Senani in RepublicSenani in Republic

చిత్ర పరిశ్రమను ఆపడం భావ్యం కాదు

ఏపీ ప్రభుత్వంపై ధ్వజమెత్తిన జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌

సినీ పరిశ్రమతో (Film Industry) పెట్టుకొంటే మాడి మసైపోతారు అంటూ జనసేనాని (Janasenani) ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. సినిమాలు (Cinema) ఆపేయడం ద్వారా ఆంధ్రప్రదేశ్‌లో (Andhra Pradesh) లక్షల మంది పొట్ట గొడుతున్నారు. పవన్‌కల్యాణ్‌ (Pawan Kalyan) సినిమాను ఆపేస్తే వాళ్ళ దగ్గరికి వస్తారని భావిస్తున్నారు. అలాగే అతనొచ్చిన చిత్ర పరిశ్రమని ఆపేసినా అందరూ భయపడిపోతారు అని అనుకొంటున్నారు. అలా భయపడిపోయి తమ దగ్గరికొస్తారని వైకాపా నాయకులు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. చిత్ర పరిశ్రమ (Film Industry) వైపు కన్నెత్తి చూస్తే కాలిపోతారు జాగ్రత్త అంటూ జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ హెచ్చరించారు.

చిత్ర పరిశ్రమ నుంచి వచ్చిన సంపదను బ్యాంకుల్లో చూపించి, అప్పులు తెచ్చుకోవాలనే సినిమా టికెట్లపై పెత్తనం చెలాయించేందుకు వైసీపీ నాయకులు సిద్ధమయ్యారని జనసేనాని ఆరోపించారు. సీనియర్‌ నటుడు మోహన్‌బాబు సహా పరిశ్రమలో ప్రతి ఒక్కరూ స్పందించి, జరుగుతున్న అన్యాయంపై గళమెత్తాలని పిలుపునిచ్చారు. శనివారం రాత్రి హైదరాబాద్‌ (Hyderabad)లో జరిగిన ‘రిపబ్లిక్‌’  (Republic) సినిమా (Cinema) ముందస్తు విడుదల వేడుకకు పవన్‌ ముఖ్య అతిథిగా (Chief Guest) హాజరయ్యారు. ఈ సందర్భంగా

ఆయన ప్రసంగంలోని ముఖ్యంశాలు…

సినిమా విడుదల ముందు సాయితేజ్ ప్రమాదానికి గురికావడం బాధాకరం. సాయితేజ్ ఇంకా కోమాలోనే ఉన్నాడు, కళ్లు తెరవలేదు.

పవన్ కళ్యాణ్ సినిమాలు ఆపేస్తే.. అతను నటించిన సినిమాలు ఆపేస్తే భయపడి కాళ్ల దగ్గరకు వస్తారని అనుకుంటున్నట్టున్నారు. వాళ్లు తప్పుగా అర్ధం చేసుకుంటున్నారు.

నేనయినా, దర్శకుడైనా, నటులైనా చేసిన సినిమాలకే డబ్బులు తీసుకుంటున్నారు.. అడ్డగోలుగా వేల కోట్లు మాత్రం సంపాదించలేదు.. తప్పుడు కాంట్రాక్టులు చేసి సంపాదించలేదు..

జనాలను ఎంటర్ టైన్ చేసి డాన్సులు వేసి కిందా మీద పడి, ఒళ్లువిరగ్గొట్టుకుని కృషి చేస్తే డబ్బులు వస్తున్నాయి.

కోట్లు పెట్టుబడితో సినిమాలు చేస్తే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (AP Government) కంట్రోల్ చేస్తానంటోంది.. కష్టం మేము పడితే టిక్కెట్లు మీరు అమ్ముకుంటారా?

చిత్ర పరిశ్రమ చిన్నది అనుకుంటున్నారు.. ప్రభావం మాత్రం చాలా పెద్దది

చిత్ర పరిశ్రమలో పెద్ద పెద్ద పేర్లు ఉన్నవారు ఉన్నారు. ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్న వైసీపీ నాయకుల్ని మూసుక్కూర్చోమని చెప్పలేరా.. ఇండస్ట్రీ వైపు చూడొద్దని చెప్పలేరా.. మాట్లాడేందుకు మీకు ధైర్యం లేదా?

భయపడడానికి ఇది వైసీపీ రిపబ్లిక్ కాదు ఇండియన్ రిపబ్లిక్ (Indian Republic)

వైసీపీ రిపబ్లిక్ అని మాట్లాడితే జనం బయటకు లాక్కొచ్చి కొడతారు..

అధికారం ఉంది కదా అని పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే భవిష్యత్తు లేకుండా పోతారు

అధికారంలో ఉన్న వారు ఒళ్లు దగ్గర పెట్టుకుని ఉండాలి

గఢాఫీ లాంటి నియంతల్నే చేసిన తప్పులు వెంటాడి చివరికి చిన్న కుర్రాళ్లు కొట్టి చంపేశారు

మీడియా (Media) దృష్టి పెట్టాల్సింది సినిమా వాళ్ల మీద కాదు?

చిత్ర పరిశ్రమ చాలా సున్నితమైన అంశం.. అందుకే చాలా తేలిగ్గా టార్గెట్ చేసేస్తున్నారు.. ఉదాహరణకు తేజుకి బైక్ యాక్సిండెట్ అయితే దాని మీద విపరీతార్ధాలతో కథనాలు వేశారు

దేశంలో ఇంతకంటే ఇంట్రస్టింగ్ కథనాలు లేవా?

వైఎస్ వివేకానందరెడ్డి గారు ఎందుకు హత్యకు గురయ్యారు అనే దాని మీద మాట్లాడండి

కోడి కత్తితో ఒక నాయకుడిని అంతర్జాతీయ ఎయిర్ పోర్టులో పోడిస్తే నాటి గవర్నర్ గారు సైతం దీని వెనుక భారీ కుట్ర దాగి ఉందన్నారు.. అది ఏమయ్యిందో అడగండి..

లక్షలాది ఎకరాల పోడు భూముల్లో గిరిజనలు వ్యవసాయం చేసుకుంటుంటే అవి వారికి దక్కడం లేదు.. ఎందుక దక్కడం లేదనే అంశం మీద మాట్లాడండి

ఆరేళ్ల చిన్నారిని అన్యాయంగా, అమానుషంగా హ్యత చేస్తే దాన్ని వదిలేసి తేజ్ 45 కిలోమీటర్ల స్పీడుతో వెళ్లిపోయాడు అనే దాని మీద కథనాలు ఎందుకు?

బాగా స్పైసీగా కథనాలు కావాలి అంటే ఈ మధ్య వైసీపీ సానుభూతిపరులు కొందరు వ్యభిచారాన్ని చట్టబద్దం చేయమంటూ బయటకు వచ్చారు. దాని మీద కథనాలు నడపండి..

తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు కాపు రిజర్వేషన్ల గురించి మాట్లాడి వైసీపీ వచ్చాక కాపు రిజర్వేషన్ల గురించి ఎందుకు మాట్లాడడం లేదు అనే అంశం మీద కథనాలు వేయండి

రాయలసీమలో బలిజలు ఎందుకు నలిగిపోతున్నారో కథనాలు వేయండి.. బోయ కులస్తులకు ఎందుకు రాజకీయ ప్రాతినిధ్యం రావడం లేదో దాని మీద కథనాలు నడపిండి.. నేను గౌరవిస్తాను.

ఇడుపులపాయలో ఉన్న నేలమాళిగల్లో టన్నుల కొద్ది డబ్బుల కట్టలు ఉంటాయని పోలీసు వారు చెప్పుకుంటుంటే విన్నా దాని మీద కథనాలు నడపండి.. అలా నడిపితే వాళ్లు ఇళ్లలోకొచ్చి కడతారు.. అందుకే వాళ్ల గురించి మాట్లాడరు తేజ్ యాక్సిడెంట్ గురించి మాత్రమే మాట్లాడుతారు. అతను అమాయకుడు ఏం చేయలేడు కాబట్టి

సినిమా వాళ్లు అంటే తైతక్కలు వేసేవాళ్లు అని మాట్లాడుతున్నారు.. సినిమా తీయడం వెనుక ఎంతో కష్టం దాగి ఉంది

చిత్ర పరిశ్రమలో ప్రాంతీయ తత్వానికి, కుల తత్వానికి స్థానం లేదు.

ఏ పార్టీ సానుభూతిపరులు ఉన్నా మీకు అన్నంపెడుతున్న పరిశ్రమకు ముందు గౌరవం ఇవ్వండి

చిత్ర పరిశ్రమ జోలికి వస్తే అంతా ఏకమవ్వండి

నాతో గొడవ ఉంటే నా సినిమాలు ఆపేయండి .

మిగతావారి సినిమాల జోలికి రావొద్దని కోరుతున్నా .

సినిమాలపై ఆధారపడి హైదరాబాద్ లోనే లక్ష ల మంది బతుకుతున్నారు.

మాలో మాకు అభిప్రాయ భేదాలు ఉంటాయి.. అది శత్రుత్వం కాదు.

సాయితేజ్ ప్రమాదానికి గురికావడం బాధాకరం

సినిమా విడుదల ముందు సాయితేజ్ ప్రమాదానికి గురికావడం బాధాకరం.

అందరూ ఆనందంగా ఉండాలని కోరుకునే వ్యక్తి.. సాయితేజ్

సాయితేజ్ ఆస్పత్రిలో ఉన్నందువల్లే ఈ కార్యక్రమానికి వచ్చా

అతివేగమే సాయితేజ్ ప్రమాదానికి కారణమని ప్రచారం చేశారు

సాయితేజ్ రోడ్డుప్రమాదంపై లేనిపోని కథలు అల్లారు

ఆటోను దాటే క్రమంలో ఇసుకపై జారిపడి సాయితేజ్ కింద పడ్డాడు

సినిమాలో చెప్పిన విలువలు నిజ జీవితంలో అమలుచేయడం కష్టం.

సాయితేజ్ ఇంకా కోమాలోనే ఉన్నాడు, కళ్లు తెరవలేదు.

రాజకీయాల్లో దిగజారుడుతనంపెరుగుతోంది

సాయిధరమ్ తేజ్ ప్రమాదంపై ఏవేవో మాట్లాడుతున్నారు.