్టణ మహిళ అధ్యక్షురాలు పుప్పాల ఇందిరదేవి… నర్సాపురం పార్లమెంట్ మహిళా కార్యదర్శి తణుకు రేవతి , తణుకు మండల పార్టీ అధ్యక్షులు పితాని మోహన్, నియోజకవర్గ బి.సి సెల్ల్ అధ్యక్షులు గుబ్బల శ్రీనివాస్, నర్సాపురం పార్లమెంట్ బి.సి సెల్ల్ ఉపాధ్యక్షులు తామరపు సత్యనారాయణ… షేక్ సురాసాహెబ్, తేతలి సాయి, చదలవాడ నాని, తతపూడి మారుతిరావు, సాదే శ్యామియేల్ రాజు తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

–Garuvu Babu Rao from Jangareddygudem

ఆచార్య విడుదలలో మార్పు లేదు