Adhimulapu sureshAdhimulapu suresh

అమ్మఒడి (Ammavadi) నిబంధనలు ఏమీ మారలేదు. చూసేవారి కళ్లే మారాయని మున్సిపల్‌ శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ (Adimulapu Suresh) తెలిపారు. అమ్మఒడి పథకంపై పచ్చ మీడియా (Media) తప్పుడు ప్రచారం జరుగుతున్నది. కానీ వీరు ఎంత గగ్గోలు పెట్టినా ప్రజలు జగన్‌పై పూర్తి విశ్వాసంతో ఉన్నారు. తల్లిపాలు తాగి రొమ్ము గుద్దేవారికి ఈ అమ్మవడి పథకం అర్ధం కాదు అని మంత్రి విమర్శించారు.

ఇదీ ఏపీ సీఎం లక్ష్యం:

పేదరికంలో ఉన్న తల్లులు, తమ పిల్లలను బడికి పంపించడం కోసం ఒక గొప్ప ఆలోచనతో సీఎం వైయస్‌ జగన్‌ (CM YS Jagan) ఈ పథకం అమలు చేస్తున్నారు. పేదరికం విద్యకు అడ్డు కావొద్దు అన్న నినాదాన్ని జగన్‌ తీసుకొచ్చారు. అందు కోసం బలమైన పునాది ఏర్పాటు చేస్తూ, 1 నుంచి 12వ తరగతి వరకు ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థల్లో చదువుతున్న నిరుపేద పిల్లలకు ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు.

ఇప్పటికే ఈ పథకంలో రెండుసార్లు పిల్లల తల్లుల ఖాతాల్లో రూ.15 వేల చొప్పున, దాదాపు రూ.13 వేల కోట్లకు పైగా మొత్తాన్ని జమ చేయడం జరిగింది. కరోనా మహమ్మారితో ఆర్థిక పరిస్థితి దారుణంగా దెబ్బ తిన్నప్పటికీ, ఇచ్చిన మాటకు కట్టుబడి, నిరుపేద కుటుంబాలకు మేలు ఆగకూడదన్న సంకల్పంతో సీఎం వైయస్‌ జగన్‌ పథకాన్ని అమలు చేశారు అని మంత్రి వివరించారు.

అర్హులు పెరిగేలా చేసిన సవరణల సారాంశం:

విద్యుత్‌ వినియోగ పరిమితిని 200 నుంచి 300 యూనిట్లకు పెంపు

విద్యార్థుల 75 శాతం హాజరు కూడా పాత నిబంధనే

తొలి ఏడాది తర్వాత 2020–21లో ఇంకా ఎక్కువ మందికి ఇచ్చారు

ఆ మేరకు అప్పుడు వార్షిక ఆదాయం, భూకమతం పరిమితి పెంపు

పట్టణాల్లో ఇంటి విస్తీర్ణం పరిమితినీ పెంపు

దాంతో రెండో ఏడాది అదనంగా 2,15,767 మంది తల్లులకు లబ్ధి

2019–20లో 42,33,098 మంది తల్లుల ఖాతాల్లో నగదు జమ

2020–21లో 44,48,865 మంది తల్లులకు ఆర్థిక సాయం

ఈ ఏడాది ఆ సంఖ్య మరింత పెరిగే అవకాశం

అయితే వాస్తవాలన్నీ ఇలా ఉంటే నారా లోకేష్‌తో పాటు, ఎల్లో మీడియా దుష్ప్రచారం చేస్తూ విషం చిమ్ముతున్నారు. ఇకనైనా వారు వాస్తవాలు తెలుసుకోవాలని మంత్రి ఆదిమూలపు సురేష్‌ వివరించారు.

అంజనీపుత్రా! పార్టీని కూడా ఆదుకోవయ్యా!
కౌలురైతు భరోసా యాత్రలో మార్పులు అవసరం